వాట్సాప్‌ను నమ్మలేం.. ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు..!
వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది వినియోగదారులున్న ఇన్‌స్టంట్ చాటింగ్ యాప్. తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను అందించేందుకు నిరంతరం కృషిచేస్తోంది. మెసేజ్, కాలింగ్, వీడియో కాలింగ్ వంటి పనుల కోసం ఎక్కువగా వాట్సాప్‌నే వినియోగిస్తారు. ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్‌ను సొంతం చేసుకొని, అనేక మార్పులు చేస్తున్న ఎలాన్ మస్క్.. వాట్సాప్ గోప్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
గూగుల్ మాజీ ఇంజినీర్. ప్రస్తుతం ట్విట్టర్‌లో ఇంజినీరింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఫోడ్ డబిరి గత వారం వాట్సాప్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాను పిక్స్‌ల్ 7 ప్రో ఫోన్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పిన ఆయన.. తాను నిద్రపోతున్నప్పుడు వాట్సాప్ బ్యాక్‌గ్రౌండ్స్‌లో మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తోందని ఆరోపణలు చేశారు. ఆండ్రాయిడ్ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశారు. తాను నిద్రపోయిన, లేచి ఉన్న సమయాల్లో వాట్సాప్ సుమారు 9 సార్లు మైక్రో ఫోన్‌ను యాక్సెస్ చేసినట్లు ఆరోపించారు.

ట్విట్టర్ ఇంజినీర్ డబిరి చేసిన ట్వీట్‌పై ఎలాన్ మస్క్ రీ ట్వీట్ చేశారు. వాట్సాప్ నమ్మదగినది కాదంటూ సంచలన ఆరోపణలు చేశారు. మస్క్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతోపాటు ట్విట్టర్‌లో వాట్సాప్ తరహా ఫీచర్లను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. వినియోగదారులు ట్విట్టర్ ద్వారా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చని ఎలాన్ మస్క్ తెలిపారు.
వాట్సాప్ మెటా యాజమాన్యంలో ఉందని చాలామందికి తెలియకపోవడం ఆశ్చర్యకరమని ఓ ట్విట్టర్ వినియోగదారుడు కామెంట్ చేశారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు. వాట్సాప్ వ్యవస్థాపకులు మెటాను వీడినప్పుడు డిలీట్ ఫేస్‌బుక్ ప్రచారం చేశారని మరియు సిగ్నల్ యాప్ అభివృద్ధికి సహకరించారని చెప్పారు. వాట్సాప్ గోప్యతపై సోషల్‌మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో వాట్సాప్ స్పందించింది. ఎలాన్ మస్క్, కొంత మంది ట్వీట్టర్ వినియోగదారులు... ఫేస్‌బుక్/ మెటా యాజర్ల గోప్యతపై ఆరోపణలపై బదులిచ్చింది.
ఆండ్రాయిడ్ ప్రైవసీ డ్యాష్‌బోర్డ్‌లో బగ్ కారణంగా ఇలా జరిగి ఉండవచ్చని వాట్సాప్ వివరణ ఇచ్చింది. ఆరోపణలు చేసిన వినియోగదారుడి వద్ద గూగుల్ పిక్సల్ ఫోన్ ఉందని తెలిపింది. అందువల్ల ఈ అంశంపై పరిశోధన చేసి పరిష్కారం చూపాలని గూగుల్‌ను కోరినట్లు వాట్సాప్ తెలిపింది. వాట్సాప్ వినియోగదారులకు వారి మైక్రోఫోన్‌పై పూర్తి నియంత్రణ ఉంటుందని స్పష్టం చేసింది. వాయిస్ నోట్, వీడియో రికార్డ్ చేసిన సమయాల్లోనే మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయగలరని వాట్సాప్ వివరణ ఇచ్చింది.
వాట్సాప్ కొత్త ఫీచర్లు: వాట్సాప్ చాట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్లాట్‌ఫాంలోని ఫోల్స్ మరియు కాప్షన్ షేరింగ్ అనే రెండు కొత్త అప్‌డేట్‌లను ప్రకటించింది. వీటితో పాటు వాట్సాప్ చాట్, డేటా ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తున్నట్లు ఫీచర్ ట్రాకర్ తెలిపింది. ఇంది అందుబాటులోకి వస్తే ఎటువంటి థర్డ్‌పార్టీ యాప్‌ల వినియోగించకుండా వాట్సాప్ చాట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలిపింది.
ఈ ఫీచర్లతోపాటు ప్రస్తుతం వాట్సాప్‌ను డెస్క్‌టాప్, ల్యాప్‌ట్యాప్‌లో మాత్రమే లింక్ చేసేందుకు వీలుండగా.. ఇక నుంచి ఒకేసారి నాలుగు డివైస్‌ల నుంచి లింక్ చేసేందుకు అవకాశం ఉండనుంది. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








