పాత ఫోన్ అమ్మేస్తున్నారా, తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోండి

మార్కెట్లోకి రోజు రోజుకి కొత్త కొత్త ఫోన్లు వస్తుండటంతో అందరూ పాత ఫోన్ అమ్మేసి కొత్త ఫోన్ కొనేందుకు తెగ ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు.మరి మీరూ పాత ఫోన్ అమ్మేస్తున్నారా? లేదా ఎక్స్‌ఛేంజ్ చేస్తున్నారా?

|

మార్కెట్లోకి రోజు రోజుకి కొత్త కొత్త ఫోన్లు వస్తుండటంతో అందరూ పాత ఫోన్ అమ్మేసి కొత్త ఫోన్ కొనేందుకు తెగ ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు.మరి మీరూ పాత ఫోన్ అమ్మేస్తున్నారా? లేదా ఎక్స్‌ఛేంజ్ చేస్తున్నారా? మీ ఫోన్ మరొకరి చేతుల్లోకి వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. లేకపోతే మీ ప్రైవసీ రిస్క్‌లో పడే అవకాశముంది.

పాత ఫోన్ అమ్మేస్తున్నారా, తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోండి

చాలా మంది తమ పాత స్మార్ట్‌ఫోన్‌లను వేరొకరికి విక్రయించే ముందు, ఆ ఫోన్‌లోని వ్యక్తిగత డేటాను డిలీట్ చేసేందుకు "Factory Reset" నిర్వహిస్తారు. అయితే, ఫ్యాక్టరీ రీసెట్ నిర్వహించినంత మాత్రాన ఫోన్ డేటా పూర్తిగా డిలీట్ అయిపోతుందనుకోవటం పూర్తిగా అపోహే అంటున్నారు సైబర్ నిపుణులు.మరి పాత ఫోన్ అమ్మడం లేదా ఎక్స్‌ఛేంజ్ చేయడం కన్నా ముందు మీరు మర్చిపోకూడని ముఖ్యమైన అంశాలను ఓసారి చూద్దాం.

డేటా బ్యాకప్:

డేటా బ్యాకప్:

మీరు ఫోన్ కొన్న దగ్గర్నుంచి మీ ఇంపార్టెంట్ ఫైల్స్ అందులో స్టోర్ అవుతాయి. మీరు మెమొరీ కార్డ్ ఉపయోగిస్తున్నా సరే... ఫోన్‌లో కొన్ని ఫైల్స్ సేవ్ అవుతుంటాయి. అందుకే మీరు మీ పాత ఫోన్ అమ్మే ముందు ఫోన్‌లోన్ డేటాను బ్యాకప్ చేయడం మర్చిపోవద్దు. టెక్ట్స్, పీడీఎఫ్ ఫైల్స్, డాక్యుమెంట్స్, ఫోటోలు, వీడియోలు ఇతర ముఖ్యమైన ఫైల్స్ బ్యాకప్ చేసుకోవాలి. ఇక పాత ఫోన్లను అమ్మేముందు ‘డేటా ఎన్స్యూర్‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌' లతో అప్‌ డేట్‌ చేయించాలి. మొబైల్‌ స్టోర్‌‌‌‌లు, సర్వీస్‌ సెంటర్‌‌‌‌లలో ‘డేటా ఎన్స్యూర్‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌'లు లభిస్తాయి . కొన్ని ప్రముఖ కంపెనీలు వీటిని తయారుచేస్తున్నాయి. ఫోన్‌ లోని డేటా మొత్తాన్ని ఇవి ఎరేజ్‌ చేస్తాయి. ‘స్టెల్లార్‌‌‌‌' కంపెనీ ఈ మధ్యే ‘బిట్‌ రేసర్‌‌‌‌' అనే సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ను తయారు చేసి.. కస్టమర్ల కోసం అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తోంది.

కాంటాక్ట్స్:

కాంటాక్ట్స్:

మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ని గూగుల్‌లోకి బ్యాకప్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫోన్‌లో Settings ఓపెన్ చేసి Accounts సెక్షన్‌లో Google పైన క్లిక్ చేయాలి. మీరు ఏ మెయిల్‌లోకి బ్యాకప్ చేయాలో ఆ మెయిల్‌పైన క్లిక్ చేసి కాంటాక్ట్స్ సింక్ చేయాలి. లేకుంటే మీ కాంటాక్ట్స్ మొత్తం మిస్సయ్యే ప్రమాదం ఉంది. కొత్త ఫోన్ కొన్నప్పుడు మీరు కాంటాక్ట్స్ ని మళ్లీ ఫ్రెష్షుగా సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

