Home
News

వాట్సాప్‌ ఘోస్ట్‌ పెయిరింగ్‌ అంటే ఏంటో తెలుసా.. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదమే..!

Whatsapp Ghost Pairing : సైబర్‌ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న టె‌క్నాలజీని నేరగాళ్లు తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్నారు. సోషల్‌ మీడియా, మెసేజింగ్‌ యాప్‌లను ఉపయోగించుకొని యూజర్లను మోసం చేస్తున్నారు. ఇటీవల వాట్సాప్‌ యూజర్లను మోసం చేసేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడయ్యింది. భారీగా ఉన్న వాట్సాప్‌ యూజర్లను ఘోస్ట్ పెయిరింగ్‌ ద్వారా మోసాలకు పాల్లడుతున్నట్లు గుర్తించారు.

ఏంటీ ఘోస్ట్‌ పెయిరింగ్‌? :
వాట్సాప్‌ ఘోస్ట్ పెయిరింగ్‌ ను చెక్‌ రిపబ్లిక్‌లో గుర్తించారు. అయితే ఏంటీ ఘోస్ట్‌ పెయిరింగ్‌.. వాట్సాప్‌ను ఉపయోగించి, యూజర్లను ఎలా మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే యూజర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తి వివరాలు మీకోసం.

whatsapp Ghostpairing

ఘోస్ట్‌ పెయిరింగ్‌ ను సింపుల్‌గా చెప్పాలంటే వాట్సాప్‌ ను హ్యాక్‌ చేయడం. అయితే గతంలో నేరగాళ్లు పాస్‌వర్డ్, ఓటీపీ సహా ఇతర మార్గాల్లో ఇతరుల వాట్సాప్‌ ఖాతాలను వారీ ఆధీనంలోకి తీసుకొనేవారు. అయితే ప్రస్తుతం వాట్సాప్‌లో డివైజ్‌ లింకింగ్‌ ఫీచర్‌ ద్వారా ఇతరుల వాట్సాప్ ఖాతాలను వారి డివైజ్‌లకు లింక్‌ చేసుకుంటున్నారు.

ఎవరు గుర్తించారు :
వాట్సాప్‌ ఘోస్ట్‌ పెయిరింగ్ మోసాన్ని సైబర్‌ సెక్యూరిటీ ఆర్గనైజేషన్‌ జెన్‌ డిజిటల్ గుర్తించింది. దీనిపై వాట్సాప్‌ యూజర్లను అప్రమత్తం చేస్తోంది. మీకు తెలిసిన కాంటాక్ట్‌ నుంచే ఇలాంటి మెసేజ్‌లు వచ్చే అవకాశం ఉంది. ఇందులో 'Hey, i Just Found your Photo' అంటూ మెసేజ్‌లు వస్తుంటాయి.

పొరపాటున లింక్‌ పైన క్లిక్‌ చేస్తే.. :
ఇలాంటి మెసేజ్‌ల్లోనే ఓ లింక్‌ ఉంటుంది. పొరపాటున ఈ లింక్‌ పైన క్లిక్ చేస్తే ఫేస్‌బుక్‌ ఫోటో వ్యూయర్ తరహా ఫేజీ ఓపెన్ అవుతుంది. అనంతరం మీ ఫోన్‌ నంబర్‌ను నమోదుచేయాలంటూ సూచిస్తుంది. అనంతరం మీ వాట్సాప్‌ నంబర్‌కు డివైజ్‌ పెయిరింగ్‌ కోడ్‌ వస్తుంది.

ఇదంతా యూజర్‌కు తెలియకుండానే.. :
ఇదంతా భద్రత తనిఖీల్లో భాగమనే కనిపిస్తుంది. కానీ ఆ కోడ్‌ ను మీరు ఎంటర్ చేశాక.. మీ వాట్సాప్‌ అకౌంట్‌ను నేరగాళ్లు తమ డివైజ్‌కు లింక్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఇదంతా యూజర్‌కు తెలియకుండానే జరుగుతుంది. దీన్నే ఘోస్ట్‌ పెయిరింగ్‌ గా నిపుణులు పిలుస్తున్నారు.

ఇలా ఘోస్ట్‌ పెయిరింగ్‌ చేసిన ఖాతాలను నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. యూజర్‌ పంపినట్లుగానే ఇతరులకు ఇలాంటి మెసేజ్‌లు పంపి, మోసాలకు పాల్పడుతున్నారు. దీంతోపాటు మీ ఫోటోలు, వీడియోలు, చాట్‌ ఇతరులకు యాక్సెస్‌ లభిస్తుంది. మరియు దుర్వినియోగం అయ్యే ప్రమాదం కూడా ఉంది.

మాన్యువల్‌గా తొలగించాల్సిందే :
యూజర్లు లింక్ చేసిన డివైజ్‌ ను మాన్యువల్‌గా తొలగించే వరకు.. నేరగాళ్ల వద్ద మీ వాట్సాప్‌ యాక్టివ్‌గానే ఉంటుంది. మీ వాట్సాప్ ఇతర డివైజ్‌తో లింక్‌ అయినట్లుగా మీరు గుర్తించే అవకాశం కూడా ఉండదు.

కేవలం వాట్సాప్‌ ఘోస్ట్‌ పెయిరింగ్‌ ద్వారానే కాకుండా అనేక విధాలుగా నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుమాస్పద లింక్‌లపై క్లిక్‌ చేయకూడదు. గుర్తు తెలియని వ్యక్తులతో బ్యాంకింగ్‌ సహా ఇతర వివరాలు పంచుకోకూడదు.

దీంతోపాటు క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ సమయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. అవసరం లేని చోట్ల వ్యక్తిగత వివరాలు షేర్‌ చేయకూడదు. ఏదైనా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే వినియోగించాలి. సోషల్ మీడియా వినియోగం సమయంలోనూ అప్రమత్తంగా ఉండాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
What is whatsapp Ghostpairing, how it will effect users, need to know this
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X