ఒక్క బిట్‌కాయిన్ ఖరీదు రూ.6 లక్షలా..?

క్రిప్టోకరెన్సీగా పిలవబడుతోన్న బిట్‌కాయిన్ విలువ 10000 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో ప్రస్తుత విలువ రూ.640305) దాటే అవకాశముందని అంతర్జాతీయ మార్కెట్లు వర్గాల అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో ఒక్కో బిట్‌కాయిన్ విలువ 4500 డాలర్లుగా ఉంది (ఇండియన్ కరెన్సీలో ప్రస్తుత విలువ రూ.289423). డిజిటల్ కాయిన్ ప్లాట్‌ఫామ్స్ ప్రొవైడ్ చేసిన డేటా బేస్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 33 బిలియన్ డాలర్లు విలువ చేసే బిట్‌కాయిన్‌లు చలామణిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read More : Android One అంటే ఏంటి..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంచనాలకు అందని రీతిలో...

గతకొద్ది వారాలుగా బిట్ కాయిన్ విలువ అంచనాలకు అందని రీతిలో పెరిగిపోయిందని, డిజిటల్ కరెన్సీలో ఇదో పెద్ద రికార్డు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే బిట్‌కాయిన్ అనేది డిజిటల్ కరెన్సీ. ఈ కరెన్సీని ఆన్‌లైన్ వాలెట్‌లో నిల్వ చేసుకోవల్సి ఉంటుంది. ఇందుకు ప్రత్యేకమైన డిజటిల్ కాయిన్ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉంటాయి.

భారత్‌లో బిట్ కాయిన్ లావాదేవీలు చట్టవిరుద్ధం..

భారత్‌లో బిట్ కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటువంటి గుర్తింపునివ్వలేదు. భారత్‌లో బిట్‌కాయిన్‌లతో లావాదేవీలు జరపటమనేది చట్టవిరుద్ధం.

పేపాల్ వంటి ఆన్‌లైన్ పేమెంట్ సంస్థలు..

అంతర్జాతయంగా పేపాల్ వంటి ఆన్‌లైన్ పేమెంట్ సంస్థలు బిట్‌కాయిన్ లావాదేవీలను అనమతిస్తున్నాయి. బిట్‌కాయిన్‌లతో జరిపే నగదు లావాదేవీలకు సంబంధించి ఎటువంటి వివరాలు బయటకు పొక్కే ఆస్కారం ఉండదు.

ప్రత్యేకమైన ప్రైవేటు కీ..

బిట్‌కాయిన్‌లను నిలువ చేసుకునే వ్యాలెట్‌లకు ప్రత్యేకమైన ప్రైవేటు కీని కేటాయిస్తారు. ఈ కీని ఉపయోగించుకుని బిట్‌కాయిన్‌లను వాడుకుంటారు. బిట్‌కాయిన్‌ లావాదేవీలకు సంబంధించి సదురు వాలెట్ సృష్టించే ప్రయివేట్ కోడ్ మాత్రమే బహిర్గతమవుతుంది. ఈ కీని ఉపయోగించుకుని బిట్‌కాయిన్‌లను వాడుకుంటారు.

నేరగాళ్లను ప్రోత్సహిస్తోందని విమర్శలు..

బిట్‌కాయిన్‌ లావాదేవీలకు సంబంధించి సదురు వాలెట్ సృష్టించే ప్రయివేట్ కోడ్ మాత్రమే బహిర్గతమవుతుంది. ఈ ప్రయివేట్ కోడ్‌నే లెడ్జర్‌లో కూడా నమోదుచేస్తారు. దీనినే అడ్రస్‌గా భావించాల్సి ఉంటుంది. లెక్కలు పక్కాగా ఉన్నప్పటికి ఈ బిట్ కాయిన్‌లను ఉపయోగించిన వ్యక్తికి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉండవు. ఈ విధమైన గోప్యత కారణంగానే బిట్ కాయిన్ నేరగాళ్లను ప్రోత్సహిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వన్నాక్రై రాన్సమ్‌వేర్ దాడి నేపథ్యంలో బిట్‌కాయిన్ కరెన్సీ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
What is Bitcoin and how does it work? Is it legal?. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot