అగ్ని-5లో ఉపయోగించిన MIRV వ్యవస్థ ఏంటి.. ఎలా పనిచేస్తుంది.. ఎవరు తయారు చేశారు?
భారత రక్షణ పరిశోధన. అభివృద్ధి సంస్థ DRDO తయారు చేసిన ప్రత్యేక టెక్నాలజీతో అగ్ని 5 (Agni-5 Missile Tested) రాకెట్‌ను సోమవారం పరీక్షించారు. అయితే ఈ మిస్సైల్‌ను MIRV (మల్టిపుల్ ఇండిపెండెట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్) టెక్నాలజీ ద్వారా ప్రయోగించారు.
ఒకటే మిస్సైల్.. అనేక వార్‌హెడ్లు : ఈ తాజా ప్రయోగం ద్వారా ఎక్కువ వార్‌హెడ్లను మోసుకెళ్లే సాంకేతిక భారత్ సొంతమైంది. ఇప్పటికే ఈ తరహా సామర్థ్యం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు కలిగి ఉన్నాయి. మల్టిపుల్ ఇండిపెండెట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్- MIRV ద్వారా ఏకకాలంలో వివిధ ప్రాంతాల్లోని లక్ష్యాలపై దాడిచేయవచ్చు.

మిషన్ దివ్యాస్త్ర ప్రాజెక్టు : సాధారణంగా ఒక మిస్సైల్ ద్వారా ఒక ప్రాంతంలోనే దాడి చేయగలం. అయితే రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన మల్టిపుల్ ఇండిపెండెట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ ద్వారా ఏకకాలంలో ఎక్కువ వార్‌హెడ్‌ను ప్రయోగించవచ్చు. ఫలితంగా ఒకేసారి వివిధ ప్రాంతాలపై దాడి చేయవచ్చు. 'మిషన్ దివ్యాస్త్ర' ప్రాజెక్టులో భాగంగా దీనిని అభివృద్ధి చేశారు.
అగ్ని-5 అత్యంత శక్తివంతమైనది : భారత్ సొంతంగా అభివృద్ధి చేసుకున్న క్షిపణుల్లో అగ్ని-5 అత్యంత శక్తివంతమైనది. సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంతో దాడిచేయగల సామర్థ్యం దీని సొంతం. అణ్వా్‌స్త్రాలను, ఖండాంతర క్షిపణిలను కూడా అగ్ని-5 ద్వారా ప్రయోగించవచ్చు. అగ్ని-1 నుంచి అగ్ని-4 క్షిపణులకు 700 కిమీ నుంచి 3500 కిమీ దూరాన్ని చేరుకొనే సామర్థ్యం ఉంది.
మల్టిపుల్ ఇండిపెండెట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ (MIRV) టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే..? : ఈ టెక్నాలజీ ద్వారా ఒకే రాకెట్‌లో ఎక్కువ వార్‌హెడ్లను అమర్చవచ్చు. అంటే ఒకేసారి ఎక్కువ లక్ష్యాలపై గురిపెట్టవచ్చు. వీటిని ప్రయోగించాక.. కొంత దూరం వెళ్లాక వాటి లక్ష్యాలకు అనుగుణంగా విడిపోతాయి. అనంతరం పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. నిర్దేశించిన వేగం, లక్ష్యానికి అనుగుణంగా ప్రయాణిస్తాయి.
అత్యంత కచ్చితత్వంతో దాడి.. : ఈ టెక్నాలజీ ద్వారా ప్రయోగించిన వార్‌హెడ్‌లు వందల కిలోమీటర్ల దూరం ఉన్న లక్ష్యాలపైనా అత్యంత కచ్చితత్వంతో దాడిచేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అగ్ని-5ను 4 నుంచి 12 వార్‌హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యంతో రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. మల్టిపుల్ ఇండిపెండెట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ ద్వారా సోమవారం పరీక్షించిన అగ్ని-5లో ఏవియోనిక్స్, అనేక సెన్సార్లు ఉన్నాయి.
అగ్ని-5ను భారత్ ఇప్పటికే అనేక సార్లు ప్రయోగించినా.. మల్టిపుల్ ఇండిపెండెట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ ద్వారా తొలిసారిగా ప్రయోగించింది. ఈ తరహా MIRVలు 1960 లోనే అభివృద్ధి చేశారు. 1970 సంవత్సరంలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి మరియు 1971లో సబ్‌మెరైన్ ద్వారా బాలిస్టిక్ క్షిపణిని మోహరించడం ద్వారా అమెరికా ఈ టెక్నాలజీని ప్రారంభించింది.
అయితే మల్టిపుల్ ఇండిపెండెట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ (MIRV) తరహా టెక్నాలజీని అభివృద్ధి చేయడం చాలా కష్టం. ఎందుకంటే చిన్న వార్‌హెడ్‌లు, మరియు అత్యంత కచ్చితత్వంతో పనిచేసే నేవిగేషన్ వ్యవస్థ, భారీ క్షిపణిలు (మిస్సైల్) పాటు ఇవన్ని సంక్రమంగా పనిచేసేలా చూసే వ్యవస్థ అవసరం.


Click it and Unblock the Notifications








