గంటకు 610కిలోమీటర్లు...!
విజయవాడ, అమరావతి నగరాల మధ్య ప్రవేశపెట్టనున్న హైపర్ లూప్
ఇప్పటికే నాలుగు రకలైన మార్గాల్లో (రోడ్డు, జల, వాయు, పట్టాలు) వాహనాలు పరుగులు పెడుతున్నాయి. ఇది మరో రకమైన మార్గం. ఈ కొత్త మార్గంలో స్టీలు గొట్టాలుంటాయి. వాటిల్లో రైలు పరుగులు పెడుతుంది. స్టీలు గొట్టాలపై సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. వీటి ఆధారంగా ఈ హైపర్ లూప్ రైలు దూసుకెళ్తుంది.

అసలు హైపర్‌లూప్ అంటే ఏమిటి?
హైపర్‌లూప్ అనేది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, రాత్రి వేళ్లలో బ్యాటరీని ఉపయోగించుకుంటుంది. రైల్లో మాదిరిగా ఇందులో కూడా బోగిలుంటాయి. మరో మాటలో చెప్పాలంటే దూర ప్రాంతాలను దగ్గర చేయడం. 745mph(1,200km/h) దీన్ని స్పేస్ఎక్స్ కంపెనీ వ్యవస్థాపకుడు, ప్రముఖ పెట్టుబడిదారుడు ఇలాన్ మాస్క్ ఈ హైపర్‌లూప్ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని 2013లో ప్రపంచానికి పరిచయం చేశారు.
గంటకు 610కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ఈ రైలు లూప్‌లో ప్రయాణికులు కూర్చుంటారు శాన్ ఫ్రాన్సిస్కో కు 30 నిమిషాల్లో ప్రయాణికులను తీసుకువచ్చినట్లు ప్రకటించింది.

హైపర్‌లూప్ ఎలా పనిచేస్తుంది?
బుల్లెట్ రైలుకు దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్టీలు గొట్టాల్లో పయనించే హైపర్ లూప్ రైలు గాల్లోనే ప్రయాణిస్తుంది. ఇది విద్యుదయస్కాంత క్షేత్రాలను ఉపయోగించుకుని భూమ్యాకర్షణ శక్తికి అతీతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే బోగీలను క్యాప్యూల్ అంటారు. క్యాప్సూల్ ముందు ఒక కంప్రెసర్ ఫ్యాన్ ఉంటుంది. ఇది క్యాప్య్సూల్ వెనుకకు గాలిని మళ్లిస్తుంది. గాలి ఎయిర్ బేరింగ్స్కు పంపబడుతుంది. ట్యూబ్స్ భూమిపైన లేదా వంతెనలపైన నిర్మించవచ్చు.
ఇవి అత్యంత శక్తివంతంగా ఉంటాయి. భూకంపాలూ కూడా వీటిని ఏం చేయలేవు. ఘర్షణను తగ్గించడానికి శక్తివంతమైన ఫ్యాన్ను హైపర్ లూప్ ముందు భాగంలో అమర్చుతారు. కింద అమర్చిన అయస్కాంత క్షేత్రాల ద్వారా క్యాప్యూల్స్ ముందుకు పయనిస్తాయి. ప్రతి క్యాప్య్సూల్స్ 6 నుంచి 8 మంది కూర్చోవచ్చు. ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా లగేజ్ కంపర్ట్ మెంట్, టీవీ ఉంటుంది.

హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ ఎలా ఉంటుంది?
హైపర్‌లూప్ వ్యవస్థను విజయవాడ మరియు అమరావతి నగర కేంద్రాల మధ్య వేశపెట్టనున్నారు. ఇది కేవలం ఐదు నిమిషాల్లోనే 35కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








