వాట్సాప్ బిజినెస్ అకౌంటులో కొత్త ఫీచర్!! ఉపయోగం ఏమిటో తెలుసా?

|

ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ లో అధికంగా ఉపయోగించే యాప్ వాట్సాప్ ఇప్పుడు కొత్తగా ఒక ఫీచర్‌పై పనిచేస్తోంది అని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ కొత్త ఫీచర్ యొక్క విషయానికి వస్తే బిజినెస్ అకౌంటులకు మెసేజ్ రేటింగ్‌ను జోడించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ వ్యాపార వినియోగదారులు పంపిన మెసేజ్ లను రేట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అంటే ఇది వినియోగదారుల యొక్క అభిప్రాయాన్ని జోడించడం లాంటిది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వినియోగదారుల కోసం అందుబాటులోకి వస్తోంది మరియు కొంతమంది iOS వినియోగదారులు కూడా ఈ ఫీచర్‌ను చూసినట్లు పేర్కొన్నారు. ఈ ఫీచర్‌తో వినియోగదారులు గరిష్టంగా 5 స్టార్ మరియు అత్యల్పంగా 1 స్టార్ తో మెసేజ్ ను రేట్ చేయవచ్చు. ప్రస్తుతానికి వాట్సాప్ బిజినెస్ అకౌంటులకు నేరుగా అభిప్రాయాన్ని అందించే ఎంపిక లేదు.

 

వాట్సాప్ బిజినెస్ అకౌంటులకు కొత్త ఫీచర్

వాట్సాప్ బిజినెస్ అకౌంటులకు కొత్త ఫీచర్

వాట్సాప్ ట్రాకర్ సైట్ WABetaInfo యొక్క నివేదిక ప్రకారం తాజా ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.21.22.7 కొత్త మెసేజ్ రేటింగ్ ఫీచర్‌ను కలిగి ఉన్నట్లు గుర్తించబడింది. ఇది బీటా వినియోగదారుల కోసం ప్రారంభించబడింది. ఈ యాప్‌లో ఇప్పటికే ఉన్న బీటా వినియోగదారులు ఈ కొత్త ఫీచర్ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికే అనేక మంది వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ యూజర్లు ఈ ఫీచర్‌ను పొందుతున్నారు. ఇప్పుడు iOS కోసం WhatsApp బీటా యొక్క కొంతమంది వినియోగదారులు కూడా ఈ సామర్థ్యాన్ని పొందుతున్నారని నివేదించబడింది.

మెసేజ్ రేటింగ్

వాట్సాప్ బిజినెస్ అకౌంటులకు మెసేజ్ రేటింగ్ బాగా పని చేస్తుందని ట్రాకర్ సైట్ పేర్కొంది. మీరు బిజినెస్ అకౌంటుల నుండి మెసేజ్లను స్వీకరించినప్పుడు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. మీరు మెసేజ్ ను రేట్ చేసినప్పుడు వాట్సాప్ దాని అభిప్రాయాన్ని అనామకంగా చేయడానికి దానిని ఎవరు రేట్ చేశారో వంటివి సర్వీస్ చూడదు. ఈ ఫీచర్ యాప్ యొక్క ఎండ్-టు-ఎండ్ మెసేజ్ల ఎన్‌క్రిప్షన్‌ను విచ్ఛిన్నం చేయదు మరియు రేట్ చేయబడిన మెసేజ్లు వినియోగదారు దృష్టికి కనిపించవు.

