WhatsApp Dark Mode, ఇది చాలా కూల్ గురూ
Dark Mode ఈ మధ్య చాలా పాపులర్ అయిన ఫీచర్. ఇప్పటికే యూట్యూబ్, ట్విట్టర్, టెలిగ్రామ్ లాంటి ఇతర యాప్స్‌లో డార్క్ మోడ్ వచ్చేసింది. గూగుల్ కూడా ఆండ్రాయిడ్ 9 పైలో సిస్టమ్ వైడ్ డార్క్ మోడ్ రిలీజ్ చేసింది. వ
Dark Mode ఈ మధ్య చాలా పాపులర్ అయిన ఫీచర్. ఇప్పటికే యూట్యూబ్, ట్విట్టర్, టెలిగ్రామ్ లాంటి ఇతర యాప్స్‌లో డార్క్ మోడ్ వచ్చేసింది. గూగుల్ కూడా ఆండ్రాయిడ్ 9 పైలో సిస్టమ్ వైడ్ డార్క్ మోడ్ రిలీజ్ చేసింది. వినియోగదారులు చాలా బాగా ఈ ఫీచర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ ఫీచర్ వాట్సప్ లోకి ఇంకా రాలేదు. చాలా కాలం నుంచి వస్తోందంటూ వాట్సప్ ఊరిస్తూ వస్తుందే కాని అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.

అయితే ఇప్పుడు వాట్సప్ లో కూడా ఈ ఫీచర్ వస్తుందటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.

యూజర్లు చాలాకాలంగా డార్క్ మోడ్ కోసం..
కళ్లకు అలసట తగ్గించడం, పవర్ తక్కువగా వాడుకోవడం లాంటి ప్రయోజనాలు డార్క్ మోడ్‌తో ఉన్నాయి. అందుకే యూజర్లు చాలాకాలంగా డార్క్ మోడ్ కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇది గమనించింన వాట్సప్ కూడా కొంతకాలంగా డార్క్ మోడ్‌పై కసరత్తు జరుపుతోంది.

WABetaInfo
వాట్సప్‌కు సంబంధించిన తాజా సమాచారం ఎప్పటికప్పుడు అందించే WABetaInfo వాట్సప్‌లో డార్క్‌మోడ్‌కు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ ప్రకారం ప్రస్తుతం డార్క్‌మోడ్‌ను వాట్సప్ బీటా టెస్టర్స్ పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

సెట్టింగ్స్ పేజీలో మాత్రమే
WABetaInfo ట్వీట్ ప్రకారం చూస్తే సెట్టింగ్స్ పేజీలో మాత్రమే వాట్సప్ డార్క్ మోడ్ కనిపించింది. నోటిఫికేషన్ సెట్టింగ్స్, డేటా, స్టోరేజ్ సెట్టింగ్స్, ఛాట్స్ సెట్టింగ్స్, అకౌంట్ సెట్టింగ్స్‌లో డార్క్ మోడ్ మాత్రమే ఉంది.

అప్‌డేట్ చేసినా
ఒకవేళ మీకు బీటా యాప్ ఉన్నా, 2.19.82 వర్షన్ అప్‌డేట్ చేసినా డార్క్ మోడ్ ఫీచర్ కనిపించదు. ఇంకా డార్క్ మోడ్‌ను పరీక్షిస్తున్నారు కాబట్టి ఇది మీకు కనిపించదు. కనిపంచడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి యూజర్లు మరికొంత కాలం వేచి చూడక తప్పదు.


Click it and Unblock the Notifications








