Whatsapp పని చేయడం ఆగిపోయింది సరే.. మరి ప్రత్యామ్నాయం ఏంటి!

|

ప్రపంచంలోనే అత్యధిక యూజర్లు కలిగిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ Whatsapp మంగళవారం గంట సమయం పాటు స్తంభించిన విషయం తెలిసిందే. యాప్ ద్వారా సందేశాలను పంపడం లేదా స్వీకరించడం సాధ్యం కాకపోవడంతో భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోని వినియోగదారుల సమస్యను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికి సేవలు పునరుద్ధరించబడినప్పటికీ.. వినియోగదారులు మాత్రం మెసేజింగ్ యాప్‌కు ప్రత్యామ్నాయ పరిష్కారాల కోసం వెతకడానికి పరిస్థితులు దారి తీశాయి.

 
Whatsapp పని చేయడం ఆగిపోయింది సరే.. మరి ప్రత్యామ్నాయం ఏంటి!

అయితే, ఈక్రమంలో మేము వినియోగదారుల అవసరాన్ని ద్రుష్టిలో ఉంచుకుని WhatsApp కు ప్రత్యామ్నాయాలుగా పరిగణించగల మెసేజింగ్ యాప్ ల జాబితాను మీ కోసం అందిస్తున్నాం. మీరు కూడా దీనిపై ఓ లుక్కేయండి.

టెలిగ్రామ్;

టెలిగ్రామ్;

టెలిగ్రామ్ యాప్ ను వాట్సాప్ కు ప్రధాన ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఈ యాప్ 550 మిలియన్ల కంటే ఎక్కువ నెలవారీ క్రియాశీల వినియోగదారులతో WhatsApp కు ప్రత్యామ్నాయంగా ఉంది. WhatsApp మాదిరిగానే, ఈ ప్లాట్‌ఫారమ్ కూడా 200,000 మంది వ్యక్తులు లేదా ఛానెల్‌ల కోసం గ్రూపులను సృష్టించగల సామర్థ్యంతో పాటు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తుంది. యాప్ వెబ్ వెర్షన్‌ను కూడా కలిగి ఉంది మరియు 500 మిలియన్లకు పైగా క్రియాశీల వినియోగదారులతో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన ప్రపంచంలోని టాప్ 10 యాప్‌లలో ఒకటిగా ఉంది.

Viber;

Viber;

Viber అనేది కాల్‌లు, సందేశాలు మరియు షేర్ చేసుకోవడానికి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందించే ప్రైవేట్ మెసేజింగ్ సర్వీస్. నాన్-వైబర్ వినియోగదారులకు నామమాత్రపు ధరలకు అంతర్జాతీయ కాల్‌లు చేయడానికి కూడా ప్లాట్‌ఫారమ్ వినియోగదారులను అనుమతిస్తుంది. అందుబాటులో ఉన్న ఫీచర్‌లలో ఫైల్ షేరింగ్, వీడియో మరియు వాయిస్ కాల్‌లు, Google డిస్క్‌కి బ్యాకప్ మరియు మరిన్ని ఉన్నాయి.

త్రీమా;
 

త్రీమా;

త్రీమా అనేది ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫారమ్, ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ వాయిస్ మరియు వీడియో కాల్‌లను చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. 8-అంకెల IDని సృష్టించడానికి వినియోగదారులను అనుమతించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. ఇతర వినియోగదారులతో కనెక్ట్ కావడానికి వినియోగదారులు వారి స్వంత ఫోన్ నంబర్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. త్రీమాలోని చాట్‌లు పాస్‌వర్డ్-రక్షితం కావచ్చు.

సిగ్నల్;

సిగ్నల్;

సిగ్నల్ అనేది ఉచిత, ప్రైవసీ సెంట్రిక్ మెసేజ్ సర్వీసులను అందించే మరొక WhatsApp ప్రత్యామ్నాయం. యాప్ Apple iPhone మరియు Android పరికరాల కోసం అందుబాటులో ఉంది. దీన్ని డెస్క్‌టాప్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో పాటు డిసప్పియరింగ్ సందేశాలు, గ్రూప్ చాట్‌లు, వాయిస్ మరియు వీడియో కాల్‌లను చేయగల సామర్థ్యం వంటి లక్షణాలతో వస్తుంది.

