మీలాంటి ఫోన్ నంబరే మీవాళ్లకు కూడా కావాలా.. అయితే ఈ ఆఫర్ మీకోసమే..!
Jio Matching Number : ప్రముఖ టెలికాం సంస్థ జియో తన యూజర్లకు మంచి అవకాశం కల్పించింది. జియో మ్యాచింగ్ నంబర్ పేరుతో ఆఫర్ ను తీసుకొచ్చింది. మ్యాచింగ్ నంబర్ అంటే.. ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న నంబర్ ను సుమారుగా పోలి ఉండే కొత్త ఫోన్ నంబర్ ను తీసుకొనేందుకు అవకాశం ఉంది. ఈ ఆఫర్ పూర్తి ప్రయోజనాల వివరాలు.
సాధారణ ధర రూ.499 కానీ.. :
జియో యూజర్లకు ప్రస్తుతం ఈ అవకాశం ఉంది. జియో రిటైల్ అవుట్‌లెట్ లేదా జియో వెబ్‌సైట్ www.jio.com ద్వారా మ్యాచింగ్ నంబర్లను ఎంచుకోవచ్చు. అనంతరం అక్కడే యాక్టి్వ్ చేసుకోవచ్చు. ఈ సిమ్ కార్డు ధర రూ.499 గా ఉంది. అయితే భారీ తగ్గింపుతో ఈ సిమ్ కార్డును కొనుగోలు చేయవచ్చు.

కేవలం రూ.50 చెల్లించి కొనుగోలు చేయవచ్చు :
స్పెషల్ ఆఫర్ లో భాగంగా ఈ జియో మ్యాచింగ్ సిమ్ కార్డును రూ.50 చెల్లించి పొందవచ్చు. రూ.349 ద్వారా ఈ సిమ్ కార్డును యాక్టివేట్ చేసుకోవచ్చు. మరియు హైబ్రిడ్ ప్లాన్ లో భాగంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ను పొందవచ్చు. రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు.
అన్‌లిమిటెడ్ 5G డేటా :
ఈ ప్లాన్ లో రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను (Jio Subscription) కూడా అందిస్తోంది. దీంతోపాటు జియో యాప్స్‌ను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.
జియో మ్యాచింగ్ నంబర్‌ను ఎలా పొందాలి :
స్టెప్ 1 : జియో వెబ్‌సైట్ www.jio.com ను సందర్శించాలి.
స్టెప్ 2 : అనంతరం అక్కడున్న మ్యాచింగ్ నంబర్ పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 3 : అక్కడ PIN code ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 4 : మీ లొకేషన్ లో అందుబాటులో ఉండే మ్యాచింగ్ నంబర్లను అక్కడ ఎంచుకోవచ్చు.
స్టెప్ 5 : అందులో మీకు నచ్చిన నంబర్ ను ఎంచుకోవాలి. అనంతరం రూ.50 చెల్లించాల్సి, నంబర్‌ను పొందవచ్చు.
* రూ.100 రీఛార్జ్ ప్లాన్ :
ప్రస్తుతం (Jio Rs100 Recharge Plan) జియో అనేక ప్రత్యేక ప్లాన్ లను కలిగి ఉంది. రూ.100 ప్రీపెయిడ్ ప్లాన్ లో భాగంగా 5GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు జియోహాట్‌స్టార్ మొబైల్/ TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.
* రూ.198 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ లో అన్‌లిమిటెడ్ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. వ్యాలిడిటీ 14 రోజులుగా ఉంటుంది.
ఈ ప్లాన్ లో (Jio Rs.198 Recharge Plan) భాగంగా 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియోటీవీ, జియోఏఐక్లౌడ్ వంటి యాప్స్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








