Home
News

వాట్సప్‌తో హ్యాకర్లకు చుక్కలు : భారత్‌లో వాట్సప్‌‌కు చిక్కులు

By Hazarath

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందినది ఏదైనా ఉందంటే అది వాట్సప్ మాత్రమే. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మీ ఫోన్ లో వాట్సప్ ఉందా అని అడుగుతారు. మీ వాట్సప్ నెంబర్ పంపండి ఛాట్ చేస్తానంటూ మెసేజ్ లు కూడా పెట్టడం సర్వసాధారణమే. అయితే ఇప్పుడు వాట్సప్ నుంచి వచ్చిన కొత్త ఫీచర్ తో వాట్సప్ ను హ్యాక్ చేయాలంటే ఆ బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. ఏందీ షాక్ అవుతున్నారా..న్యూస్ చదివితే ఇంకా షాక్ అవుతారు.

Read more: వాట్సప్ లో నీకు తెలియని ఫీచర్స్

1

1

వాట్సప్ ఇప్పుడు శత్రు దుర్భేద్యంగా మారింది. తాజాగా ఆ సర్వీస్ ఓనర్లు ఆ యాప్‌కు ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ ఇచ్చారు. అంటే వాట్సాప్ ద్వారా వెళ్లే మెసేజ్‌లు, కాల్స్, వీడియోలు, ఫోటోలను ఎవ్వరూ ఛేదించలేరు.

2

2

సెండర్ నుంచి వెళ్లిన మెసేజ్‌ను కేవలం రిసీవర్ మాత్రం చూడగలరు. నేరస్థులు కానీ, ప్రభుత్వాధికారులు కానీ, హ్యాకర్లు కానీ ఎవ్వరూ ఆ మెసేజ్‌లను అక్రమంగా చూసే ప్రసక్తే లేదు. తాజా ఎన్‌స్క్రిప్షన్ అన్ని ఫోన్లకు వర్తిస్తుందన్నారు. ఐఫోన్, ఆండ్రాయిడ్, విండోస్, బ్లాక్‌బెర్రీ, నోకియా ఫోన్ ఏదైనా మెసేజ్‌లను అక్రమంగా చూడడం సాధ్యం కాదు.

3

3

తాజాగా అప్‌లోడ్ చేసుకున్న వాట్సప్ యాప్‌లకే ఇది వర్తిస్తుంది. వాట్సప్‌ను ప్రస్తుతం ఫేస్‌బుక్ సంస్థ నడుపుతోంది. కానీ దాని అసలు ఓనర్లు కాలిఫోర్నియాలోని మౌంట్‌వ్యూలో ఉన్నారు. వాట్సప్ వ్యవస్థాపకులు జాన్ కౌమ్, బ్రియాన్ అక్టన్‌లు ఎన్‌స్క్రిప్షన్ కోసం తీవ్ర కసరత్తులు చేశారు.

4

4

వాట్సప్ ఎన్‌స్క్రిప్షన్ కోసం మరో వ్యక్తి ఆ ఇద్దరికీ సహకరించాడు. మాక్సీ మార్లిన్ స్పైక్ అనే క్రిప్టోగ్రాఫర్ ఎన్‌స్క్రిప్షన్ టెక్నాలజీని డెవలప్ చేశారు. ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ వల్ల శత్రువులెవరూ మెసేజ్‌లను అక్రమంగా చదవలేరు.

5

5

ఒకవేళ ఆ మెసేజ్‌లను చూడాలనుకున్నా ఆ అక్షరాలు చదవలేని భాషలో కనిపిస్తాయి. మీ వాట్సప్ మెసేజ్‌లను మూడో వ్యక్తి ఎవరైనా హ్యాక్ చేసేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాదు. అంతే కాదు మూడో వ్యక్తి చేస్తున్న చొరబాటు ప్రయత్నాలు మీకు తెలిసిపోతాయి.

