వాట్సాప్‌ సరికొత్త ఫీచర్ల జాబితాలో రెండు తాజా చేరికలు!! మెసేజ్ ఎడిట్, మెసేజ్ రియాక్షన్ స్కిన్ టోన్‌లు

|

వాట్సాప్ అంటే ఏమిటో ప్రస్తుత కాలంలో తెలియని వారు ఉండరు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఇప్పుడు అధికంగా దీనినే వినియోగిస్తున్నారు. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందిస్తూ తన యొక్క యూజర్లను ఆకట్టుకుంటున్నది. అందులో భాగంగానే వాట్సాప్ లో మెసేజ్లను పంపిన తర్వాత వాటిని సవరించడానికి కొత్తగా ఒక ఎంపికను జోడిస్తోంది. దీని సాయంతో తప్పుగా పంపిన మెసేజ్ ని చాట్ నుండి పూర్తిగా తొలగించకుండా మరియు మరొక కొత్త మెసేజ్ ని వ్రాయకుండా మెసేజ్ లోని టైపింగ్ లోపాలను సరిదిద్దడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. దీనితో పాటుగా వాట్సాప్ కొత్త ఫీచర్ చేరికలో మెసేజ్ రిసీవర్ల కోసం వివిధ స్కిన్ టోన్‌లకు మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. ఈ కొత్త జోడింపు ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ కోసం మాత్రమే అందుబాటులోకి రానున్నది. బీటా టెస్టింగ్ పూర్తయిన తర్వాత ఇది ప్రజలందరికి అందుబాటులోకి రావచ్చు.

 

వాట్సాప్ బీటా ట్రాకర్ WABetaInfo

వాట్సాప్ బీటా ట్రాకర్ WABetaInfo

వాట్సాప్ బీటా ట్రాకర్ WABetaInfo ప్రకారం వాట్సాప్ వినియోగదారులు వారి టెక్స్ట్ మెసేజ్లను సవరించడానికి అనుమతించే ఎంపికను పరీక్షించడం ప్రారంభించింది. మీరు యాప్‌లో టెక్స్ట్ మెసేజ్‌ని ఎక్కువసేపు నొక్కిన తర్వాత లోపాలను సరిచేయడానికి ప్రస్తుత సమాచారం మరియు కాపీ ఎంపికలతో పాటు ఇది కనిపిస్తుంది. వాట్సాప్‌లో ఎడిట్ ఆప్షన్ ఎలా పని చేస్తుందో సూచిస్తూ WABetaInfo కొన్ని స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసింది. టెక్స్ట్ మెసేజ్ ని ఎక్కువసేపు నొక్కిన తర్వాత పాప్-అప్ మెను నుండి 'సవరించు' ఎంపికను ఎంచుకోవడం ద్వారా వినియోగదారులు స్క్రీన్‌షాట్‌లలో చూసినట్లుగా మెసేజ్ ని సవరించగలరు.

మెసేజ్ ఎడిట్ డెవలప్‌మెంట్

మెసేజ్ యొక్క సవరణ స్థితి గురించి గ్రహీత తెలుసుకోగలరా లేదా అనేది అస్పష్టంగా ఉంది. వినియోగదారులు మెసేజ్ యొక్క మునుపటి సంస్కరణలను తనిఖీ చేయడానికి దాని సవరణ హిస్టరీను చూసే సామర్థ్యాన్ని కూడా పొందలేరు. మెసేజ్ ఎడిట్ డెవలప్‌మెంట్ కు సంబందించిన స్క్రీన్‌షాట్‌లు ఆండ్రాయిడ్ బీటా వినియోగదారుల కోసం వాట్సాప్ సరికొత్త వెర్షన్ నుండి తీసుకోబడ్డాయి. అయితే వాట్సాప్ iOS మరియు డెస్క్‌టాప్ వినియోగదారులకు కూడా ఎడిట్ ఆప్షన్‌ను పరిచయం చేసే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రోల్ అవుట్ యొక్క ఖచ్చితమైన తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు.

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్
 

మెసేజ్లను సవరించే ఎంపికపై వాట్సాప్ పని చేయడం ఇది మొదటిసారి కాదు. ఎడిట్ మరియు రివోక్ ఆప్షన్‌లను తీసుకురావడానికి ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ కొత్త అభివృద్ధిపై పనిచేస్తున్నట్లు 2016లోనే WABetaInfo నివేదించింది. 2017లో యాప్ యొక్క కొన్ని బీటా వెర్షన్‌లలో రెండు ఆప్షన్‌ల కోసం అదనపు రిఫరెన్స్‌లు కూడా వెలువడ్డాయి. అయితే వాట్సాప్ ఆ సమయంలో దాని బీటా టెస్టర్‌లకు కూడా వాటిని ఉపయోగించడానికి వాటిని అందించలేదు. కానీ మెసేజ్లను సవరించడానికి బదులుగా వాట్సాప్ నవంబర్ 2017లో 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులు ఎర్రర్‌ను కలిగి ఉన్న సందేశాన్ని పూర్తిగా తొలగించడానికి అనుమతిస్తుంది.

మెసేజ్ రియాక్షన్ స్కిన్ టోన్‌లు

మెసేజ్ రియాక్షన్ స్కిన్ టోన్‌లు

ప్రస్తుతం వాట్సాప్ ఎడిట్ ఆప్షన్‌లో పని చేయడంతో పాటు నిర్దిష్ట మెసేజ్ రియాక్షన్ కోసం విభిన్న స్కిన్ టోన్‌లకు మద్దతును పరీక్షిస్తోంది. ఇది ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.22.13.4 లో గల వాట్సాప్ వినియోగదారులకు అందించబడిందని WABetaInfo నివేదించింది. కొత్త బీటా వెర్షన్‌తో వినియోగదారులు ఎమోజీల జాబితాలో చివరి స్థానంలో ఉండే స్కిన్ టోన్ ఆధారంగా మెసేజ్ రియాక్షన్ స్కిన్-టోన్‌ను మార్చగలరు. ఉదాహరణకు మీరు ఫోల్డెడ్ హ్యాండ్స్ ఎమోజీ కోసం ముదురు చర్మపు కలర్ ను ఉపయోగించినట్లయితే అదే టోన్ ఫోల్డెడ్ హ్యాండ్స్ రియాక్షన్‌లో కనిపిస్తుంది. మెసేజ్ రియాక్షన్‌లలో స్కిన్ టోన్‌ని మార్చగల సామర్థ్యం థంబ్స్ అప్ మరియు ఫోల్డెడ్ హ్యాండ్స్ ఎమోజీలకే పరిమితమైనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సమయంలో ఇతర రియాక్షన్‌లు విభిన్న స్కిన్ టోన్ ఆప్షన్‌లకు మద్దతు ఇవ్వవు.

Best Mobiles in India

English summary
WhatsApp Brings Edit Messages and Skin Tones in Message Reactions Two New Features

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X