చిన్నారుల గదుల్లోని AC ని ఎన్ని పాయింట్లు వద్ద వినియోగించాలి.. లేకుంటే ఏం జరుగుతుంది..?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది. గత సంవత్సరం మాదిరిగానే భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో అనేక మంది ఏసీలు, ఎయిర్ కూలర్‌లు వినియోగిస్తున్నారు. ఇళ్లల్లో చిన్నారులు ఉన్న వారు ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. ఎయిర్ కండిషనర్‌లు (AC) భారీ ఉష్ణోగ్రతల నుంచి చిన్నారులకు రక్షణ కల్పిస్తున్నా.. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం చిన్న పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
చాలా జాగ్రత్తలు తీసుకోవాలి :
ఏసీ కొనుగోలు నుంచి సరైన ప్రదేశంలో అమర్చే వరకు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఏసీని ఎంత ఎత్తులో అమర్చాలో కూడా తెలుసుకోవాలి. ఏసీ అవుట్‌డోర్ యూనిట్ పైనా జాగ్రత్తలు తీసుకోవాలి. నేరుగా సూర్యకాంతి పడే ప్రాంతంలో అవుట్‌డోర్ యూనిట్‌ను అమర్చకూడదు.

చిన్నారుల గదుల్లో :
అయితే చిన్నారులు ఉన్న గదిలో ఏసీని వినియోగిస్తుంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారులకు ఎక్కువ చల్లదనం కావాలంటూ కొంత మంది ఏసీని 20 లేదా అంతకంటే తక్కువ పాయింట్లకు తగ్గిస్తారు. అయితే ఇలాంటి చర్యలు చిన్నారుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.
అనేక ఆరోగ్య సమస్యలు :
ఎక్కువ చల్లదనం కారణంగా చిన్నారులకు దగ్గు, జలుబు వంటి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎక్కువ రోజులపాటు అత్యంత చల్లదనంలో ఉంటే న్యూమోనియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతోపాటు ఏసీ గాలి చిన్నారులకు నేరుగా తాకితే చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
తేలికైన వస్త్రంతో :
అలెర్జీలు సహా చర్మం పొడిబారిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఏసీ గాలి నేరుగా చిన్నారులపై పడకుండా ఉండేందుకు తేలికపాటి వస్త్రాన్ని వారి తల, శరీర భాగాలపై కప్పి ఉంచడం మంచింది. ఏసీ వినియోగిస్తున్నప్పుడు చిన్నారుల్లో ఎటువంటి సమస్యలు తలెత్తినట్లు భావించినా.. వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎంత ఉష్ణోగ్రత ఉండాలి :
చిన్నారుల గదిలో ఏసీ 22-25 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పెద్దలు వినియోగిస్తున్న గదుల్లో 24 డిగ్రీలు వద్ద వినియోగించుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల విద్యుత్ ఛార్జీలు కూడా తక్కువ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కొంత మంది ఏసీలను 18 వద్ద వినియోగిస్తుంటారు. ఇలా చేస్తే భారీగా విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు.
ఎంత ఎత్తులో అమర్చాలి ? :
దీంతోపాటు ఏసీ ను ఎప్పుడు కూడా 7 నుంచి 8 అడుగుల ఎత్తులోనే అమర్చాలి. కొంత మందికి దీనిపై సరైన అవగాహన లేకపోవడం కారంగా సీలింగ్‌కు అత్యంత సమీపంలోనే అమర్చుతారు. దీని వల్ల ఏసీ మెరుగైన పనితీరును కనబరచలేదు. మరియు గదిని చల్లబరిచేందుకు ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉంటుంది.
దీంతోపాటు ఏసీలను కొనుగోలు చేసే సమయంలో 5 స్టార్ రేటింగ్ కలిగినవి ఎంచుకోవాలి. దీంతోపాటు ఇన్వర్టర్ మోడల్ ఏసీలను కొనుగోలు చేయడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని నియంత్రించవచ్చు. దీంతోపాటు సర్వీసింగ్ సదుపాయం అందుబాటులో ఉన్న ఎయిర్ కండీషనర్‌ను ఎంచుకోవాలి.


Click it and Unblock the Notifications