Home
News

డీప్‌సీక్‌తో చైనా AI మాయాజాలం.. టెక్ ప్రపంచంలో కొత్త అలజడి.. ఇది ఎలా పనిచేస్తుంది?

DeepSeek: చైనా ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచంలో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో సరికొత్త సంచలనాలకు తెరలేపుతోంది. హాంగ్‌జౌ కేంద్రంగా 2023లో ప్రారంభమైన 'డీప్‌సీక్' అనే AI కంపెనీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీని వెనుక ఉన్న లియాంగ్ వెన్‌ఫెంగ్ తెలివైన వ్యక్తి ఉన్నారు. ఈయనో AI, క్వాంటిటేటివ్ ఫైనాన్స్‌లో బాగా అనుభవం ఉన్న ఇంజనీర్. ఈయన స్థాపించిన డీప్‌సీక్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.

డీప్‌సీక్ తీసుకొచ్చిన కొత్త AI పేరు 'డీప్‌సీక్-R1'. ఇది మామూలు AI మోడల్ కాదు. ప్రపంచంలోనే టాప్ AI మోడల్స్‌కు గట్టి పోటీ ఇస్తోంది. ఓపెన్AI వారి చాట్‌జీపీటీకి దీటుగా సమాధానాలు చెప్పగలదు, లాజిక్ పజిల్స్‌ను క్షణాల్లో సాల్వ్ చేయగలదు, అంతేకాదు కంప్యూటర్ ప్రోగ్రామ్స్‌ను కూడా అద్భుతంగా రాసేస్తుంది. నిజంగా ఇది నమ్మశక్యం కాని టెక్నాలజీ.

What Makes China s DeepSeek a Groundbreaking Innovation

ఇంత పవర్‌ఫుల్ AI మోడల్‌ను డీప్‌సీక్ కేవలం 5.6 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.50 కోట్లు) మాత్రమే, ఇతర పెద్ద AI కంపెనీలు వేల కోట్లు ఖర్చు పెడుతుంటే, డీప్‌సీక్ మాత్రం చాలా తక్కువ పెట్టుబడితో ఈ అద్భుతాన్ని సృష్టించింది. ఇది టెక్నాలజీ ప్రపంచంలో ఒక గొప్ప విజయం.

* ఓపెన్ సోర్స్

ఇంకో విశేషం ఏంటంటే, డీప్‌సీక్ తమ AI మోడల్‌ను ఓపెన్ సోర్స్‌గా విడుదల చేసింది. అంటే ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు దీని కోడ్‌ను ఉచితంగా వాడుకోవచ్చు, మార్పులు చేసుకోవచ్చు, కొత్తవి నిర్మించవచ్చు. ఈ ఓపెన్ సోర్స్ విధానం AI రంగంలో వినూత్న ఆవిష్కరణలకు, సహకారానికి దారి తీస్తుంది.

డెవలపర్లు అందరూ కలిసి పనిచేస్తే టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ఊహించుకోవచ్చు. డీప్‌సీక్-R1 మార్కెట్‌లోకి రాగానే సెన్సేషన్ క్రియేట్ చేసింది. యాపిల్ యాప్ స్టోర్‌లో టాప్ ఫ్రీ యాప్‌గా దూసుకుపోయింది. అమెరికా, యూకే, చైనా వంటి దేశాల్లో నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది.

జనాలు దీన్ని ఎగబడి డౌన్‌లోడ్ చేసుకున్నారు. డీప్‌సీక్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. డీప్‌సీక్ రాకతో స్టాక్ మార్కెట్ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే ఎన్విడియా (Nvidia), మెటా, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద టెక్ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి.

డీప్‌సీక్ సృష్టించిన అలజడికి ఈ కంపెనీలు కూడా వణికిపోయాయి. చైనా టెక్నాలజీ ఎంత పవర్‌ఫుల్‌గా మారుతుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. అయితే డీప్‌సీక్‌పై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సెన్సార్‌షిప్ గురించిన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనా ప్రభుత్వానికి సున్నితమైన అంశాల గురించి డీప్‌సీక్ చర్చించడానికి నిరాకరిస్తుందని అంటున్నారు.

* అనుమానాలు

1989 టియానన్‌మెన్ స్క్వేర్ నిరసనలు, తైవాన్ హోదా వంటి విషయాలను ఇది దాటవేస్తుందట. దీంతో ఈ AI మోడల్ ఎంతవరకు నిష్పక్షపాతంగా ఉంటుందో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకా డీప్‌సీక్ చెప్పిన డెవలప్‌మెంట్ ఖర్చులపై కూడా కొంతమంది విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కంపెనీ అన్ని ఖర్చులను పూర్తిగా వెల్లడించలేదని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా డీప్‌సీక్ వేగంగా ఎదగడం, గ్లోబల్ AI రంగంలో చైనా ప్రభావం పెరగడం ప్రపంచ టెక్నాలజీ నాయకత్వంలో మార్పులకు సంకేతం అని చెప్పవచ్చు. భవిష్యత్తులో AI రంగంలో ఎలాంటి సంచలనాలు జరుగుతాయో వేచి చూడాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
DeepSeek, a Chinese AI company, innovated DeepSeek-R1, a high-performing, cost-effective, open-source AI model. It rivals ChatGPT, impacts markets, and faces censorship criticisms. Its rapid rise signifies China's growing AI influence.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X