6

6

ప్రస్తుతం వాట్సప్‌కు ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వాట్సాప్ ద్వారా వెళ్లే మెసేజ్, ఫోన్ కాల్స్, ఫోటోలు, వీడియోలను ఇప్పుడూ ఎవరూ చేధించలేరు. ఇంకా చెప్పాలంటే వాట్సప్ ఉద్యోగులకు కూడా అది సాధ్యంకాదట. ప్రభుత్వ నిఘా వ్యవస్థలు కూడా ఆ ఎన్‌స్క్రిప్షన్‌ను ఏమీ చేయలేవు.

7

7

అయితే వాట్సప్ తెస్తున్న ఈ ఫీచర్‌తో భారత్‌లో గడ్డు పరిస్థితులు ఎదురయ్యేలా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే మన ఐటీ చట్టాలే ఈ చట్టాల ఆధారంగా వాట్పప్ పై ప్రభుత్వం నిషేధం విధించే అవకాశం కూడా ఉంది.

8

8

యూజర్ల మెసేజ్ లు, వాయిస్ కాల్స్ వాటంతటవే ఎన్ క్రిప్ట్ అయ్యేవిధంగా వాట్సప్ తాజాగా చర్యలు చేపట్టింది. ఈ చర్యల కారణంగా ప్రభుత్వం కావాలని కోరినా వాట్సప్ మీ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వలేదు. బై డిపాల్ట్ గా 256 బిట్ ఎన్ క్రిప్షన్ ను ఇందుకు వాడటమే కారణం.

9

9

ఈ ఎన్ క్రిప్షన్ మన ఐటీ చట్టాల ప్రకారం అక్రమం. 256 బిట్ ఎన్ క్రిప్షన్ వాడినందుకు వాట్సప్ పై ఎవరైనా భారత్‌లో కేసు పెట్టవచ్చు. ఐటీ చట్టాల నియమనిబంధనల ప్రకారం ప్రైవేటు సర్వీసులు ఏవీ కూడా ఈ ఎన్ క్రిప్షన్ ను ఉపయోగించరాదు.ఈ ప్రైవేటు సర్వీసులు ఏమిటన్నది ప్రభుత్వం వెల్లడించలేదు.

10

10

అయితే డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీవోటీ) మాత్రం ఈ విషయమై కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. వీటి ప్రకారం వాట్సప్ అక్రమమంటూ కేసు పెట్టవచ్చు. 2007లో డీవోటీ జారీచేసిన నిబంధనల ప్రకారం భారత్ లో ప్రవేటు పార్టీలు 40 బిట్స్ కన్నా ఎక్కువ ఎన్ క్రిప్షన్ ను ఉపయోగించితే.. అందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని లైసెన్స్ అగ్రీమెంట్ ఫర్ ప్రొవిజన్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీస్ స్పష్టం చేస్తుంది.

11

11

40 బిట్స్ కు మించి ఎన్ క్రిప్షన్ ఉపయోగించే ప్రైవేటు సంస్థలు దానిని అన్‌లాక్ చేసేందుకు అవసరమైన కీస్ (తాళంచెవులు) ప్రభుత్వానికి ఇస్తేనే ఇందుకు అనుమతి ఇస్తుంది. ఈ విధంగా చూసుకుంటే వాట్సప్ కు అనుమతి లభించే అవకాశమే కనిపించడం లేదు.

11

11

తాజా ఎన్ క్రిప్షన్ ను అన్ లాక్ చేసే కీస్ ప్రభుత్వానికి వాట్సప్ ఇవ్వడం అసాధ్యం. ఎందుకంటే తాజాగా చేపట్టిన భద్రతా చర్యల వల్ల ఈ కీస్ వాట్సప్ దగ్గర కూడా ఉండవు. 

13

13

అయితే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే వాట్సప్ ఒక ఇంటర్నెట్ ప్రొవైడర్ సర్వీసు (ఐఎస్పీ) కాదు.అసలు వాట్సప్ భారత్ లో అందించే సేవలకు డీవోటీ లైసెన్స్ అవసరమే లేదు. ఈ నేపథ్యంలో డీవోటీ ఎన్ క్రిప్షన్ నిబంధనలు వాట్సప్ కు వర్తిస్తాయా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Best Mobiles in India

English summary
Here Write WhatsApp adds end-to-end encryption: What is it and what does it mean for you?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X