WhatsApp
 

వాట్సాప్ బిజినెస్ అకౌంటుల నుండి పంపబడే మెసేజ్ల గురించి సాధారణ అభిప్రాయాన్ని చూడవచ్చు. అయితే ఈ మెసేజ్‌లను అసలు ఎవరు రేట్ చేశారో వారు చూడలేరు. రేటింగ్ అలర్ట్‌లో వ్యాపారాలు తమ కస్టమర్‌ల మెసేజింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడటానికి రేటింగ్‌లు ఎదురు చూస్తున్నాయని యాప్ పేర్కొంది. WhatsAppలో బిజినెస్ సంస్థలు పంపిన మెసేజ్ ను రేట్ చేయడానికి మీరు డైలాగ్ బాక్స్‌ను ఓపెన్ చేయడానికి మెసేజ్ ను నొక్కి పట్టుకోవాలి. గతంలో కొన్ని అనుచితమైన మెసేజ్లను స్పామ్‌గా గుర్తించడానికి ‘కాపీ'తో పాటుగా ‘రిపోర్ట్' ఎంపిక చూపబడుతుంది. ఇప్పుడు, బీటా వినియోగదారుల కోసం 'రేట్' ఎంపిక కూడా జోడించబడింది.

వాట్సాప్ చాట్ ట్రాన్స్ఫర్ ఫీచర్

వాట్సాప్ చాట్ ట్రాన్స్ఫర్ ఫీచర్

WABetaInfo విడుదల చేసిన నివేదిక తర్వాత ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో చూపించే స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేసింది. ఈ స్క్రీన్‌షాట్‌లను "Android కి చాట్‌లను తరలించు" అనే పేరుతో విడుదల చేసారు. ఈ ఎంపిక వాట్సాప్ యొక్క iOS యాప్ కి విడిగా జోడించబడుతుంది. ఫేస్బుక్ యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ iOS నుండి ఆండ్రాయిడ్ చాట్ బదిలీ ఫీచర్ గురించి ఇంకా ఏ వివరాలను వెల్లడించలేదు. ఈ ఫీచర్ అభివృద్ధిలో ఉన్నందున ఇది మొదట iOS బీటా వినియోగదారుల కోసం విడుదల అవుతుందని మరియు తరువాత ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఫీచర్ విడుదల యొక్క తేదీ ఇంకా తెలియదు, కాబట్టి అధికారిక వివరాలను పొందడం కోసం వేచి చూడాలి. తాజా నివేదిక iOS మరియు Android మధ్య చాట్ బదిలీ ఫీచర్ ను చూపిస్తుండగా మునుపటి నివేదికలు vis-à-vis వెల్లడించాయి. వాట్సాప్ ఆండ్రాయిడ్ నుండి iOS చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ని కూడా తీసుకువస్తుందని కొన్ని గత నివేదికలు హైలైట్ చేశాయి. ఈ ఫీచర్ లపై ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం ద్వారా ఇంకా ఖచ్చితమైన వివరాలు వెల్లడించలేదు.

వాట్సాప్ మల్టీ-డివైస్ మద్దతు

వాట్సాప్ మల్టీ-డివైస్ మద్దతు

వాట్సాప్ మరియు ఫేస్‌బుక్ హెడ్ ఇటీవల ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ వినియోగదారులకు మల్టీ-డివైస్ సపోర్ట్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ లక్షణం ప్రస్తుతం బీటా వినియోగదారులతో పరీక్షించబడుతోంది మరియు ప్రాధమిక ఫోన్ అవసరం లేకుండా ఏదైనా పరికరానికి లాగిన్ అవ్వడానికి అనుమతిస్తుంది. దీని పేరు సూచించినట్లుగా ఈ ఫీచర్ వినియోగదారులు తమ వాట్సాప్ ఖాతాను ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పరికరాల్లో ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఇది ప్రధానంగా ఇంటి నుండి పని చేస్తున్న మరియు వారి మొబైల్ ఫోన్‌లో వాట్సాప్‌ను అలాగే అదే సమయంలో ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్‌ను ఉపయోగించే వినియోగదారులకు సహాయపడుతుంది. ప్రస్తుతం, ప్లాట్‌ఫాం ఒకే సమయంలో ఒక మొబైల్ పరికరం మరియు ల్యాప్‌టాప్ / పిసి / టాబ్లెట్‌లో మాత్రమే ఖాతాను ఉపయోగించడానికి అనుమతిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
WhatsApp Business Account Brings Rate Messages New Feature: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X