ఫిర్యాదు చేసినా బ్యాంకుల్లో చలనం లేదా, అయితే ఇలా చేయండి

By Gizbot Bureau
|

కస్టమర్లకు సర్వీసు చేసే విషయంలో బ్యాంకుల పనితీరు మెరుగు పడాలని ఫ్రాడ్ లావాదేవీల నుంచి కస్టమర్లను రక్షించేందుకు మరింత భద్రతా చర్యలు చేపట్టాలని గతవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను కోరిన విషయం తెలిసిందే. ఆన్ లైన్ లావాదేవీల విషయంలో కస్టమర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని బ్యాంకులను కోరింది.

ఫిర్యాదు చేసినా బ్యాంకుల్లో చలనం లేదా, అయితే ఇలా చేయండి

అయినప్పటికీ కస్టమర్లకు సర్వీసు చేసే విషయంలో బ్యాంకులు ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి. లావాదేవీలకు సంబంధించి బ్యాంకులకు ఫిర్యాదు చేస్తే సరిగా స్పందించడం లేదనే వార్తలు వస్తున్నాయి. అలాంటి సమయంలో కస్టమర్లు సమస్యను ఎవరికి చెప్పాలో తెలియక సతమతమవుతుంటారు. అయితే వారు ఇకపై ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొనే బ్యాంక్‌పై ఫిర్యాదు చేయవచ్చు. అదెలాగో చూద్దాం.

బ్యాంక్ కస్టమర్లకు వ్యక్తిగత మెసేజ్‌లు

బ్యాంక్ కస్టమర్లకు వ్యక్తిగత మెసేజ్‌లు

ఈ మేరకు భారతీయ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌బీఐ) బ్యాంక్ కస్టమర్లకు వ్యక్తిగత మెసేజ్‌లు పంపుతోంది. బ్యాంకులు మీ సమస్య పరిష్కారంలో విఫలమైతే.. నెలకు మించి మీ ఫిర్యాదు పరిష్కారం కాకుండా అలాగే ఉంటే.. మీరు బ్యాంక్ అంబుడ్స్‌మన్‌కు కంప్లైంట్ చేయండి.

14440కు మిస్‌డ్ కాల్

14440కు మిస్‌డ్ కాల్

బ్యాంకులు మిమల్ని లెక్కచేయకపోతే వాటిపై అంబుడ్స్‌మన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. డైరెక్ట్‌గా ఈ bankingombudsman.rbi.org.in లింక్‌పై క్లిక్ చేసి ఫిర్యాదు చేసేయండి. వెబ్‌సైట్‌తో ఎందుకులే అనుకుంటే.. 14440కు మిస్‌డ్ కాల్ కూడా ఇవ్వొచ్చు. లేకపోతే https://rbi.org.in/Scripts/AboutUsDisplay.aspx?pg=BankingOmbudsmen.htm లింక్‌లో ఇచ్చిన అడ్రస్‌లకు సమస్య తెలియజేస్తూ లెటర్ కూడా రాయొచ్చు.

 అంబుడ్స్‌మన్‌కు..

అంబుడ్స్‌మన్‌కు..

వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కో ఆపరేటివ్ బ్యాంకులకు చెందిన ఖాతాదారులు వారి సమస్యలను అంబుడ్స్‌మన్‌కు తెలియజేయవచ్చు. బ్యాంక్ మీ ఫిర్యాదుకు నెల రోజుల లోపు స్పందించకపోతే అంబుడ్స్‌మన్‌కు కంప్లైంట్ చేయండి. అలాగే బ్యాంక్ మీ ఫిర్యాదు తీసుకోకపోయినా, ఫిర్యాదు తీసుకున్న తర్వాత సరిగ్గా స్పందిచకపోయినా కూడా అంబుడ్స్‌మన్‌కు వెళ్లొచ్చు.

అంబుడ్స్‌మన్‌ స్పందించకుంటే..

అంబుడ్స్‌మన్‌ స్పందించకుంటే..

మీరు అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుంటే వెంటనే RBI deputy governor ముందుగా ఫిర్యాదు చేయండి. 45 రోజుల పై కూడా మీ సమస్య పరిష్కారం కాకుంటే బ్యాంకు మీద కోర్టుకు వెళ్లవచ్చు. ఇందుకోసం మీరు బ్యాంకుకు ఫిర్యాదు చేసినట్లుగా ఫ్రూప్ ఉండాలి. అలాగే అంబుడ్స్‌మన్‌ని సంప్రదించినట్లుగా ఆధారాలు ఉండాలి. అలాగే మీకు ఎంత మొత్తం లాస్ అయిందో కూడా వివరంగా ఉండాలి. ఈ వివరాలతో మీరు District Consumer Disputes Redressal Forumలో కాని State Consumer Disputes Redressal Commission or the National Consumer Disputes Redressal Commissionలో కాని ఆ బ్యాంకు మీద కంప్లయింట్ ఫైల్ చేయవచ్చు. లాయర్ లేకుండానే మీరు కేసుకోసం పోరాడవచ్చు.

Best Mobiles in India

English summary
What to do if your bank does not listen to your complaint

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X