వాట్సప్ అకౌంట్ వెంటనే అప్‌డేట్ చేయండి, ఎందుకో తెలుసుకోండి
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ యూజర్లు అలర్ట్ అవ్వండి. లేదంటే ప్రమాదంలోకి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే వాట్సప్ ఫ్లాట్ ఫాం మీదకు మాల్ వేర్ బగ్ ప్రవేశించింది. కాబట్టి వాట్సప్ అకౌంట్ ను వెంటనే అప్ డేట్ చేసుకోండి. లేదంటే.. మీ వాట్సప్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ బగ్ కారణంగా భద్రతపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హ్యాకర్లు నుంచి వాట్సప్ అకౌంట్లకు సెక్యూరిటీ పరంగా ముప్పు పొంచి ఉన్నట్టు సైబర్ సెల్ హెచ్చరిస్తోంది.

కంటెంట్ వైరల్ చేస్తే
ప్రతిరోజు బిలియన్ల మంది యూజర్లు తమ వాట్సప్ అకౌంట్లలో ఫొటోలు, వీడియోలు, మెసేజ్ లు, జిఫ్ ఇమేజ్ ఫైల్స్ పంపిస్తుంటారు. ఇందులో ఎక్కువ శాతం ఫేక్ న్యూస్ వైరల్ కంటెంట్ షేర్ అవుతుంది. యూజర్లు తెలిసో తెలియకో ఈ ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేస్తుంటారు. వాట్సప్‌లో బగ్ కారణంగా ఈ కంటెంట్ వైరల్ చేస్తే మాల్ వేర్ చొరబడేందుకు అనుమతి ఇస్తోందని సైబర్ సెల్ తెలిపింది.

బగ్ ఇష్యూను ఫిక్స్ చేసేంత వరకు
దాంతో ఈజీగా మాల్ వేర్ మొబైల్ డివైజ్ లోకి ప్రవేశించి మీ విలువైన డేటాను హ్యాకర్లకు చేరవేస్తుంది. బగ్ ఇష్యూను ఫిక్స్ చేసేంత వరకు యూజర్లు ఎవరూ అనుమానాస్పద లింకులను షేర్ చేయొద్దని హెచ్చరించింది.ప్రతిఒక్కరూ అప్ డేట్ చేసుకోనేంత వరకు ఎలాంటి GIF ఫైల్స్ వాట్సప్ లో ఎవరికి పంపొద్దని తెలిపింది.

విలువైన డేటా గోవిందా
ఒక వేళ మీరు పంపించినట్లయితే జిఫ్ ఫైల్స్ ద్వారా హ్యాకర్లు మాల్ వేర్ జొప్పిస్తుంటారు. తద్వారా వైరస్ డివైజ్ ల్లోకి ప్రవేశించి విలువైన డేటాను తస్కరిస్తుంది. సైబర్ సెల్ టీం వాట్సప్ వెర్షన్ 2.19.244 లో ఈ బగ్ ఉన్నట్టు గుర్తించారు. ఈ వెర్షన్ వాడే యూజర్లను వెంటనే కొత్త వెర్షన్ అప్ డేట్ చేసుకోవాలని వారు సూచించారు.

డిసప్పియరింగ్ మెసేజెస్
ఇదిలా ఉంటే వాట్సప్ త్వరలోనే తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. వాట్సాప్‌లో ఇప్పటికే మనం పంపే మెసేజ్‌లను డిలీట్ చేసుకునే సౌలభ్యం అందిస్తున్న విషయం విదితమే. అయితే ఇకపై అందులో మనం పంపుకునే మెసేజ్‌లు నిర్ణీత సమయం (5 సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటిని ఆటోమేటిగ్గా అదృశ్యమైపోయేలా చేయవచ్చు. అందుకుగాను వాట్సప్‌లోని సెట్టింగ్స్ విభాగంలో అందజేసే డిసప్పియరింగ్ మెసేజెస్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉండగా.. త్వరలోనే వాట్సప్ యూజర్లందరికీ లభ్యం కానుంది..!


Click it and Unblock the Notifications








