రాజ్యసభ ఎంపి అకౌంట్ ను బ్యాన్ చేసిన వాట్సప్, ఎందుకో తెలుసా..?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ వాట్సాప్ ఖాతాను ఆ సంస్థ బ్యాన్ చేసింది.

|

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ వాట్సాప్ ఖాతాను ఆ సంస్థ బ్యాన్ చేసింది .వివరాల్లోకి వెళ్తే..తన ఫోన్ లో వాట్సాప్ పని చేయకపోవడంతో సీఎం రమేష్‌ దీనిపై ఆ సంస్థను వివరణ కోరుతూ లేఖ రాశారు. అయితే రమేశ్ ఇచ్చిన ఫిర్యాదుకు ఆ సంస్థ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. మీరు వాట్సాప్ సేవలు వాడుకునేందుకు అర్హత కోల్పోయారంటూ వాట్సాప్ సంస్థ తెలిపింది . ఆయన ఖాతాపై అనేక ఫిర్యాదులు రావడంతో పరిశీలించి చివరకు బ్యాన్ చేసినట్లు ఆ సంస్థ తెలిపింది .ప్రైవసీ రూల్స్ ను అమలు చేయడంలో వాట్సాప్ చాలా కటినంగా ఉంటుంది . ఒక వేళా మీరు కూడా ఆ రూల్స్ బ్రేక్ ను చేస్తే వాట్సాప్ మిమ్మల్ని బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంది. మరి ఆ రూల్స్ ఏంటో ఓ సారి చూడండి...

జియో దెబ్బకు ఆరు ప్లాన్లను సవరించిన బిఎస్ఎన్ఎల్, పూర్తి వివరాలు తెలుసుకోండిజియో దెబ్బకు ఆరు ప్లాన్లను సవరించిన బిఎస్ఎన్ఎల్, పూర్తి వివరాలు తెలుసుకోండి

నంబర్ ఎక్కువ సార్లు బ్లాక్ చేయబడితే....

నంబర్ ఎక్కువ సార్లు బ్లాక్ చేయబడితే....

వాట్సాప్ లో కొన్ని అన్ నోన్ నంబర్స్ నుంచి మనకు తరుచుగా అనుచిత మెసేజ్ లు ,ఫోటోలు,డాకుమెంట్స్ వస్తుంటాయి ఆ సమయంలో మనం చేసే పని ఒకటే ఒకటి ఆ నెంబర్ ను బ్లాక్ చేయడం లేదా రిపోర్ట్ చేయడం.ఒక వేళా ఆ నెంబర్ ను అనేక మంది బ్లాక్ చేస్తే అలాంటి వారిని వాట్సాప్ బ్యాన్ చేస్తుంది.

వైరస్ లేదా మాల్వేర్లను పంపించడం...

వైరస్ లేదా మాల్వేర్లను పంపించడం...

వారి ప్లాట్ఫారమ్ ద్వారా ఏదైనా ఇతర వినియోగదారుకు వైరస్ లేదా మాల్వేర్లను పంపించడం యాప్ లో నిషేధించబడింది. అందువల్ల, మీరు వైరస్లను లేదా మాల్వేర్ ను కలిగి ఉన్న ఎవరికైనా పంపుతున్నట్లయితే వాట్సాప్ మిమ్మల్ని బ్యాన్ చేస్తుంది.

వాట్సాప్ సర్వర్లు హాక్ చేయడానికి ప్రయత్నిస్తే....
 

వాట్సాప్ సర్వర్లు హాక్ చేయడానికి ప్రయత్నిస్తే....

మీరు ఎవరినైనా స్పై చేయడం కోసం వాట్సాప్ సర్వర్లు హాక్ చేయడానికి ప్రయత్నిస్తే మీరు మీ వాట్సాప్ అకౌంట్ ను కోల్పోతారు. WhatsApp నుండి ఇతర వినియోగదారుల గురించి చట్టవిరుద్ధ సమాచారాన్ని సేకరించడం నిషేధించబడింది.

వాట్సాప్ ప్లస్ అకౌంట్ ఉపయోగిస్తున్నటైతే...

వాట్సాప్ ప్లస్ అకౌంట్ ఉపయోగిస్తున్నటైతే...