ఫ్యాక్టరీ రీసెట్:

ఫ్యాక్టరీ రీసెట్:

మీ ఫోన్‌లోని డేటాను బ్యాకప్ చేసుకున్న తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. అంటే మీరు మొదట ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే అలా మారిపోతుంది. అందులో మీ లాగిన్ వివరాలేవీ ఉండవు. Settings ఓపెన్ చేసి Backup & reset సెక్షన్‌‌లో Factory data reset పైన క్లిక్ చేయాలి. ఒక్కసారి ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే హ్యాకర్లు కూడా డేటాను రికవర్ చేయలేరు

ఫోన్‌లోని డేటా

ఫోన్‌లోని డేటా

ఎన్‌క్రిప్షన్‌ పూర్తయ్యాకే ఫోన్‌లోని డేటాని పూర్తిగా తొలగించేందుకు ఫ్యాక్టరీ రీసెట్‌ చేయాలి. అయితే, ఫ్యాక్టరీ రీసెట్‌ చేయడానికి ముందు వాడుతున్న గూగుల్‌ ఎకౌంట్‌లు సింక్రనైజ్‌ అయి ఉన్నాయోలేదో చెక్‌ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యాక్టరీ రీసెట్‌ చేసినప్పుడు కాంటాక్ట్‌లు, ఎకౌంట్‌తో ఇన్‌స్టాల్‌ చేసిన అప్లికేషన్లను పోగొట్టుకునే అవకాశం ఉండదు. తిరిగి ఎప్పుడైనా సింక్‌ అయిన డేటాని బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ మీరు ఫ్యాక్టరీ రీసెట్‌ చేయకుంటే ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడి మెనూల్లోని Factory data reset ఆప్షన్‌ని ట్యాప్‌ చేస్తే చాలు. ఫోన్‌లోని మొత్తం డేటా కనిపించకుండా పోతుంది.

 రీరైట్‌ నకిలీ డేటా

రీరైట్‌ నకిలీ డేటా

ఫ్యాక్టరీ రీసెట్‌ చేసిన తర్వాత ఫోన్‌ ఖాళీ అవుతుందంతే. మెమొరీ లొకేషన్స్‌లో పాత డేటా అలానే ఉంటుంది. అందుకే పాత డేటా ఆనవాళ్లు లేకుండా చేయాలంటే మొత్తం ఫోన్‌ మెమొరీని ఏదైనా నకిలీ డేటాతో పూర్తిగా నింపేయాలి. ఏదైనా ప్రయోజనం లేని డేటా... ఇమేజ్‌లు, వీడియోలు, ఎంపీ3 ఫైల్స్‌ లాంటివి అన్నమాట. దీంతో ఫోన్‌ మెమొరీ లొకేషన్స్‌ అన్నీ ఓవర్‌రైట్‌ అయిపోతాయి. అంటే... పాత డేటా స్థానంలో కొత్తగా కాపీ చేసిన డేటా చేరిపోతుంది. ఇక మీ నుంచి కొనుగోలు చేసిన వ్యక్తి డేటాని రికవర్‌ చేయడానికి ప్రయత్నిస్తే నకిలీ డేటానే కనిపిస్తుంది.

 స్విచ్ఛాఫ్:

స్విచ్ఛాఫ్:

ఫోన్ రీసెట్ చేసిన తర్వాత వెంటనే స్విచ్ఛాఫ్ చేయండి. అకౌంట్ లాగిన్ చేయకుండా ఫోన్ వాడితే ఏం కాదనుకోవద్దు. వైఫైకి కనెక్ట్ చేసి ఉపయోగించొద్దు. దీంతో పాటుగా మీ పాత ఫోన్ నుంచి సిమ్ కార్డ్, మొమొరీ కార్డ్‌తో పాటు ఇతర యాక్సెసరీస్ ఏవైనా ఉంటే తీసెయ్యాలి.

ప్యాకింగ్:

ప్యాకింగ్:

బాక్స్‌లో ఫోన్ ప్యాక్ చేయాలి. చార్జర్, ఇయర్‌ఫోన్, కవర్ బాక్స్, ఇన్వాయిస్ లాంటివి ఉంటే ప్యాక్ చేయాలి. ఆన్‌లైన్‌లో మీ ఫోన్ అమ్మాలనుకుంటే మీ ఫోన్ కండీషన్ ఎలా ఉందే డిస్క్రిప్షన్‌లో వివరించాలి. మీ ఫోన్‌లో ఏవైనా లోపాలు ఉన్నా చెప్పడం మంచిది. లేకుంటే మీకు బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది

Best Mobiles in India

English summary
Things You Need to Do Before Selling Your Android Phone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X