నోకియా, బ్లాక్‌బెర్రీలతో వాట్సాప్ తెగతెంపులు..?

Written By:

నోకియా, బ్లాక్‌బెర్రీ వంటి ప్లాట్‌ఫామ్‌లతో 'వాట్సాప్' తెగతెంపులు చేసుకోబోతోంది. తాజాగా, తెలియవచ్చిన సమాచారం మేరకు బ్లాక్ బెర్రీ 10, నోకియా ఎస్40, నోకియా సింబియాన్ ఎస్60, ఆండ్రాయిడ్ 2.1, ఆండ్రాయిడ్ 2.2, విండోస్ ఫోన్ 7.1 ఫ్లాట్‌ఫామ్‌లకు వాట్సాప్ తన సేవలను నిలిపివేయబోతోంది. ఈ మోడల్ మొబైల్ ఫోన్స్‌లో వాట్సప్ సేవలను మెరుగుపరుచుకునేందుకు అనువుగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు లేకపోవటం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది.

నోకియా, బ్లాక్‌బెర్రీలతో వాట్సాప్ తెగతెంపులు..?

ఈ ఏడాది చివరి నాటికి ఈ సేవలు నిలిచిపోనున్నాయి. వాట్సాప్ తీసుకున్న నిర్ణయం లక్షలో ఫోన్‌ల పై ప్రభావం చూపనుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్ డేట్ చేసుకోవటం ద్వారా వాట్సాప్ సేవలను అంతరాయం లేకుండా పొందవచ్చని సంస్థ తెలిపింది.

Read More : ఈ 10 పనులు స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే చేయగలవు

వాట్సాప్‌లో అసత్యాలు, అపోహలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను వేదికగా చేసుకుంటున్న పలువురు ఆకతాయలు బూటకపు ప్రచారాలకు తెరలేపుతున్నారు. దయచేసి వీటిని నమ్మకండి. ఇంటర్నెట్‌లో అలజడి రేపుతోన్న పలు ఆసక్తికర పుకార్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సాప్‌లో అలజడి రేపుతోన్న ఆసక్తికర పుకార్లు

వాట్సాప్ అప్లికేషన్‌ను మీ ఫోన్‌లలో గూగుల్ ప్లే, విండోస్, ఐఓఎస్ వంటి నమ్మకమైన ఫ్లాట్‌ఫామ్‌ల నుంచే నుంచే ఇన్‌స్టాల్ చేసుకోండి. థర్టీ పార్టీ సోర్సుల నుంచి వద్దు.

వాట్సాప్‌లో అలజడి రేపుతోన్న ఆసక్తికర పుకార్లు

మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను వాట్సాప్ ఎప్పటికి అడగదు. అటువంటి సందేశాలు మీ వాట్సాప్ నెంబర్‌కు వచ్చినట్లయితే, ఖచ్చితంగా అవి మోసపూరితమైనవే. కాబట్టి మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన వివరాలను ఎవ్వరికి వెల్లడించకండి.

వాట్సాప్‌లో అలజడి రేపుతోన్న ఆసక్తికర పుకార్లు

ఈ వాట్సాప్ మెసెజ్‌ను మీ మిత్రులకు షేర్ చేస్తే, వాట్సాప్ అకౌంట్ మీకు పూర్తిగా ఉచితమని గతంలో పలు రూమర్స్ వచ్చాయి. వీటిలో ఎలాంటి వాస్తవం లేదు వాట్సాప్ అకౌంట్ పూర్తి ఉచితమని తెలుసుకోండి.

వాట్సాప్‌లో అలజడి రేపుతోన్న ఆసక్తికర పుకార్లు

వాట్సాప్ యాక్టివ్ కాలింగ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాటమనేది వాట్సాప్ నుంచి వచ్చే మెసేజ్ ద్వారా సాధ్యమవుతుందని ని ఓ రూమర్ ప్రచారంలో ఉంది. ఈ ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు. వాట్సాప్ యాక్టివ్ కాలింగ్ ఫీచర్ అనేది పూర్తిగా ఉచితం. యాక్టివ్ కాలింగ్ సదుపాయాన్ని కలిగి ఉన్న వాట్సాప్ యూజర్ మరొక యూజర్‌కు కాల్ చేయటం ద్వారా ఇది యాక్టివేట్ అవుతుంది.

వాట్సాప్‌లో అలజడి రేపుతోన్న ఆసక్తికర పుకార్లు

ఇదిక బూటకపు వాట్సాప్ మెసెజ్ (ఉదాహరణ మాత్రమే)

వాట్సాప్‌లో అలజడి రేపుతోన్న ఆసక్తికర పుకార్లు

ఏ విధమైన కారణం లేకుండా వాట్సాప్ మీ అకౌంట్‌ను సస్పెండ్ చేయదు. ఏదైనా బలమైన కారణముంటేనే వాట్సాప్ చర్య తీసుకుంటుంది.

వాట్సాప్‌లో అలజడి రేపుతోన్న ఆసక్తికర పుకార్లు

వాట్సాప్ ఎలాంటి లాటరీలను ప్రోత్సహించటం లేదు. లాటరీ తగిలందంటూ మీ అకౌంట్‌కు వచ్చే మెసేజ్‌లను ఏ మాత్రం విశ్వసించకండి. ఇవి పూర్తిగా నిరాధారమైనవి.

వాట్సాప్‌లో అలజడి రేపుతోన్న ఆసక్తికర పుకార్లు

మీరు పంపే మెసెజ్‌లకు వాట్సాప్ ఏ విధమైన చార్జ్‌లను వసూలు చేయదు. ఇది పూర్తిగా ఉచితం.

వాట్సాప్‌లో అలజడి రేపుతోన్న ఆసక్తికర పుకార్లు

వాట్సాప్ మూసేస్తున్నారంటూ వదంతులు కొన్ని మోసపూరిత మెసెజ్ లు హల్ చల్ చేస్తున్నాయి. ఇవి పూర్తిగా నిరాధారం.

వాట్సాప్‌లో అలజడి రేపుతోన్న ఆసక్తికర పుకార్లు

వాట్సాప్ అప్లికేషన్‌ను మీ ఫోన్‌లలో గూగుల్ ప్లే, విండోస్, ఐఓఎస్ వంటి నమ్మకమైన ఫ్లాట్‌ఫామ్‌ల నుంచే నుంచే ఇన్‌స్టాల్ చేసుకోండి. థర్టీ పార్టీ సోర్సుల నుంచి వద్దు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Whatsapp Breaks up its Relationship With Android, BlackBerry and Nokia!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot