Smart Lock స్మార్ట్‌లాక్ గురించి తెలుసా.. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే?
ఒకప్పుడు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉద్యోగం, ఇతర పనుల కోసం బయటకు వెళ్లినా ఇంట్లో ఎవరో ఒకరు ఉండేవాళ్లు. ఫలితంగా ఇంటికి భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తేవి కాదు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో కేవలం భార్యభర్తలు మాత్రమే నివాసం ఉంటున్నారు. వారి తల్లిదండ్రులు గ్రామాల్లోనో లేదా ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. భార్యభర్తలు ఉద్యోగాలు చేస్తున్నట్లయితే ఇంటికి తాళం వేసి వెళ్లవలసిందే.

గతంతో పోలిస్తే దొంగతనాలు కూడా గణనీయంగా అధికం అయ్యాయి. ముఖ్యంగా పండుగల వంటి సమయాల్లో అనేక మంది సొంత ఊళ్లకు వెళ్తుంటారు. అలాంటి సందర్భాల్లో దొంగతనాలకు మరింత అవకాశం ఎక్కువగా ఉంటోంది. పోలీసులు గస్తీ కాస్తున్నా.. జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇలాంటి ఘటనల నేపథ్యంలో స్మార్ట్ లాకింగ్ సిస్టమ్ (Smart lock) బాగా ప్రాచుర్యం పొందింది. స్మార్ట్ లాకింగ్ ద్వారా ఇళ్లు, కార్యాలయాలకు అదనపు భద్రతను అందించవచ్చని అనేక మంది భావిస్తున్నారు. అయితే స్మార్ట్ లాక్ అంటే ఏంటి, ఎలాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. సాధారణ పరికరాల కంటే ఎలాంటి అదనపు భద్రతను అందిస్తుందో తెలుసుకుందాం.

స్మార్ట్ లాక్ అంటే :
సింపుల్‌గా స్మార్ట్ లాక్ అంటే డిజిటల్ లాకింగ్ వ్యవస్థ. ఇళ్లు, కార్యాలయాలకు అదనపు భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్, బయోమెట్రిక్, పిన్‌కోడ్, వాయిస్ అసిస్టెంట్ ద్వారా ఇళ్లు, కార్యాలయాల డోర్స్‌ను లాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కొన్నింటిని స్మార్ట్‌ఫోన్ ద్వారా రిమోట్‌గా మేనేజ్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది.
సాధారణంగా స్మార్ట్ లాకింగ్ వ్యవస్థ బలమైన ఎన్‌క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఇంటర్నెట్ కనెక్టివిటీపై ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి హ్యాకింగ్ ప్రమాదాలు కూడా ఉంటాయి. నెట్‌వర్క్ బలహీనంగా ఉన్నా.. బలహీనమైన పాస్‌వర్ట్‌ల కారణంగా హ్యాకింగ్‌కు అవకాశం ఉంటుంది.
* స్మార్ట్‌లాక్‌లు అనేక ప్రత్యేకమైన ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఈ లాక్స్‌ను ఆటోమేటిక్‌గా ఆపరేట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. పొరపాటును డోర్ క్లోజ్ చేయడం మర్చిపోయినా.. ఆటోమేటిక్‌గా మూసేవేయవచ్చు. దీంతోపాటు నిర్దేశిత సమయంలో ఓపెన్, క్లోజ్ చేసేందుకు వీలుగా టైం సెట్ చేయవచ్చు.
* మీరు బయట ఎక్కడికి వెళ్లి ఉంటారు. అనుకోకుండా మీ ఇంటికి అతిథులు, ఫ్రెండ్స్ లేదా పనివాళ్లు వస్తే.. వారి కోసం తాత్కాలిక యాక్సెస్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం వన్ టైం కీ ను క్రియేట్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.
* మీ ఇంట్లో పెద్దవారు ఉంటే, వారి భద్రత కోసం కూడా ఈ స్మార్ట్ లాక్ అద్భుతంగా పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ ద్వారానే ఈ సరైన సమయానికి లాక్ చేయవచ్చు. మరియు ఓపెన్ చేయవచ్చు. తెలిసిన వ్యక్తులను మాత్రమే ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతించవచ్చు.
* కొన్ని స్మార్ట్‌లాక్‌లను వాయిస్ కమాండ్‌తో కూడా అన్‌లాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ తరహా స్మార్ట్‌లాక్‌లు గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్‌మెంట్స్ కోసం భాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతాలకు ఎక్కువగా పనివాళ్లు. లేదా డెలివరీ ఏజెంట్లు ఎక్కువగా వస్తుంటారు. వారి నుంచి భద్రతాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు స్మార్ట్‌లాక్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








