Home
News

మీ ఇంట్లో AC ఉందా.. వేసవికి ముందే ఈ తనిఖీలు కచ్చితంగా చేయాలి..!

Air Conditioner Tips : భారత్‌లో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఇళ్లల్లో ఎయిర్‌ కండిషనర్‌లు (AC) కలిగి ఉన్న వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్న అనంతరం ఏసీల వినియోగాన్ని తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది. సుదీర్ఘ విరామం అనంతరం ఎటువంటి సర్వీసింగ్‌ లేకుండా నేరుగా వినియోగిస్తే అనేక సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది.

AC ల వినియోగం తిరిగి ప్రారంభించే ముందు కొన్ని అంశాలను కచ్చితంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. లేకుంటే ఎయిర్‌ కండిషనర్‌ దెబ్బతినే అవకాశం ఉండడంతోపాటు విద్యుత్ బిల్లులు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది. AC లను వినియోగించే ముందు ఏయే అంశాలను తనిఖీ చేయాలి.

what to check in air conditioner before summer

> ఎయిర్‌ కండిషనర్‌ ఫిల్టర్‌లను శుభ్రపరచడం
శీతాకాలంలో ఏసీ ఫిల్టర్‌లలో దుమ్ము, దూళి కణాలు పేరుకుపోయే అవకాశం ఉంది. అందువల్ల ఆ ఫిల్టర్‌లను నీటితో శుభ్రం చేసుకోవాలి. పూర్తిగా ఆరనివ్వాలి. అయితే ఏదైనా డ్యామేజీ ఉంటే మాత్రం, కొత్తవి అమర్చుకోవాలి.

శుభ్రంగా ఉన్న ఎయిర్‌ కండిషనర్ ఫిల్టర్లు గాలి ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఫలితంగా తక్కువ సమయంలోనే గది చల్లగా మారుతుంది. ఫలితంగా విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది.

> అవుట్‌డోర్‌ యూనిట్‌ ను తనిఖీ చేయండి
AC ఇండోర్‌ యూనిట్‌తోపాటు అవుట్‌డోర్‌ యూనిట్‌ను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. సాధారణంగా అవుట్‌డోర్‌ యూనిట్‌ చుట్టూ దుమ్ము, దూళి చేరే అవకాశం ఉంటుంది. ఫలితంగా గాలి ప్రవాహానికి అడ్డుంకులు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల తరచూ శుభ్రం చేసుకోవాలి.

దీంతోపాటు అవుట్‌డోర్‌ యూనిట్‌ చుట్టూ తగినంత ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి. సరైన గాలి ప్రవాహం కంప్రెసర్ పై ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది. ఫలితంగా విద్యుత్‌ వినియోగం నియంత్రణలో ఉంటుంది.

> విద్యుత్ కనెక్షన్‌లు తనిఖీ చేయాలి
సుదీర్ఘ విరామం అనంతరం ఎయిర్‌ కండిషనర్‌ను వినియోగిస్తుంటే కచ్చితంగా ఇండోర్‌, అవుట్‌డోర్‌ యూనిట్‌ల విద్యుత్ కనెక్షన్‌లను కచ్చితంగా తనిఖీ చేయాలి. డ్యామేజీ ఏమైనా ఉన్నా, తెగిపడినట్లు అనిపించినా వెంటనే నిపుణులతో మరమ్మతులు చేయించాలి.

ఎటువంటి అలసత్వం వహించినా విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. పాతబడిన వైర్లు, విద్యుత్‌ బోర్డులను వెంటనే మార్చుకోవడం ఉత్తమం.

> థర్మోస్టాట్‌ పరీక్ష నిర్వహించాలి
పైన తెలిపిన తనిఖీలు పూర్తి చేశాక, ఏసీని ఆన్‌ చేయాలి. ఎటువంటి శబ్దాలు, లీకేజీ లేదా బలహీనమైన గాలి ప్రవాహం ఉన్నట్లు భావిస్తే వెంటనే AC ఆఫ్‌ చేసి, మరమ్మతులు చేయాలి. దీంతోపాటు ఎయిర్‌ కండిషనర్ ను 24 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఉంచి పనితీరును తనిఖీ చేయాలి. .

ఏసీ పనితీరులో ఎటువంటి మార్పులు గమనించినా, అధిక శబ్ధాలు వస్తున్నట్లు భావించినా నిపుణులతో మరమ్మతులు చేయించాలి. దీంతోపాటు గ్యాస్‌ సహా ఇతర లీకేజీలపైనా దృష్టిసారించాలి.

> సంవత్సరానికి ఒకసారైనా సర్వీసింగ్‌
ఎయిర్‌ కండిషనర్‌ సక్రమంగా పనిచేస్తున్నట్లు భావించినా, సంవత్సరానికి ఒకసారైనా నిపుణులతో మొత్తంగా తనిఖీ చేయించడం, సర్వీసింగ్‌ చేయించడం ఉత్తమం. నిపుణులు సాధారణంగా గ్యాస్‌ స్థాయిని తనిఖీ చేయడం, పైపులను శుభ్రం చేయడం, కంప్రెషర్‌ను తనిఖీ చేస్తారు.

More from GizBot

Best Mobiles in India

English summary
what to check in air conditioner before summer to get better performance here is the guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X