ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కాళ్లు అరిగేలా తిరగాల్సిన పనిలేదు.. DEET యాప్‌ను తీసుకొచ్చిన ప్రభుత్వం..!
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లను జారీ చేస్తున్న ప్రభుత్వం.. ప్రైవేటు సంస్థల్లోనూ ఉద్యోగాలు సాధించేలా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజీ ఆఫ్ తెలంగాణ (DEET) పేరుతో యాప్‌ను ఇప్పటికే విడుదల చేసింది. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పనిచేసేలా ఈ యాప్‌ను రూపొందించింది. గత డిసెంబర్‌లో ఈ యాప్ లాంచ్ చేసింది.
ఆటోమేటిక్‌గా రెజ్యూమే :
దీంతోపాటు స్మార్ట్‌ఫోన్ లేని విద్యార్థులు, నిరుద్యోగుల కోసం deet.telangana.gov.in వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం DEET యాప్ ఆండ్రాయిడ్, iOS లో అందుబాటులో ఉంది. అయితే ఈ యాప్ మరో ప్రత్యేకతను కలిగి ఉంది. మీ వివరాలను యాప్‌లో నమోదు చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథం ఆధారంగా రెజ్యూమే ను రూపొందిస్తుంది.

రిజిస్ట్రేషన్ కోసం ఏమేం కావాలి :
ఈ యాప్‌లో (Digital Employment Exchange of Telangana) నిరుద్యోగుల అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలను పొందే ఏర్పాట్లు చేసింది. పుల్‌టైం, పార్ట్‌టైం, వర్క్ ఫ్రమ్ హోం, ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందుకోవచ్చని తెలుస్తోంది. విద్యార్థులు, నిరుద్యోగులు తమ ఫోన్ నంబర్, ఇ-మెయిల్ ద్వారా రిజిస్టర్ చేసేందుకు అవకాశం ఉంది.
అంతా AI అల్గారిథం :
ఈ యాప్‌లో మొత్తంగా ఏఐ అల్గారిథం ప్రధాన పాత్ర వహిస్తుందని తెలుస్తోంది. ఎలాంటి అర్హతలు కలిగిన అభ్యర్థులు కావాలో సంస్థలు నమోదు చేస్తే.. అటువంటి ప్రొఫైళ్లనే ఈ అల్గారిథం రిఫర్ చేస్తుంది. అందులోని వివరాలను తనిఖీ చేసుకున్నాక.. ఆన్‌లైన్ ద్వారానే ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేసే అవకాశం ఉంది.
జాబ్ మేళా సమాచారం.. :
ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఎంపిక పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఆఫర్ లెటర్‌లు జారీ చేస్తారు. దీంతోపాటు జాబ్ మేళాలకు సంబంధించిన వివరాలు సహా ఇతర ఉద్యోగ సమాచారం విద్యార్థులు, నిరుద్యోగులకు చేరేలా యాప్‌ను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది.
డీట్ యాప్‌లో ఐటీ, హెల్త్ కేర్, ఆటోమొబైల్, ఫార్మా రంగానికి చెందిన అనేక సంస్థల జాబ్ నోటిఫికేషన్‌లు అందుబాటులో ఉంటాయి. ఇప్పటి వరకు 15 వేలకు పైగా విద్యార్థులు, 67 కంపెనీలు ఈ యాప్‌లో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. ఈ యాప్‌లో విద్యార్థులు లేదా నిరుద్యోగులు, సంస్థలు వేర్వేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ యాప్‌లో నమోదు చేసుకొనేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడి, విద్యార్థుల్లో అవగాహన వచ్చేలా చూస్తున్నారు. దీంతోపాటు ప్రతి జిల్లాలో ఈ వ్యవస్థను పర్యవేక్షించేందుకు నోడల్ ఆఫీసర్‌ను నియమించినట్లు తెలుస్తోంది.
మూడు నెలలపాటు విద్యార్థి లేదా నిరుద్యోగి యాప్‌లో లాగిన్ చేయకుండా వారిని ఇన్ యాక్టివ్ గా పరిగణిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగ సమాచారం అందించే యాప్‌లు అనేకం అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో అందుబాటులోకి వచ్చిన DEET యాప్.. నిరుద్యోగులకు ఉపయోగే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంస్థల్లో అవసరమైన ఉద్యోగాల జాబితా వీరికి సులభంగా అందుబాటులోకి రానుంది.


Click it and Unblock the Notifications