మీరు వాట్సాప్ ప్లస్ అకౌంట్ ఉపయోగిస్తున్నటైతే వాట్సాప్ మిమ్మల్ని బ్యాన్ చేస్తుంది ఎందుకంటే వాట్సాప్ ఈ వాట్సాప్ ప్లస్ అప్లికేషన్ ను ఇప్పటి వరకు డెవలప్ చేయలేదు.గతంలోనే వాట్సాప్ ఈ వాట్సాప్ ప్లస్ అప్లికేషన్ కి వాట్సాప్ కి ఎటువంటి సంబంధం లేని కంపెనీ పేర్కొంది.

ఒక కాంటాక్ట్ లేదా గ్రూప్ పై ఫిర్యాదు చేస్తే వాట్సాప్ బ్యాన్ చేస్తుంది....

ఒక కాంటాక్ట్ లేదా గ్రూప్ పై ఫిర్యాదు చేస్తే వాట్సాప్ బ్యాన్ చేస్తుంది....

వాట్సాప్ లో ఎవరైనా చట్టవిరుద్ధ కంటెంట్ పంపిస్తుంటే ఆ కాంటాక్ట్ లేదా గ్రూప్ పై ఫిర్యాదు చేయడానికి అనుమతిస్తుంది.ఒక వేళా వాట్సాప్ అలంటి ఫిర్యాదులను కనుగొంటే వాట్సాప్ వారి అకౌంట్ ను డీ-యాక్టీవ్ట్ చేస్తుంది.

వాట్సాప్ కోడ్ ను మాడిఫై చేస్తే....

వాట్సాప్ కోడ్ ను మాడిఫై చేస్తే....

మీరువాట్సాప్ కోడ్ ను మాడిఫై చేయడానికి ప్రయత్నిస్తే , మీరు మీ వాట్సాప్ అకౌంట్ ను కోల్పోతారు.

బల్క మెసేజింగ్, ఆటో-మెసేజింగ్, ఆటో-డయలింగ్ వంటి చట్టవిరుద్ధ లేదా ఆమోదయోగ్యమైన సమాచారాలను పంపిస్తే...

బల్క మెసేజింగ్, ఆటో-మెసేజింగ్, ఆటో-డయలింగ్ వంటి చట్టవిరుద్ధ లేదా ఆమోదయోగ్యమైన సమాచారాలను పంపిస్తే...

వాట్సాప్ టర్మ్స్ అండ్ కండీషన్స్ ప్రకారం బల్క మెసేజింగ్ ఆటో-మెసేజింగ్, ఆటో-డయలింగ్ వంటి చట్టవిరుద్ధ లేదా ఆమోదయోగ్యమైన సమాచారాలను పంపడం నిషేధించబడింది. అందువల్ల మీ కాంటాక్ట్ లో ని నెంబర్ కి ఇలాంటి మెసేజీలు పంపితే వాట్సాప్ మిమ్మల్ని బ్యాన్ చేస్తుంది.

ఇతరుల పేరుతో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేస్తే...

ఇతరుల పేరుతో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేస్తే...

ఇతరుల పేరుతో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేస్తే వాట్సాప్ మిమ్మల్ని బ్యాన్ చేస్తుంది

తప్పుడు ఆరోపణలు లేదా తప్పుదోవ పట్టించే ప్రకటనలు ప్రచురించడంలో పాల్గొంటే...

తప్పుడు ఆరోపణలు లేదా తప్పుదోవ పట్టించే ప్రకటనలు ప్రచురించడంలో పాల్గొంటే...

మీరు అబద్ధాలు, తప్పుడు ఆరోపణలు లేదా తప్పుదోవ పట్టించే ప్రకటనలు ప్రచురించడంలో పాల్గొంటే వాట్సాప్ నుండి నిషేధించబడతారు

చట్టవిరుద్ధమైన, అశ్లీలమైన మెసేజీలను పంపడానికి ప్రయత్నిస్తే....

చట్టవిరుద్ధమైన, అశ్లీలమైన మెసేజీలను పంపడానికి ప్రయత్నిస్తే....

చట్టవిరుద్ధమైన, అశ్లీలమైన, అపవాదు, బెదిరింపు, భయపెట్టడం, వేధించడం, ద్వేషపూరిత, జాతిపరంగా అప్రియమైన మెసేజీలను పంపడానికి ప్రయత్నిస్తే వాట్సాప్ మిమ్మల్ని బ్యాన్ చేస్తుంది

Best Mobiles in India

English summary
WhatsApp bans Rajya Sabha MP, 13 reasons why WhatsApp may ban you too.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X