వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఇప్పుడు అందరికి అందుబాటులో
భారత్‍లోని వాట్సాప్ యూజర్లు ఏ విధమైన ఇన్విటేషన్ ప్రక్రియ అవసరం లేకుండానే వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోగలుగుతున్నారు. ఒకవేళ ఇప్పటికి మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ యాక్టివేట్ కానట్లయితే.. వాట్సాప్ అధికారిక వెబ్‌సైట్ నుంచి 2.12.19 వర్సన్ ఏపీకే ఫైల్‌ను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇక నేరుగా వాయిస్ కాల్స్‌ను చేసుకోవచ్చు.

వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను సపోర్ట్ చేయాలంటే మీ డివైస్ ఆండ్రాయిడ్ 2.1 లేదా ఆపై ఆపరేటింగ్ సిస్టంను సపోర్ట్ చేసిదిగా ఉండాలి. ఈ ఫీచర్ మీ స్మార్ట్‌ఫోన్‌లో నిరాటంకంగా పనిచేయాలంటే అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ డేటా ప్లాన్‌ను ఎంపిక చేసుకోండి. వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ టాబ్లెట్ డివైస్‌లను సపోర్ట్ చేయదు.

వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ కోసం యాపిల్ ఐఓఎస్ యూజర్లు మరికొద్ది రోజులు ఓపిక పట్టక తప్పదు.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి


Click it and Unblock the Notifications








