బ్లూ వేల్ కన్నా డేంజర్ గేమ్, ఆడి ఆత్మహత్య చేసుకున్న 12 ఏళ్ల బాలిక

కొని నెలల క్రితం బ్లూ వేల్ అనే సూసైడ్ గేమ్ ఎన్ని ప్రాణాలను బలికొనిందో అందరికి తెలిసిందే.

By Anil
|

కొన్ని నెలల క్రితం బ్లూ వేల్ అనే గేమ్ ఎన్ని ప్రాణాలను బలితీసుకున్నదో అందరికి తెలిసిందే.అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఆ కోవకే చెందిన మరో గేమ్ ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. MOMO అనే ఈ గేమ్ అప్పుడే ఓ 12 ఏళ్ళ చిన్నారిని బలితీసుకుంది. Argentina కు చెందిన ఓ చిన్నారి ఈ గేమ్ కు అడిక్ట్ అయ్యి తన ప్రాణాలను తీసుకుంది.ఈ నేపథ్యం లో ఈ చిన్నారి చావుకు MOMO గేమ్ కారణమా లేదా మరేదైనా కారణమా అనేదానిపై Argentina కు చెందిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.....

 

MOMO వాట్సాప్ సూసైడ్  గేమ్....

MOMO వాట్సాప్ సూసైడ్ గేమ్....

బ్లూవేల్ మాదిరిగానే ఇది కూడా ఒక ప్రాణాలను తీసేలా ఆటగాళ్ళను ప్రేరేపించే గేమ్. ఈ గేమ్ ఆడిన వారు చావుకు ప్రేరేపించబడతారు.ఈ గేమ్ ఆడేటప్పుడు కొన్ని లెవెల్స్ ఉంటాయి.ఆ లెవెల్స్ దాటుకుంటూ వెళ్ళాక ఈ MOMO తమని తాము సూసైడ్ చేసుకోవాలని ఆజ్ఙాపిస్తుంది.ఒక వేళ MOMO ఇచ్చే ఆర్డర్స్ ను తిరస్కరిస్తే తన దగ్గర ఉన్న వీడియోలతో ప్లేయర్ ను బెదిరిస్తుంది.

అమ్మాయి రూపంలో ఉండే అవతార్ .....

అమ్మాయి రూపంలో ఉండే అవతార్ .....

జపనీస్ కళాకారుడు Midori హయాషి ఈ MOMO అవతార్ ను తయారు చేసాడు. అయితే ఆయనకు ఈ గేమ్ కు ఎటువంటి సంబంధం లేదు. ఈ గేమ్ లోని ప్రధాన క్యారక్టర్ మోమోని మాత్రమే అతనే సృష్టించాడు. అతను సృష్టించిన  MOMO అవతార్ వింతైన లక్షణాలతో, ఉబ్బిన కళ్ళతో చూడడానికి చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. 

12 ఏళ్ళ చిన్నారి.....
 

12 ఏళ్ళ చిన్నారి.....

బ్యూనస్ ఎయిర్స్ సమీపంలో ఇంజెనియరో మాస్వివిట్జ్ పట్టణంలో ఒక 12 ఏళ్ల అమ్మాయి ఈ గేమ్ కు అడిక్ట్ అయ్యి సూసైడ్ చేసుకుంది.అయితే ఆ చిన్నారి మరణించిన కొద్దిరోజుల ముందు తన ఫోన్లో ఒక వీడియోను చిత్రీకరించిందని బ్యూనస్ ఎయిర్స్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.

ఇలాంటి గేమ్స్ కు ఎక్కువ చిన్నారులే....

ఇలాంటి గేమ్స్ కు ఎక్కువ చిన్నారులే....

అయితే ఇలాంటి గేమ్స్ కు చిన్న పిల్లలు త్వరగా అడిక్ట్ అయ్యి వారి ప్రాణాలను బలి చేసుకుంటున్నారు.ఇంతకుముందు వచ్చిన బ్లూ వేల్ గేమ్ వల్ల కూడా  ఎక్కువ శాతం మంది  చిన్నారులే మరణించారు.

 

 

వాట్సాప్ చాట్ హిస్టరీనీ హ్యాక్ చేసి.....

వాట్సాప్ చాట్ హిస్టరీనీ హ్యాక్ చేసి.....

MOMO ఈ గేమ్ డైరెక్షన్స్ అంతా వాట్సాప్ లో ఇస్తుంటుంది. అదే విధంగా వాట్సప్ చాట్ హిస్టరీ అంతా హ్యాక్ చేస్తుంది.ఒక వేళా చెప్పిన టాస్క్ చేయకపోతే బెదిరిస్తోంది.

Best Mobiles in India

English summary
What is Momo? Parents warned over sick WhatsApp 'suicide' game that could be next Blue Whale.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X