వాట్సాప్‌లో కీలక ఫీచర్.. iOS మెనూ తరహాలో..!
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది వాట్సాప్ వినియోగిస్తున్నారు. భారీ ఎత్తున ఉన్న వినియోగదారుల కోసం వాట్సాప్ కూడా అనేక కీలక ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా తన ఆండ్రాయిడ్ యాప్ మెసేజ్ మెనూపై వాట్సాప్ పనిచేస్తోందని సమాచారం. ఇందులో మెసేజ్‌లను సెలక్ట్ చేసినప్పుడు iOS తరహా అనుభూతి కలుగుతుందని సమాచారం.
ఈ మెసేజ్‌లపై లాంగ్‌ప్రెస్ చేసినప్పుడు, మెనూలో ఐదు ఎంపికలు వస్తాయని తెలుస్తోంది. వాట్సాప్ బీటా వెర్షన్ 2.23.11.4లో ఈ అప్‌డేట్ వస్తుందని సమాచారం. రీ డిజైన్ మెసేజ్ మెనూ ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్నాయని, త్వరలో రానున్న బీటా అప్‌డేట్ వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఐఫోన్ డిజైన్‌ను పోలి ఉండేలా ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ మెసేజ్ మెనును రీడిజైన్‌పై పనిచేస్తోందని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo వెల్లడించింది. ఏదైనా మెసేజ్‌ను లాంగ్ ప్రెస్ చేసినప్పుడు డిలీట్, ఫార్వడ్, రిప్లై, కీప్, ఇన్‌ఫొ.. ఆప్షన్లు వస్తాయని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ తెలిపింది.
ప్రస్తుతం ఉన్న వాట్సాప్ ఇంటర్‌ఫేస్‌లో ఏదైనా చాట్ ఓపెన్ చేసినప్పుడు ఆరు ఆప్షన్లు చూపిస్తుంది. అవి డిలీట్, ఫార్వడ్, రిప్లై, స్టార్, ఇన్‌ఫో, మరియు కాపీ కనిపిస్తాయి. దాంతోపాటు ఎమోజీలు కూడా కనిపిస్తాయి. అయితే త్వరలో రీ డిజైన్ చేసిన మెనూ రానుంది. అయితే బీటా టెస్టర్‌లకు ఈ అప్‌డేట్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందన్న దానిపై వాట్సాప్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇతర టెస్టింగ్ దశలో ఉన్న ఫీచర్‌ల మాదిరిగానే బీటా వెర్షన్‌లో అందుబాటులోకి తీసుకురావచ్చు.
చాట్ లాక్ ఫీచర్ : ఎప్పటి నుంచో ఎదురుచూసిన ఫీచర్‌ను వాట్సాప్ ఇటీవల లాంచ్ చేసింది. చాట్ లాక్ ఫీచర్ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ మరింత గోప్యత మరియు భద్రతను అందిస్తుంది. ఇప్పటికే ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్న వాట్సాప్ చాట్ లాక్ ఫీచర్ ద్వారా వినియోగదారులకు మరింత భద్రతను అందిస్తోంది.
వాట్సాప్‌లో ఈ చాట్ లాక్ ఫీచర్ ఉపయోగించుకోవాలంటే?
ముందుగా వాట్సాప్ ఖాతా తెరిచి, మీరు లాక్ చేయాలనుకుంటున్న చాట్‌ను ఎంచుకోవాలి. మీ చాట్ ప్రొఫైల్ చిత్రం పక్కన ఉన్న వ్యక్తి లేదా గ్రూప్ పేరుపై క్లిక్ చేయండి. అనంతరం క్రిందికి స్రోల్ చేయాలి. లాక్ చాట్ పై క్లిక్ చేయాలి. ఆపై మీ పాస్‌వర్డ్ లేదా వేలిముద్రతో చాట్‌ను లాక్ చేయండి.
అయితే ఇటీవల సంచలనం సృష్టించిన వాట్సాప్ కాల్స్‌పై టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఇటీవల కొన్ని మొబైల్ నంబర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి వాటి సర్వీసులు నిలిపేసినట్లు చెప్పారు. ఆ నంబర్ల వాట్సాప్ అకౌంట్లను నిలివి వేసేందుకు వాట్సాప్ అంగీకరించిందని వెల్లడించారు.
"ఇటీవల జరిగిన మోసాల పట్ల జాగ్రత్తగా ఉన్నాం. ఈ విషయమై వాట్సాప్‌తో సంప్రదింపులు జరిపాం. కస్టమర్ భద్రత చాలా ముఖ్యమని వాట్సాప్ కూడా అంగీకరించింది. ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించిన వారి ఖాతాలను రద్దు చేసేందుకు వాట్సాప్ సిద్ధం" అని కేంద్ర టెలికాం శాఖ మంత్రి తెలిపారు. ఇటీవల కొన్ని అంతర్జాతీయ నంబర్ల నుంచి అనేక మంది మోసపూరిత ఫోన్లు వచ్చాయి. దీనిపై అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. దీనిపై వెంటనే చర్యలు తీసుకుంది.


Click it and Unblock the Notifications








