అసలు ఏంటి శాటిలైట్ ఇంటర్నెట్.. ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి.. డేటా స్పీడ్ ఎంత ఉంటుంది..?
భారత్‌లో నిన్న, మొన్న ఆశ్చర్యకరమైన ప్రకటనలు వచ్చాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో (SpaceX) ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్, జియో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఎయిర్‌టెల్ నుంచి ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లో జియో నుంచి ప్రకటన వచ్చింది. భారత ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే స్పేస్‌ఎక్స్ అనుబంధ సంస్థ స్టార్ లింక్ ద్వారా శాటిలైట్ ఇంటర్నెటర్ సేవలు (Satellite Internet Services) ప్రారంభం కానున్నాయి.
నేరుగా ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ :
అయితే ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే మారుమూల ప్రాంతాలు, అసలు కనెక్టివిటీకి లేని ప్రాంతాలకూ హైస్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం మొబైల్, బ్రాడ్‌బ్యాండ్, ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్‌ను వినియోగించిన వారు.. నేరుగా ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ ను పొందవచ్చు.

భూమికి 550 కి.మీ ఎత్తులో :
ఇందుకోసం లో ఎర్త్ ఆర్బిట్ లో (LEO) సుమారు 6000 ఉపగ్రహాలను కలిగి ఉన్న స్టార్‌లింక్ అక్కడ నుంచే ఎలాంటి అవాంతరాలు లేకుండా డేటాను అందిస్తుంది. భూమికి సుమారు 550 కిలోమీటర్లు ఎత్తులో ఈ ఉహగ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. వీటి ద్వారా హైస్పీడ్ డేటాను అందిస్తోంది.
డేటా స్పీడ్ :
ఇప్పటికే సుమారు 100 దేశాల్లో స్పేస్‌ఎక్స్ సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్రాండ్ డౌన్‌లోడ్ స్పీడ్ 25-220 Mbps గా ఉంది. అదే అప్‌లోడ్ స్పీడ్ 40 Mbps గా ఉంటుందని తెలుస్తోంది. ప్రీమియం ప్యాకేజీలను కలిగి ఉన్న యూజర్లు 500 Mbps వేగంతో డేటాను పొందవచ్చు.

ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి :
శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల కోసం DTH తరహాలో డిష్ యాంటెనాను అమర్చుకోవాల్సి ఉంటుంది. వీటితోపాటు రూటర్, కేబుల్ వంటి పరికరాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఉహగ్రహాల నుంచి నేరుగా యాంటెనా సిగ్నల్స్‌ను అందుకుంటుంది. అక్కడ నుంచి ఇతర పరికరాల ద్వారా డివైజ్‌లకు కనెక్ట్ అవుతుంది.
స్టార్‌లింక్ ఉపగ్రహాలు తక్కువ ఎత్తులోనే ఉండడం వల్ల లో లేటెన్సీ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ఫలితంగా హైస్పీడ్ డేటా యూజర్‌కు అందుబాటులోకి వస్తుంది. లో లేటెన్సీ అంటే.. డివైజ్ టూ శాటిలైట్ అక్కడ నుంచి మళ్లీ డివైజ్‌కు డేటా ప్రయాణించే వేగం. లో లేటెన్సీ వల్ల బ్రౌజింగ్, గేమింగ్ సమయాల్లో మంచి అనుభూతిని పొందవచ్చు.

స్టార్‌లింక్ ప్రస్తుతం 100 దేశాల్లో శాటిలైట్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఈ జాబితాలో అమెరికా, UK, జపాన్, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా సహా అనేక దేశాలు ఉన్నాయి. భూటాన్‌లోనూ ఇటీవలే స్టార్‌లింక్ ద్వారా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే అమెరికా వంటి దేశాలతో పోలిస్తే భారత్‌లో డేటా వేగం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
స్పేస్‌ఎక్స్ సంస్థతో ఎయిర్‌టెల్, జియో పరస్పరం ఒప్పందాలు చేసుకున్నారు. అంటే ఒకరి టెక్నాలజీ. మౌలిక సదుపాయాలు మరొకరు ఉపయోగించుకొనేలా అవగాహన కుదుర్చుకున్నాయి. భారత ప్రభుత్వం స్పేస్‌ఎక్స్‌కు ఇచ్చే అనుమతి పైనే ఈ తమ ఒప్పందాలు ఆధారపడి ఉంటాయని తమ ప్రకటనల్లో జియో. ఎయిర్‌టెల్ వెల్లడించాయి.
* ఎయిర్‌టెల్, స్పేస్‌ఎక్స్ ఒప్పందంలో భాగంగా.. నెట్‌వర్క్ విస్తరణ, నెట్‌వర్క్‌ను మెరుగుపరిచేందుకు ఎయిర్‌టెల్‌కు.. స్టార్‌లింక్ సాయం చేస్తుంది. అలాగే ఎయిర్‌టెల్ స్టోర్‌లలో స్టార్‌లింక్ పరికరాలను అందిస్తుంది. మరియు ఎయిర్‌టెల్ ద్వారా స్టార్‌లింక్ సేవలు సహా స్కూల్స్, హెల్త్ సెంటర్‌లు, కమ్యూనిటీలకు అనుసంధానం చేసే అవకాశాలను అన్వేషిస్తుంది. మరియు ఎయిర్‌టెల్ మౌలిక సదుపాయాలను స్టార్‌లింక్ వినియోగించుకుంటుంది.
* రిలయన్స్ జియో రిటైల్ అవుట్‌లెట్, ఆన్‌లైన్ స్టోర్‌లో స్టార్‌లింక్ పరికరాలను అందుబాటులో ఉంచుతుంది. జియో కస్టమర్ సర్వీస్ ఇన్‌స్టాలేషన్, యాక్టివేషన్ కోసం సపోర్టు స్టాఫ్ మెకానికాన్ని ఏర్పాటు చేస్తుంది. అదే విధంగా స్టార్‌లింక్ కూడా జియోకు సాయం చేస్తుంది. జియోఎయిర్ ఫైబర్, జియోఫైబర్‌లతోపాటు కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్‌ను విస్తరించేందుకు సాయం చేస్తుంది.


Click it and Unblock the Notifications








