Home
News

విమాన ప్రయాణంలో ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లను AirPlane Mode లో ఉంచాలని ఎందుకు సూచిస్తారో తెలుసా?

మీరు ఎప్పుడైనా విమాన ప్రయాణం చేశారా.. బోర్డింగ్‌ పాస్‌ తీసుకొని విమానంలో కూర్చున్నాక.. ఫ్లైట్‌ టేకాఫ్‌ కంటే ముందు సిబ్బంది కీలక సూచనలు చేస్తారు. ముఖ్యంగా విమానం గాల్లో ఉన్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహా ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఇందుకోసం అనేక ప్రకటనలు చేస్తారు.

ఈ ప్రకటనల్లో ముఖ్యమైనది. ప్రయాణికుల వద్ద ఉన్న మొబైల్‌, స్మార్ట్‌ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లను Airplane Mode లో పెట్టాలని విమాన సిబ్బంది తరచూ గుర్తు చేస్తుంటారు. అయితే ఇలా ఎందుకు చెబుతారో.. ఇందుకు గల కారణాలు ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. అయితే దీని వైనుక అనేక భద్రతా కారణాలున్నాయి.

why should electronic devices put on AirPlane Mode in flight journey

అయితే విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మీ వద్దనున్న ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లను Airplane Mode లో ఉంచితే.. ఫోన్‌కు వచ్చే సిగ్నల్‌ నిలిచిపోతుంది. దీంతో ఫోన్‌కు కాల్స్‌, మెసేజ్‌లు రావడం నిలిచిపోతాయి. మరియు ఇంటర్నెట్‌ కూడా నిలిచిపోతుంది. అయితే విమానయాన సంస్థలు Wi-Fi అందిస్తే Airplane Mode లోనూ ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు.

అసలు విమాన ప్రయాణికులను తమ ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లను ఎందుకు Airplane Modeలో ఉంచాలి?
విమాన కమ్యూనికేషన్‌ వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా.. : విమాన ప్రయాణాల్లో భద్రత కారణాల రీత్యా ప్రయాణికుల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను Airplane Mode లో పెట్టాలని సిబ్బంది సూచిస్తారు. ఈ పరికరాలు రేడియో వేవ్‌ మరియు ఎలక్ట్రోమాగ్నటిక్‌ ఇంటర్‌ఫేస్‌ తరంగాలను విడుదల చేస్తాయి. ఈ తరంగాలు విమానం కమ్యూనికేషన్‌ వ్యవస్థకు అవరోధం కలిగించే అవకాశం ఉంది.

why should electronic devices put on AirPlane Mode in flight journey

ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది : ఈ ప్రయాణికుల వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెలువడే తరంగాల కారణంగా పైలెట్‌.. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ లేదా గ్రౌండ్‌ స్టాఫ్‌తో సంభాషించేందుకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. ఎయిర్‌ప్లైన్‌ మోడ్‌ ఆన్‌ చేయడం వల్ల ఎయిర్‌క్రాఫ్ట్‌ పరికరాలు డ్యామేజీ కాకుండా నివారించవచ్చు.

ఫలితంగా FAA మరియు FCC వంటి సంస్థలు విమాన ప్రయాణాల్లో Airplane Mode ఆన్‌ చేయడం తప్పనిసరి చేశాయి. విమానం యొక్క నావిగేషన్ వ్యవస్థ మరియు ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే విమానంలో అందుబాటులో ఉన్న వైఫై కనెక్షన్‌ను వినియోగించడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ విధానాన్ని ముందస్తు చర్యల్లో భాగంగా తీసుకుంటున్నారు.

ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ (FCC) మరియు ఫెడరల్‌ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA).. సంస్థలు విమాన ప్రయాణాల్లో మొబైల్‌ ఫోన్లను వినియోగించకుండా నిలుపుదల చేస్తారు. ఫలితంగా ఈ ఫోన్ల నుంచి వెలువడే తరంగాల ద్వారా విమానాల కమ్యూనికేషన్‌ సహా ఇతర వ్యవస్థలు ప్రభావితం చెందకుండా చూస్తారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
what is the reason behind electronic devices must be on AirPlane Mode in flight journey
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X