వాట్సాప్ పేమెంట్స్ లో క్యాష్‌బ్యాక్ రివార్డులు!! మిస్ అవ్వకండి...

|

WhatsApp ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లోకి కొన్ని సంవత్సరాల క్రితం UPI పేమెంట్స్ ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చింది. కానీ ఇది అనేక కారణాల వల్ల రీకాల్ చేయబడింది. మళ్ళీ ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అయితే అది తగినంత ట్రాక్షన్ పొందడంలో విఫలమైంది. ఇప్పుడు అనుకున్నంత ట్రాక్షన్ ను పొందే ప్రయత్నంలో భాగంగా WhatsApp పేమెంట్స్ Google Pay అడుగుజాడలను అనుసరించనున్నది.

 

పేమెంట్ సర్వీసు

ఈ పేమెంట్ సర్వీసును ఉపయోగించి డబ్బు పంపే వినియోగదారులకు వాట్సాప్ క్యాష్‌బ్యాక్‌లను అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ చర్యతో ఫేస్‌బుక్ యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ పేమెంట్స్ వినియోగాన్ని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి 32,43-ఇంచ్ స్మార్ట్ టీవీలు లాంచ్ అయ్యాయి!! అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో మొదటి సేల్స్రెడ్‌మి 32,43-ఇంచ్ స్మార్ట్ టీవీలు లాంచ్ అయ్యాయి!! అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో మొదటి సేల్స్

WhatsApp UPI పేమెంట్స్ లో వినియోగదారులకు రివార్డ్
 

WhatsApp UPI పేమెంట్స్ లో వినియోగదారులకు రివార్డ్

WABetaInfo యొక్క తాజా నివేదిక ప్రకారం వాట్సాప్ పేమెంట్ సర్వీస్ ను ఉపయోగించే వినియోగదారులకు క్యాష్‌బ్యాక్‌ను రివార్డ్ చేసే ఫీచర్‌ని తీసుకురావచ్చు. ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉన్నందున వినియోగదారులందరికీ అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొన్నారు. అలాగే రాబోయే ఫీచర్‌కి సంబంధించి తన క్లెయిమ్‌ను బ్యాకప్ చేయడానికి ప్రచురణ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. స్క్రీన్ షాట్ చాట్ ట్యాబ్‌లోని చాట్‌ల పైన కొత్త బ్యానర్‌ను చూపుతుంది. ఇది పిన్ చేసిన సంభాషణల పైన కనిపిస్తుంది. బ్యానర్ బహుమతి చిహ్నాన్ని చూపుతుంది మరియు "మీ తదుపరి పేమెంట్ పై క్యాష్‌బ్యాక్ పొందండి" అని చూపుతున్నది. ఇంకా ఇది "ప్రారంభించడానికి దీని మీద నొక్కండి" అని కూడా చూపుతున్నది.

క్రికెట్ అభిమానులకు Vi యాప్‌లో ‘ప్లే అలాంగ్' సరికొత్త ఫీచర్!!క్రికెట్ అభిమానులకు Vi యాప్‌లో ‘ప్లే అలాంగ్' సరికొత్త ఫీచర్!!

క్యాష్‌బ్యాక్ ఫీచర్

వాట్సాప్ యొక్క క్యాష్‌బ్యాక్ ఫీచర్ భారతదేశంలోని వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని నివేదిక పేర్కొంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రూ.10 లేదా అంతకంటే ఎక్కువ చెల్లింపు మీద కూడా క్యాష్‌బ్యాక్ పొందడానికి అర్హమైనది. ఈ ఎత్తుగడతో ప్లాట్‌ఫాం గత సంవత్సరం నవంబర్‌లో బీటా నుండి బయటకు వెళ్లిన దాని UPI చెల్లింపు సర్వీస్ యొక్క వినియోగదారుని పెంచడానికి తన యొక్క ప్రయత్నం చేస్తున్నది. ప్రస్తుతానికి వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ గురించి వినియోగదారులను హెచ్చరించలేదు.

వాట్సాప్ పేమెంట్ లపై పెద్ద మొత్తాన్ని అందిస్తుంది

వాట్సాప్ పేమెంట్ లపై పెద్ద మొత్తాన్ని అందిస్తుంది

కొన్ని ఆన్ లైన్ నివేదికల ప్రకారం వాట్సాప్ భారతదేశంలో పేమెంట్ సర్వీసుపై పెద్దగా బెట్టింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. UPI సర్వీసుకు సంబంధించి వినియోగదారులకు అవగాహన కల్పించే దిశగా ఇది పనిచేస్తోంది. ఈ సర్వీసుకు సంబంధించిన ఒక ప్రధాన ప్రకటన ప్రచారంలో పని చేయాలని కంపెనీ భావిస్తోంది. మెసేజింగ్ యాప్‌లోని పేమెంట్ల సామర్థ్యాన్ని ప్రజలు అర్థం చేసుకోవడానికి మరియు ఉపయోగించుకోవడానికి వారు మరింత మార్కెటింగ్ ప్రయత్నాలను ఉపయోగిస్తారని వాట్సాప్ పే హెడ్ డైరెక్టర్ మనేష్ మహాత్మే మీడియాకు చెప్పారు. ఇది కేవలం ఫోటోను షేర్ చేసినంత సింపుల్‌గా ఉంటుంది. డిజిటల్ పేమెంట్ స్వీకరణ దేశ డిజిటల్ ఆర్థిక ప్రయాణంలో కీలక దశ కాబట్టి వాట్సాప్ దీనికి గణనీయమైన సహకారాన్ని అందించాలని భావిస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
WhatsApp Banking Payment Service Offers Cashback Rewards in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X