కంటికి చూడలేనంత వేగంతో లైఫై, ప్లస్‌లు, మైనస్‌లు ఇవే !

ఇంటర్నెట్‌ వాడకం విపరీతంగా పెరిగిన నేటి యుగంలో అనేక కంపెనీలు, సంస్థలు ఉచితంగా వైఫైని అందిస్తున్నాయి.

|

ఇంటర్నెట్‌ వాడకం విపరీతంగా పెరిగిన నేటి యుగంలో అనేక కంపెనీలు, సంస్థలు ఉచితంగా వైఫైని అందిస్తున్నాయి. చాలామంది మొబైల్‌ నెట్‌ వినియోగం కోసం వైఫై డేటాను వాడుతున్నారు. అయితే ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వైఫై కంటే వేగవంతమైన కనెక్ట్‌విటీ కోసం వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా చాలా స్పీడ్ గా డేటా సేవలు అందించే కనెక్టివిటీ ఉంటే దానిలోకి దూకేద్దామని చాలామంది అనుకుంటున్నారు. వారి ఆశలను నెరవేర్చేందుకు ముందుకొచ్చిన సరికొత్త టెక్నాలజీ లైఫై (లైట్‌ ఫెడిలిటీ). ఇది వైఫై కంటే వంద రెట్లు వేగంగా పనిచేస్తుంది.త్వరలో ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ప్లస్‌లు, మైనస్‌లు ఓ సారి చూద్దాం.

పోర్న్ సైట్లు ఓపెన్ చేసి చూశాడు, షాక్‌తో పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తాడుపోర్న్ సైట్లు ఓపెన్ చేసి చూశాడు, షాక్‌తో పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తాడు

వైర్‌లెస్‌ తరంగాల ఆధారంగా..

వైర్‌లెస్‌ తరంగాల ఆధారంగా..

లైఫై అనేది వైర్‌లెస్‌ తరంగాల ఆధారంగా పనిచేసే టెక్నాలజీ. ఇది కాంతి తరంగాల ఆధారంగా పనిచేస్తుంది. ప్రత్యేకంగా తయారుచేసిన ఎల్‌ఈడీ లైట్లలో దీనికి సంబంధించిన మోడెమ్‌ను అమరుస్తారు.

లైట్లను ఆన్‌ చేసినప్పుడు

లైట్లను ఆన్‌ చేసినప్పుడు

ఈ తరహా రూపకల్పనలో లైట్లను ఆన్‌ చేసినప్పుడు మోడెమ్‌ నుంచి కాంతి తరంగాలు వెలువడతాయి. దీంతో స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌కు అమర్చిన ప్రత్యేక యూఎస్‌బీ డాంగిల్‌ వాటిని గుర్తించి ఇంటర్నెట్‌ తరంగాలుగా మార్చి డివైస్‌కు అందిస్తుంది.

అనువుగా లేని ప్రదేశాల్లోనూ ..

అనువుగా లేని ప్రదేశాల్లోనూ ..

వైర్‌లెస్‌ తరంగాలకు వాడేందుకు అనువుగా లేని ప్రదేశాల్లోనూ లైఫైని సులభంగా వినియోగించుకునే అవకాశాలున్నాయి. ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగదారులకు పూర్తి సెక్యూరిటీని అందిస్తుంది.

వైఫై ప్రయాణించినట్లు..
 

వైఫై ప్రయాణించినట్లు..

గోడల ద్వారా వైఫై బయటకు కూడా తరంగాలు వ్యాప్తి చెందుతాయి. కానీ లైఫై ద్వారా వచ్చే తరంగాలు కేవలం ఒకే చోట ఉంటాయి. ఇది వైఫై ప్రయాణించినట్లు గోడల ద్వారా ప్రయాణించదు. ఇతరులు దీనిని యాక్సెస్‌ చేయలేరు.

 లైఫై ద్వారా ఇంటర్నెట్‌

లైఫై ద్వారా ఇంటర్నెట్‌

కార్పొరేట్‌ కార్యాలయాలు, ఇతర సంస్థల్లో లైఫై ద్వారా ఇంటర్నెట్‌ వినియోగిస్తే సురక్షితంగా ఉండటమే కాక సుస్థిరరమైన, వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందిస్తుంది. 

హెరాల్డ్‌హోస్‌ అనే శాస్త్రవేత్త

హెరాల్డ్‌హోస్‌ అనే శాస్త్రవేత్త

లైఫై విధానాన్ని స్కాట్‌ల్యాండ్‌ కేంద్రంగా నడుస్తున్న ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన హెరాల్డ్‌హోస్‌ అనే శాస్త్రవేత్త 2011లో కనుగొన్నారు. అప్పటినుంచే దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి.

 విజిబుల్‌ లైట్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీతో..

విజిబుల్‌ లైట్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీతో..

ఇప్పటికే విజిబుల్‌ లైట్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీతో రకరకాల పరిశోధనలు చేశారు. లైఫై ద్వారా 224 జీబీపీఎస్‌ (గిగాబైట్‌ పర్‌ సెకన్‌)సామర్థ్యంతో డేటాను పంపిణీ చేసే అవకాశం ఉంది.

కంటితో చూడలేనంత వేగంగా

కంటితో చూడలేనంత వేగంగా

ఇది కంటితో చూడలేనంత వేగంగా పనిచేస్తుంది. కొన్ని పరిశోధనలు చేసిన తర్వాత ఎల్‌ఈడీ కాంతికిరణాల ద్వారా సెల్యులర్‌ టవర్‌ కన్నా అధికంగా లైఫై నుంచి డేటా వస్తుందని హెరాల్డ్‌హాస్‌ నిరూపించాడు.

సొల్యుషన్‌ విజిబుల్‌ లైట్‌ కమ్యూనికేషన్‌ ద్వారా

సొల్యుషన్‌ విజిబుల్‌ లైట్‌ కమ్యూనికేషన్‌ ద్వారా

టెక్నాలజీతో పాటు పైలట్‌ ప్రాజెక్ట్‌లపై పరిశీలించిన పరిశోధకులు స్మార్ట్‌లైట్‌ సొల్యుషన్‌ విజిబుల్‌ లైట్‌ కమ్యూనికేషన్‌ ద్వారా డిజైన్‌ చేసినట్లు గుర్తించారు.

 400 నుంచి 800 టెరాహెడ్జ్‌ స్పీడ్‌తో ..

400 నుంచి 800 టెరాహెడ్జ్‌ స్పీడ్‌తో ..

ఈ కొత్త వైర్‌లెస్‌ వ్యవస్థలో 400 నుంచి 800 టెరాహెడ్జ్‌ స్పీడ్‌తో (సెకనుకు 1.5 గిగా బైట్ల వేగంతో ) కాంతి , బైనరీ కోడ్‌లో డేటాను బదిలీ చేస్తుంది. వైర్‌లెస్‌ ద్వారా జరిగే ఈ ప్రాసెస్‌ కోసం హెరాల్డ్‌హాస్‌ ఒక యాప్‌ రూపొందించి ప్రయోగాలు చేశారు.

లైఫైలో లోపాలు

లైఫైలో లోపాలు

అయితే లైఫైలో కొన్ని లోపాలున్నాయి. ఇది గోడలు దాటి వెళ్లలేదు. ఒకే పెద్ద గదిలో ఊహకు అందని వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేస్తుందే తప్ప మరో గదిలోకి వెళ్లలేదు.

వాణిజ్య సంస్థల్లో

వాణిజ్య సంస్థల్లో

భారీ వాణిజ్య సంస్థల్లో ఫాస్ట్‌గా డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు ఉపయోగపడుతుందని, భవిష్యత్తులో ఆదరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

రానున్న రోజులో..

రానున్న రోజులో..

ఒలెడ్‌ కాం అనే ఫ్రెంచ్‌ సంస్థ లైఫై వాడకంతో పాటు ఈ వ్యవస్థను స్థానిక ఆసుపత్రుల్లో ఇన్‌స్టాల్‌ చేసింది. లైఫై ఇప్పటికిప్పుడు వైఫై స్థానాన్ని భర్తీ చేయకపోయినా, రానున్న రోజులో సమర్థంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Best Mobiles in India

English summary
Li-Fi claims to be 100 times faster than standard Wi-Fi. But what exactly is it and how does it work? more News At Gizbot Technology

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X