డిస్కార్డ్;

డిస్కార్డ్;

వాట్సాప్‌కు మరొక ప్రసిద్ధ ప్రత్యామ్నాయంగా డిస్కార్డ్ యాప్ ను చెప్పవచ్చు. యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ఇతర వినియోగదారులకు సందేశాలు, GIFలు, చిత్రాలతో పాటు పత్రాలను పంపడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. యాప్ యొక్క వెబ్ వెర్షన్ ఉంది మరియు వాన్ విండోస్, లైనక్స్ మరియు మాక్ ఓఎస్ లను యాక్సెస్ చేయవచ్చు.

Element:

Element:

ఎలిమెంట్ (ఇంతకు ముందు రియోట్.ఇమ్ అని పిలుస్తారు) ఒక మెసెంజర్ మరియు వీడియో సహకార వేదిక. ఈ అనువర్తనం Android, iOS, macOS, Windows, Linux మరియు ప్రధాన బ్రౌజర్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో లక్ష ఇన్‌స్టాల్‌లను దాటింది. అనువర్తనం "సంభాషణలను మీ నియంత్రణలో ఉంచండి, డేటా-మైనింగ్ మరియు ప్రకటనల నుండి సురక్షితంగా ఉంచండి" అని పేర్కొంది మరియు స్నేహితులు, కుటుంబం, తోటివారు, సహచరులు మరియు సమూహాలు, సంఘాలు మరియు సంస్థలతో కూడా ఒకరితో ఒకరు చాట్ చేయడానికి ఉపయోగించవచ్చు.

నిన్న దేశవ్యాప్తంగా Whatsapp సేవలు సేవలు స్తంభించిన విషయం తెలిసిందే!

నిన్న దేశవ్యాప్తంగా Whatsapp సేవలు సేవలు స్తంభించిన విషయం తెలిసిందే!

మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొద్దిసేపు నిలిచిపోవడం యూజర్లు అవాక్కయ్యారు. టెక్స్ట్ సందేశాలను సెండ్ చేయడం, రిసీవ్ చేసుకోవడంలో అంతరాయం ఏర్పడింది. దీంతో వాట్సాప్ యూజర్లు కొంత సమయం సమస్యను ఎదుర్కొన్నారు. ఈ విషయంపై యూజర్లు ఆన్లైన్ లో రిపోర్టులు చేశారు. ప్రారంభంలో, యాప్‌లోని గ్రూప్ మెసేజ్‌లకు అంతరాయం ఏర్పడి, ఆపై వ్యక్తిగత సంభాషణలకు కూడా విస్తరించినట్లు రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. .

రాయిటర్స్ ప్రకారం, వాట్సాప్ కు చెందిన ఓ ప్రతినిధి దీనిపై ధ్రువీకరించారు. కొంతమందికి ప్రస్తుతం సందేశాలు పంపడంలో సమస్య ఉందని ఆయన ధృవీకరించారు మరియు వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరికీ వాట్సాప్‌ను పునరుద్ధరించడానికి వారు పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

యూజర్ల తిప్పలు;

యూజర్ల తిప్పలు;

యాప్ మెసేజ్‌లను డెలివరీ చేయడం లేదని, టిక్ మార్క్ కనిపించడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. యాప్‌తో పాటు, వాట్సాప్ వెబ్ కూడా ప్రభావంతో ప్రభావితమైనట్లు కనిపిస్తోంది. యాప్ యొక్క వెబ్ క్లయింట్ ఇప్పుడు కనెక్ట్ కావడం లేదు మరియు WhatsApp వెబ్‌కి కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులకు "మీ కంప్యూటర్‌లో యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందని నిర్ధారించుకోండి" అనే ఎర్రర్ మెసేజ్ వస్తున్నట్లు కనిపిస్తోంది. మెసేజ్‌లతో పాటు, వాట్సాప్‌లోని కాలింగ్ ఫీచర్‌లో కూడా సమస్యలు ఉన్నాయని కొంతమంది వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు.

ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో వాట్సాప్ డౌన్ హ్యాష్‌ట్యాగ్;

ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో వాట్సాప్ డౌన్ హ్యాష్‌ట్యాగ్;

వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడటంతో యూజర్లు ట్విటర్లో మీమ్స్ ప్రారంభించారు. వాట్సాప్ డౌన్ ( #whatsappdown )అనే హ్యాష్ ట్యాగ్ ట్విటర్ లో ట్రెండింగ్ లోకి వెళ్లింది. కాగా, ప్రస్తుతం వాట్సాప్ సేవలు కొద్ది సేపటికి తిరిగి పునరుద్దరించబడ్డాయి.

 

Best Mobiles in India

English summary
Whatsapp down happened, then what are the best alternatives for messaging app.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X