74 లక్షల అకౌంట్లపై నిషేధం విధించిన వాట్సాప్.. కారణం ఏంటి?
ప్రముఖ మెసేజింగ్ యాప్ Whatsapp కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో 74 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్లు ప్రకటించింది. ఆగస్టు 2023 నెలలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఐటీ నిబంధనలు 2021కి అనుగుణంగా ఫ్లాట్‌ఫాం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
ఆగస్టు 1 తేదీ నుంచి 31 వరకు 74,20,748 వాట్సాప్ ఖాతాలను (Whatsapp Accounts) నిషేధించినట్లు తెలిపింది. ఈ అకౌంట్లలో సుమారు 35,06,905 వాట్సాప్ అకౌంట్లను ఎటువంటి నివేదికలు రాకముందే నిషేధం విధించినట్లు పేర్కొంది. ఈ మేరకు వాట్సాప్ తన నెలవారీ నివేదికలో పేర్కొంది. వాట్సాప్‌లో 500 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు.

గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కంటెంట్, ఇతర సమస్యల పరిష్కారానికి ఈ కమిటీ పనిచేస్తుంది. వాట్సాప్ నివేదిక ఆధారంగా రిమెడియల్ చర్య తీసుకుందని అంటే ఖాతాలపై నిషేధం లేదా నిషేదించబడిన ఖాతాను యాక్టివేట్ చేయడం అని అర్థం. భారత్‌లో ఆగస్టులో 14,767 ఫిర్యాదు అందుకున్నట్లు తెలిపింది. 71 నివేదికలపై చర్య తీసుకున్నట్లు తెలిపింది.
* వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo ప్రకారం అప్‌డేట్ ట్యాబ్‌లో సెర్చ్ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉన్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా చాలా ఉపయోగాలు ఉంటాయని వాట్సాప్ చెబుతోంది.

మెటా నేతృత్వంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఇటీవల ఛానల్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన వ్యక్తులు, సంస్థల ఛానల్‌లో జాయిన్ కావచ్చు. మరియు అప్‌డేట్లు పొందవచ్చు. అయితే ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న సెర్చ్ ఫీచర్ అందుబాటులోకి వస్తే డైరెక్టరీలోకి వెళ్లకుండా నచ్చిన ఛానల్‌ను సెర్చ్ చేసే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా 2.23.20.16 వెర్షన్‌లో అందుబాటులో ఉంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ ఆధారంగా యాప్ పైభాగంలో సెర్చ్ బటన్ రానుందని తెలుస్తోంది. ఈ సెర్చ్ బటన్ ద్వారా వినియోగదారులు తన స్టేటస్ అప్‌డేట్లు సహా ఛానల్‌లను సులభంగా గుర్తించవచ్చు. ఛానల్ డైరెక్టరీని తెరవకుండానే నచ్చిన ఛానల్‌ను ఓపెన్ చేసుకోవచ్చు.
త్వరలో అందుబాటులోకి రానున్న సెర్చ్ బటన్ వాట్సాప్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుందని తెలుస్తోంది. దీని ద్వారా మరింత సులభంగా మెసేజ్, ఫోటోలు, సమాచారాన్ని గుర్తించగలరు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు అందరికి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడికాలేదు.
దీంతోపాటు వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo నివేదిక ప్రకారం.. వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ చాట్‌ను సలభంగా గుర్తించే విధంగా కొత్త ఐకాన్ సహా నావిగేషన్‌ను మెరుగుపరుస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌ల కోసం ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
వాట్సాప్‌లో నావిగేషన్, కమ్యూనిటీ గ్రూప్ చాట్‌ను సులభంగా నిర్వహించడం సహా ఉపయోగించే అవకాశం బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. ఈ కొత్త ఐకాన్‌తో గ్రూప్ చాట్‌లను సులభంగా గుర్తించవచ్చని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ చెబుతోంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. వినియోగదారులు అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు.


Click it and Unblock the Notifications








