కంప్యూటర్‌లో గ్రాఫిక్స్ కార్డ్ ఉండడం వల్ల ఉపయోగం ఏమిటి..?

Posted By: Super

కంప్యూటర్‌లో గ్రాఫిక్స్ కార్డ్ ఉండడం వల్ల ఉపయోగం ఏమిటి..?

గ్రాఫిక్స్ కార్డు, మన కంప్యూటర్‌లో అతి ఖరీ్దైన వస్తువులలో ఇదీ ఒకటి. అసలు ఎందుకు ఇది? ఎలా పని చేస్తుంది? దీని గురించి తెలుకుందాం. మీ కంప్యూటర్ యొక్క మానిటర్ లో చూసే ప్రతి బొమ్మా పిక్సల్‌స్ అనే చిన్న చిన్న బిందువుల సమూహంతో ఏర్పడినవే. ప్రస్తుత కంప్యూటర్‌లలో 10 నుంటీ 20 లక్షల పిక్సల్లు ఉంటాయి. సెకనుకు 80 సార్లు వీటినన్నింటినీ సరి చూడవలసి ఉంటుంది. అంటే 8 నుంటీ 16 కోట్ల పిక్సెల్ల భాద్యత ఒక్క సెకెన్‌లో. మన కంప్యూటర్ లో ప్రతి పనినీ చేసేది సీ.పీ.యూ. మానిటర్‌ పై బొమ్మలు చూపే పని కూడా దీని భారమే. ఈ భారం తన మీద వేసుకొని CPUపై భారాన్ని తగ్గిస్తుంది ఈ గ్రాఫిక్స్ కార్డు.

సీ.పీ.యూ పై ఈ ఒత్తిడి గ్రాఫిక్స్ కార్డు లేకుంటే వస్తుంది. ఇలాంటి ఒత్తిడి అన్ని సమయాల్లోనూ ఉండదు. ఏవైనా పెద్ద కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నప్పుడే ఈ భారం. ఇలాంటి సంధర్భాలలో మాత్రమే గ్రాఫిక్స్ కార్డు అవసరం ఉంటుంది. అంటే దాదాపు ఐదు నుంటీ పది శాతం భారాన్ని తగ్గిస్తుందన్నమాట. మీరు ఎక్కువగా కంప్యూటర్ లో ఆటలు ఆడేవారైతే దీన్ని కొనండి, లేకపోతే వద్దు. మంచి గ్రాఫిక్స్ కార్డు కావాలంటే మీ దగ్గరున్న కంప్యూటర్ షాపులో విచారించగలరు. ఒక మంచి గ్రాఫిక్స్ కార్డు కొనాలంటే, దాని ప్రస్థుత ఖరీదు 5 వేల రూపాయల పై మాటే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot