100 కోట్ల ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్‌లతో చరిత్ర సృష్టించిన వాట్సాప్

Written By:

100 కోట్ల ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్‌లతో  చరిత్ర సృష్టించిన వాట్సాప్

ప్రముఖ మొబైల్ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ ను 100 కోట్ల మంది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకున్నట్లు ఆ సంస్థ సీఈఓ ఇంకా వ్యవస్థాపకులు జాక్ కౌమ్ ప్రకటించారు. ఈ 100 కోట్ల మంది యూజర్లను వాట్సాప్ ఆండ్రాయిడ్ విభాగంలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు మాత్రమే డీల్చే యటం విశేషం. 22 బిలియన్ డాలర్లకు ఫేస్ బుక్ తమ కంపెనీని సొంతం చేసుకున్నప్పటికి ఆదరణ ఏమాత్రం చెక్కుచెదరలేదని కౌమ్ తెలిపారు.

100 కోట్ల ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్‌లతో  చరిత్ర సృష్టించిన వాట్సాప్

ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకుంటున్న వారి సంఖ్య 700 మిలియన్లు

‘వాట్స్‌యాప్'ను ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకునే వారి సంఖ్య 2015 జనవరి నాటికి 70 కోట్లకు చేరకున్నట్లు ఆ సంస్థ ఇటీవల వెల్లడించింది. 2014, ఆగష్ట్ నాటికి వాట్స్‌యాప్ వినియోగదారుల సంఖ్య 60 కోట్లు ఉండగా 4 నెలల వ్యవధిలోనే 10 కోట్ల మంది అదనంగా చేరడం గొప్ప విషయమని వాట్స్‌యాప్సీ ఈఓ జాన్ కౌమ్ కొద్ది రోజుల క్రితం ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. వాట్స్‌యాప్ ద్వారా రోజుకు సగటున 3 వేల కోట్ల సందేశాలను షేర్ చేసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్స్ ఇంకా టాబ్లెట్ పీసీల ద్వారా సలువుగా మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలను షేర్ చేసుకునేందుకు వీలుకల్పిస్తున్న వాట్స్ యాప్ అనతికాలంలోనే విశేష ప్రాచుర్యాన్ని సంపాదించుకోవటం విశేషం.

100 కోట్ల ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్‌లతో  చరిత్ర సృష్టించిన వాట్సాప్

వాయిస్ కాలింగ్ రాకతో యూజర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం

వాట్సాప్ తాజాగా వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ నేపధ్యంలో ఈ ఇన్ స్టెంట్ మెసేజింగ్ యూప్ ను వినియోగించుకునే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

English summary
WhatsApp crosses 1 billion downloads on Android. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting