AnTuTu Score అంటే ఏంటి.. ఫోన్ కొనుగోలు చేసే సమయంలో ఈ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోవాలా..?
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు భారత్ పెద్ద మార్కెట్‌గా ఉంది. దీంతో వివిధ సెగ్మెంట్స్‌లో అనేక ఫోన్లను లాంచ్ అవుతున్నాయి. ఎంట్రీ లెవల్, బడ్జెట్, మిడ్ రేంజ్, ఫ్లాష్‌పిప్ మోడల్స్‌గా లాంచ్ అవుతున్నాయి. యూజర్లు వారి అవసరాలకు అనుగుణంగా ఫోన్‌లు కొనుగోలు చేస్తున్నారు. అయితే స్మా్ర్ట్‌ఫోన్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను విడుదల చేస్తున్న సమయంలో హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే, చిప్‌సెట్, కెమెరాలు, బ్యాటరీలు సహా ఇతర ఫీచర్‌లను హైలెట్ చేస్తుంటాయి.
విడుదలకు కొన్ని రోజుల ముందు నుంచే తమ ఫోన్ లోని స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను గురించి టీజర్‌ల రూపంలో వెల్లడిస్తుంటాయి. బెస్ట్ కెమెరా జూమింగ్ సామర్థ్యం ఉందని, గేమింగ్ కోసం బెస్ట్ చిప్‌సెట్ ఉందని, భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, కనెక్టివిటీ పరంగా బెస్ట్ ఫీచర్‌లున్నాయని, మెరుగైన డస్ట్ మరియు వాటర్ ప్రూఫ్‌గా ఉంటాయని హైలెట్ చేస్తుంటాయి.

AnTuTu స్కోర్ :
అయితే ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్న సమయంలో ప్రధానంగా AnTuTu స్కోర్‌ను ప్రస్తావిస్తున్నారు. తమ ఫోన్ కే ఎక్కువ స్కోర్ ఉందంటూ ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఏంటీ AnTuTu స్కోర్, ఈ స్కోర్ ఆధారంగా మొబైల్ కొనుగోలు చేయవచ్చా..?
AnTuTu స్కోర్ అంటే ఏంటి?
స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ సామర్థ్యాన్ని కొలిచే బెంచ్ మార్క్ ఇండెక్స్‌లో ఈ AnTuTu స్కోర్‌ను ఒకటిగా ఉంది. స్మార్ట్‌ఫోన్ CPU, UX, గ్రాఫిక్స్, ర్యాామ్ సామర్థ్యాలను టెస్ట్ చేసి, స్కోర్ రూపంలో అందిస్తారు. దీన్నే AnTuTu స్కోర్ అంటాం. ప్రస్తుతం అనేక సంస్థలు చిప్‌సెట్ వివరాలు అందించే సమయంలో ఈ స్కోర్‌ను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి.
ఈ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఫోన్ అంత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎక్కువ స్కోర్ ఉంటే.. మల్టీ టాస్కింగ్, గేమింగ్ సమయంలో హ్యాంగ్ అయ్యే అవకాశం లేదు. మరియు ఫోన్‌ను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ సమయం పాటు ఉపయోగించుకోవచ్చు.
ప్రస్తుతం స్కోర్‌లు ఎలా ఉన్నాయ్ :
ప్రస్తుతం ఎంట్రీ లెవల్ ఫోన్‌లు 2,00,000 - 4,00,000 స్కోర్‌ను కలిగి ఉంటున్నాయి. అదే మిడ్ రేంజ్ ఫోన్‌లు 4,00,000 - 7,00,000 స్కోర్‌ను కలిగి ఉంటున్నాయి. అదే ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు 7,00,000 కంటే ఎక్కువ స్కోర్‌ను కలిగి ఉంటున్నాయి.
అయితే ఈ స్కోర్ అందరూ పరిగణనలోకి తీసుకోవాలా?
కేవలం కాలింగ్, బ్రౌజింగ్, కెమెరాల కోసమే స్మార్ట్‌ఫోన్ వినియోగించే వారు ఈ AnTuTu స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. గేమింగ్, మల్టీ టాస్కింగ్, వీడియో ఎడిటింగ్ కోసం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ స్కోర్ పరిగణనలోకి తీసుకోవాలి.
ఈ స్కోర్‌ను ఎక్కడ చూడాలి?
సాధారణంగా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టీజర్‌లు లేదా లాంచ్ సమయంలో AnTuTu స్కోర్‌ను విడుదల చేస్తున్నాయి. లేకుంటే AnTuTu అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం హోం పేజీలో Ranking కేటగిరీలో స్మార్ట్‌ఫోన్‌లు వాటి AnTuTu స్కోర్ వివరాలు కనిపిస్తాయి.
మీ ఫోన్ ఉపయోగిస్తున్న ఫోన్ లేదా కొనుగోలు చేయాలని భావిస్తున్న ఫోన్ వివరాల అందించి ఈ స్కోర్ తెలుసుకోవచ్చు. అయితే గేమింగ్ కోసం ఫోన్ కొనుగోలు చేసే వారు ఈ స్కోర్‌ను పరిగణన లోకి తీసుకోవడం ఉత్తమం. మిగిలిన అవసరాల కోసం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తున్న వారు ఈ స్కోర్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.


Click it and Unblock the Notifications