Home
News

Whatsapp కీలక నిర్ణయం.. భారత్‌లో 75 లక్షల ఖాతాలు నిషేధం..!

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది యూజర్లు కలిగిన ఇన్‌స్టంట్‌ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ వినియోగదారుల భద్రత, సౌకర్యల కోసం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల కాలంలో అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరిన్ని ఫీచర్లు ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్నాయి.

తాజాగా వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ నిబంధనలు 2021కి అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. యూజర్ల ఫిర్యాదులు, భారతీయ చట్టాల ఉల్లంఘన, వాట్సాప్‌ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి అక్టోబర్‌ నెల నివేదికను విడుదల చేసింది.

Whatsapp takes action against 75 lakh accounts

నిబంధనల ఉల్లంఘన గుర్తింపు వ్యవస్థ ఆధారంగా అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్య కాలంలో 75,48,000 ఖాతాలను నిషేధించినట్లు తెలిపింది. 19,19,000 వాట్సాప్‌ ఖాతాలను ఎవరూ ఫిర్యాదు చేయకున్నా.. ముందస్తుగా నిషేధం విధించినట్లు పేర్కొంది. యూజర్ల నుంచి అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలపై నివేదిక అందిస్తుంది.

అక్టోబర్‌లో మొత్తం 9063 రిపోర్టులను అందుకున్నామని తెలిపింది. అందులో ఎక్కువ ఫిర్యాదులు నిషేధం గురించి ఉన్నాయని పేర్కొంది. మరియు కొన్ని అకౌంట్‌ సపోర్టు సహా ఇతర అంశాలపై అందినట్లు తెలిపింది. ఫిర్యాదుల, విజ్ఞప్తులు ఆధారంగా చర్యలు తీసుకున్నామని వాట్సాప్‌ వెల్లడించింది. దాంతోపాటు గ్రీవెన్స్‌ అప్పిలేట్‌ కమిటీ నుంచి అందిన ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. సెప్టెంబర్‌ నెలలోనూ 71,11,000 ఖాతాలను వాట్సాప్‌ నిషేధించింది. వీటిలో 25,71,000 ఖాతాలు ముందస్తుగా నిషేధించబడ్డాయి.

* ఇటీవల వాట్సాప్‌ వినియోగదారుల వ్యక్తిగత చాట్‌లకు మరింత భద్రతను కల్పించేందుకు సీక్రెడ్‌ కోడ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. చాట్‌ లాక్‌ చేసిన కాంటాక్ట్‌లకు సీక్రెడ్‌ కోడ్‌ ఏర్పాటుచేసుకొనే అవకాశం ఉంటుంది. ఫలితంగా వ్యక్తిగత చాట్‌లు ఇతరులు యాక్సెస్‌ చేసే అవకాశం ఉండదు. సెర్చ్‌ బార్‌లో సీక్రెట్‌ కోడ్‌ నమోదుచేయడం ద్వారా సీక్రెట్‌ చాట్‌లను యాక్సెస్‌ చేయవచ్చు.

చాట్‌లాక్ చేసిన చాట్‌లను యాక్సెస్‌ చేయాలంటే సెర్చ్‌ బార్‌లో సీక్రెట్‌ కోడ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే చాట్‌ లాక్‌ చేసిన కాంటాక్ట్‌లు కనిపిస్తాయి. ఇతరులు ఎవరూ వాటిని యాక్సెస్‌ చేసే అవకాశం ఉండదు. వ్యక్తిగత చాట్‌లకు మెరుగైన భద్రతను కల్పిస్తుందని మెటా తెలిపింది.

వాట్సాప్‌ చాట్‌ను లాక్‌ చేయడానికి వ్యక్తిగత చాట్ సెట్టింగ్‌ల్లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది. చాట్‌ను లాంగ్‌ ప్రెస్‌ చేయడం ద్వారా వ్యక్తిగత చాట్‌లను లాక్‌ చేయవచ్చని వాట్సాప్‌ తెలిపింది. సీక్రెట్‌ కోడ్‌ ఫీచర్ ప్రస్తుతం కొద్ది మందికే అందుబాటులో ఉందని, త్వరలోనే వినియోగదారులు అందరికీ చేరుతుందని తెలుస్తోంది.

చాట్‌ లాక్‌ చేసిన కాంటాక్ట్‌లను ప్రైవేటుగా ఉంచేందుకు వాట్సాప్‌ చాట్‌ జాబితాను తెరవాలి. ఎగువన ఉన్న మూడు చుక్కలపైన క్లిక్‌ చేయాలి. దీని తర్వాత చాట్‌ లాక్ సెట్టింగ్‌లకు వెళ్లి " Hide Locked Chats " ఆప్షన్‌ను ఆన్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సీక్రెట్‌ కోడ్‌ను ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది.

లాక్ చేసిన చాట్‌లను ఓపెన్ చేసేందుకు సెర్చ్‌ బార్‌లో సీక్రెట్ కోడ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే లాక్‌ చేసిన కాంటాక్ట్‌లు ఓపెన్ అవుతాయి. యాప్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాటిని యాక్సెస్‌ చేసేందుకు మరోసారి సీక్రెట్‌ కోడ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Whatsapp bans over 75 lakh accounts in october 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X