వాట్సాప్‌లో కాల్ బ్యాక్, వాయిస్ మెయిల్ ఫీచర్లు

కాల్ బ్యాక్, వాయిస్ మెయిల్ ఫీచర్లతో కూడిన సరికొత్త అప్‌డేట్‌ను Whatsapp తన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ బేటా వర్షన్ 2.16.189 ద్వారా ఈ యూజర్లు ఈ ఫీచర్లను పొందవచ్చు. ప్రస్తుతానికి ఈ అప్‌డేట్‌ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో లేదు. ఔత్సాహికులు APK ఫైల్‌ ద్వారా కొత్త అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

Read More : ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్‌తో Nokia స్మార్ట్‌ఫోన్‌లు!

వాట్సాప్‌లో కాల్ బ్యాక్, వాయిస్ మెయిల్ ఫీచర్లు

కాల్ బ్యాక్, వాయిస్ మెయిల్ ఫీచర్ల ప్రత్యేకతలేంటి..?

వాట్సాప్ కాల్‌ను అవతలి వ్యక్తి అటెండ్ చేయని పక్షంలో కాల్ చేసిన వ్యక్తి పోన్‌లో కాల్ బ్యాక్, వాయిస్ మెయిల్ ఫీచర్లు కనిపిస్తాయి. కాల్ బ్యాక్ ఆప్షన్‌తో యూజర్లు వెంటనే మళ్లీ కాల్ చేసే సౌకర్యం కలిగిస్తోంది. వాయిస్ మెయిల్ ఫీచర్‌తో వాయిస్ మెసేజ్‌లను అవతలి వ్యక్తులకు పంపించుకోవచ్చు. వాట్సాప్ యూజర్లుకు మెసేజ్ టెక్స్టింగ్‌లో కొత్తదనాన్ని తీసుకువచ్చేందుకు ఇటీవలే 'FixedSys font'ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒప్పందం విలువ1,18,000 కోట్లు

ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్‌‍ను 2009లో ఇద్దురు మాజీ - యాహూ ఉద్యోగులు అమెరికన్ బ్రెయిన్ ఆక్టన్, ఉక్రేనియన్ జాన్ కౌమ్‌లు ప్రారంభించారు. 2014లో ఈ కంపెనీని సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ 19 బిలియన్ డాలర్లు (అప్పటి భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ 1,18,000 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసింది. వాట్సాప్ గురించిన పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం...

యాక్టివ్ యూజర్లు భారత్‌లోనే

ఏప్రిల్ 2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ యూజర్ల సంఖ్య 800 మిలియన్లు. వాట్సాప్‌కు అత్యధిక మంది యాక్టివ్ యూజర్లు భారత్‌లోనే ఉండటం విశేషం.

10 లక్షల మంది కొత్తగా

వాట్సాప్‌లో రోజుకు 10 లక్షల మంది కొత్తగా రిజిష్టర్ అవుతున్నారు. జనవరి 2015 లెక్కల ప్రకారం వాట్సాప్ ద్వారా ఒక్క రోజులో 30 బిలియన్‌లు మెసేజ్‌లు సెంట్ అలానే రిసీవ్ కాబుడున్నాయి.

వారానికి 195 నిమిషాలు

వాట్సాప్‌లో సగటు యూజర్ వారానికి 195 నిమిషాల పాటు గడుపుతున్నాడు.

గూగుల్ కూడా ప్రయత్నించిం

వాట్సాప్‌ను కొనుగోలు చేసేందుకు గూగుల్ కూడా ప్రయత్నించింది. గూగుల్ ఆఫర్ చేసిన డీల్ విలువ 10 బిలియన్ డాలర్లు.

సెల్ఫీలలో 27శాతం

సోషల్ మీడియాలో షేర్ అవుతోన్న సెల్ఫీలలో 27శాతం వాటా వాట్సాప్‌దే.

ఉద్యోగం కోసం ట్రై చేసాడు

వాట్సాప్ ఫౌండర్ జాన్‌కౌమ్ 2008లో ఫేస్‌బుక్ లో ఉద్యోగం కోసం ట్రై చేసాడు. అయితే అతనికి ఉద్యోగం దక్కలేదు.

ప్రపంచ ఎస్ఎంఎస్ వాల్యుమ్‌ను

ప్రపంచ ఎస్ఎంఎస్ వాల్యుమ్‌ను వాట్సాప్ ఎస్ఎంఎస్ వాల్యుమ్ ఎప్పుడో అధిగమించేసింది.

ఉద్యోగుల సంఖ్య 55 మాత్రమే

వాట్సాప్ మొత్తం ఉద్యోగుల సంఖ్య కేవలం 55 మాత్రమే. వారిలో 34 మంది ఇంజినీర్లు ఉన్నారు.

1000 మెసేజ్‌లు

సగటు యూజర్ వాట్సాప్ ద్వారా నెలకు 1000 మెసేజ్‌లను పంపుతున్నాడు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Whatsapp Android Beta Version Gets Call Back and Voice Mail Feature!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot