WhatsApp ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ బ్యాకప్‌ ఫీచర్ గురించి మీకు తెలియని విషయాలు

|

ప్రపంచం మొత్తం మీద త్వరిత మెసేజ్ యాప్ లలో అధిక మంది వాడుతున్న వాట్సాప్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్‌లలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసిన క్లౌడ్ బ్యాకప్‌లను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ఇటీవల ప్రకటించింది. ఇది WhatsApp బ్యాకప్‌లలో భాగంగా మీ చాట్‌లను క్లౌడ్ సర్వీసులో స్టోర్ చేసినప్పుడు కూడా ఎన్‌క్రిప్ట్ చేయడానికి సహాయపడుతుంది. గుర్తు చేసుకుంటే కనుక వాట్సాప్ 2016 నుండి తమ వినియోగదారులకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ ఫీచర్‌ని అందిస్తోంది. అయితే ఈ సరికొత్త ఫీచర్ అనేది కేవలం దాని యొక్క విస్తరణ మాత్రమే. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసిన బ్యాకప్ ఫీచర్ రాబోయే వారాల్లో Android మరియు iOS ఫోన్ లలో త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. ఇది ఐచ్ఛిక ఫీచర్‌గా అందుబాటులోకి వస్తుంది. వినియోగదారులు దీనిని యాప్ లోపల మాన్యువల్‌గా ఎనేబుల్ చేయవచ్చు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడిన బ్యాకప్ ఫీచర్ ఎలా పని చేస్తుందో మరియు అది అందుబాటులోకి వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా ఎనేబుల్ చేయవచ్చో వంటివి తెలుసుకోవడానికి కింద తెలిపిన మార్గాలను అనుసరించండి.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ బ్యాకప్‌లు ఎలా పని చేస్తాయి?

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ బ్యాకప్‌లు ఎలా పని చేస్తాయి?

ఫేస్‌బుక్ బ్లాగ్ పోస్ట్‌లో ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ కోసం ఎన్‌క్రిప్షన్ కీ స్టోరేజ్ కోసం కొత్త సిస్టమ్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. వినియోగదారులు ఈ ఫీచర్‌ను ఆన్ చేసిన తర్వాత వారి బ్యాకప్‌లు ప్రత్యేకమైన, యాదృచ్ఛికంగా సృష్టించబడిన ఎన్‌క్రిప్షన్ కీతో గుప్తీకరించబడతాయి. వారు కీని మాన్యువల్‌గా లేదా యూజర్ పాస్‌వర్డ్‌తో భద్రపరచడాన్ని కూడా ఎంచుకోవచ్చు. వినియోగదారుడు పాస్‌వర్డ్‌ని ఎంచుకోవాలనుకుంటే కనుక హార్డ్‌వేర్ సెక్యూరిటీ మాడ్యూల్ (HSM) అనే భాగం ఆధారంగా నిర్మించిన బ్యాకప్ కీ వాల్ట్‌లో కీ స్టోర్ చేయబడుతుంది.

బ్యాకప్
 

వాట్సాప్ అకౌంట్ యజమానికి వారి బ్యాకప్ యాక్సెస్ అవసరమైనప్పుడు వారు దానిని వారి ఎన్‌క్రిప్షన్ కీతో యాక్సెస్ చేయవచ్చు లేదా బ్యాకప్ కీ వాల్ట్ నుండి వారి ఎన్‌క్రిప్షన్ కీని తిరిగి పొందడానికి మరియు వారి బ్యాకప్‌ని డీక్రిప్ట్ చేయడానికి వారి వ్యక్తిగత పాస్‌వర్డ్‌ని ఉపయోగించవచ్చు. HSM- ఆధారిత బ్యాకప్ కీ వాల్ట్ బ్రూట్-ఫోర్స్ ప్రయత్నాలను ఎదుర్కోవటానికి మరియు కీని యాక్సెస్ చేయడానికి పరిమిత సంఖ్యలో విజయవంతం కాని ప్రయత్నాల తర్వాత శాశ్వతంగా యాక్సెస్ చేయలేని రీడర్‌ని అందిస్తుంది. వాట్సాప్ కీ ఉనికిలో ఉందని మాత్రమే తెలుస్తుంది.

బ్యాకప్ కీ వాల్ట్‌లో WhatsApp ఎన్‌క్రిప్షన్ కీలను ఎలా స్టోర్ చేస్తుంది?

బ్యాకప్ కీ వాల్ట్‌లో WhatsApp ఎన్‌క్రిప్షన్ కీలను ఎలా స్టోర్ చేస్తుంది?

క్లయింట్ కనెక్షన్‌లు మరియు క్లయింట్-సర్వర్ అంతేంటీకేషన్ ను నిర్వహించడానికి WhatsApp తన ఫ్రంట్-ఎండ్ సర్వీస్ చాట్‌డిని ఉపయోగిస్తుంది. ఇది కీలను బ్యాకప్‌లకు మరియు దాని సర్వర్‌లకు పంపే ప్రోటోకాల్‌ను అమలు చేస్తుంది. ఈ సమయంలో వినియోగదారుల యొక్క స్మార్ట్‌ఫోన్ మరియు HSM- ఆధారిత బ్యాకప్ కీ వాల్ట్ ఎన్‌క్రిప్ట్ చేసిన మెసేజ్లను మార్పిడి చేస్తుంది. క్లయింట్ ఫోన్ మరియు దాని సర్వర్‌ల మధ్య మార్పిడి చేయబడుతున్న ఈ మెసేజ్లు చాట్‌డీకి అందుబాటులో ఉండవని కంపెనీ పేర్కొంది. ఎన్‌క్రిప్షన్ కీలను సరిగ్గా నిర్వహించడానికి మరియు అవి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవడానికి HSM- ఆధారిత బ్యాకప్ కీ వాల్ట్ సర్వీస్ భౌగోళికంగా అనేక డేటా సెంటర్లలో పంపిణీ చేయబడుతుంది. డేటా సెంటర్ నిలిపివేసిన సందర్భంలో బ్యాకప్ కీలను కొనసాగించడంలో మరియు రన్ చేయడంలో ఇది సహాయపడుతుంది.

HSM- ఆధారిత బ్యాకప్ కీ వాల్ట్ మరియు ఎన్క్రిప్షన్ మరియు డిక్రిప్షన్ చేసే విధానం

HSM- ఆధారిత బ్యాకప్ కీ వాల్ట్ మరియు ఎన్క్రిప్షన్ మరియు డిక్రిప్షన్ చేసే విధానం

వాట్సాప్ వినియోగదారులు తమ వ్యక్తిగత పాస్‌వర్డ్‌తో వారి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసిన బ్యాకప్‌ని కాపాడాలని ఎంచుకున్న తర్వాత వారి కీ HSM- ఆధారిత బ్యాకప్ కీ వాల్ట్‌కు స్టోర్ చేయడానికి మరియు భద్రపరచడానికి పంపబడుతుంది.

కీని తిరిగి పొందడానికి వినియోగదారుడు అనుసరించవలసిన దశలు

*** బ్యాకప్ కీ వాల్ట్ ద్వారా ధృవీకరించబడే పాస్‌వర్డ్‌ని నమోదు చేయండి.

*** బ్యాకప్ కీ వాల్ట్ ఎన్‌క్రిప్షన్ కీని తిరిగి యూజర్ స్మార్ట్‌ఫోన్‌కు పంపుతుంది.

*** ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి యూజర్ వారి ఎండ్-టు-ఎండ్ గుప్తీకరించిన బ్యాకప్‌లను డీక్రిప్ట్ చేయవచ్చు.

 

Best Mobiles in India

English summary
WhatsApp End-to-End Encrypted Backups New Update Feature Rolls Out Very Soon For Android and iOS

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X