ఫేస్‌బుక్, వాట్సాప్‌‌లలో గ్రూప్ అడ్మిన్‌గా ఉన్నారా..?

ఫేస్‌బుక్, వాట్సాప్ అకౌంట్‌లలో గ్రూప్ అడ్మిన్‌గా వ్యవహరించేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. ఏదైనా రూమర్ లేదా ఫేక్ న్యూస్ మీ గ్రూప్ ద్వారా షేర్ కాబడినట్లయితే అందుకు గ్రూప్ అడ్మిన్‌గా మీరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Read More : రూ.333తో రోజుకు 3జీబి డేటా, 90 రోజులు మీ ఇష్టం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నచ్చిన విధంగా ఓ గ్రూపును క్రియేట్ చేసుకుని..

మనకు నచ్చిన విధంగా ఓ గ్రూపును క్రియేట్ చేసుకుని, అందులో మనకు కావల్సిన వ్యక్తులను చేర్చుకుని వీడియోలు, ఫోటోలతో పాటు రకరకాల మెసేజ్‌లను షేర్ చేసుకునే అవకాశాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కల్పిస్తోన్న విషయం తెలిసిందే.

అసత్య ప్రచారాలు పెరిగిపోతున్నాయ్..

అయితే, ఇటువంటి గ్రూప్‌లను ఆధారంగా చేసుకుని కొందరు అసత్య ప్రచారాలకు తెరలేపుతోన్న విషయం తెలిసిందే. వీరు వ్యాప్తి చేస్తున్న ఫేక్ న్యూస్ అలానే అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు మనుషుల మధ్య మత విభేదాలకు కారణమవుతున్నాయి.

జాయింట్ ఆర్డర్..జైలు తప్పదు

ఇటువంటి భయానక పరిస్థితుల నేపథ్యంలో వారణాసిలోని జిల్లా మేజిస్ట్రేట్ యోగేశ్వర్ రామ్ మిశ్రా, పోలీసు సూపరింటెండెంట్ నితిన్ తివారీలు ఓ జాయింట్ ఆర్డర్‌ను ఇష్యూ చేసారు. ఈ ఆర్డర్ ప్రకారం ఏదైనా సోషల్ మీడియా గ్రూప్ ద్వారా ఏదైనా సమాజాన్ని తప్పుదోవ పట్టించే సమచారం గనుక సర్క్యులేట్ అయినట్లయితే, అందుకు చర్యగా సంబంధిత గ్రూప్ అడ్మిన్ పై FIR నమోదు చేయబడుతుంది.

ఈ ఉత్తర్వు సరైన గుణపాఠం...

‌షల్ మీడియాలో న్యూస్ పేరుతో చాలా వరకు గ్రూప్ప్ ఏర్పడ్డాయి, వీటిలో కొన్ని మాత్రం సమాజాన్ని తప్పుదోవ పట్టించే రీతిలో నిత్యం నిరాధారమైన వార్తలను షేర్ చేస్తూనే ఉన్నాయి. ఇటువంటి గ్రూపులకు ఈ ఉత్తర్వ సరైన గుణపాఠం కానుంది. భారత్ లో దాదాపు 200 మిలియన్ల వాట్సాప్ యూజర్లు ఉన్నారు.

USB Type-C గురించి 5 ఆసక్తికర విషయాలు

ఇంటర్నెట్ కంటూ కొన్ని పరిధులు ఉన్నాయి...

ఇంటర్నెట్ ఓ అద్బుతమైన కమ్యూనికేషన్ సాధనం. అంతర్జాలంలో ఎటువంటి సమాచారాన్ని అయినా పొందవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా కావాల్సినంత విజ్ఞానంతో పాటు కాలక్షేపాన్ని కూడా పొందవచ్చు. అయితే, ఇంటర్నెట్ కంటూ కొన్ని పరిధులు ఉన్నాయి. వీటిని ఉల్లంఘించకూడుదు. ఇంటర్నెట్ స్వేచ్చకు సంబంధించిన నిబంధనలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి.

బలయ్యేది మాత్రం మీరే..

మీకు ఓపెన్ వై-ఫై ఉందా అయితే, వెంటనే దానికి పాస్ వర్డ్ ప్రొటెక్షన్‌ను సెట్ చేసుకోండి. ఎందుకంటే, మీ ఓపెన్ వై-ఫైను ఇతరలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చు. నేరం వేరొకరు చేసినప్పటికి బలయ్యేది మాత్రం మీరే.

జియో సంచలనం.. రూ.309కే 448జీబి డేటా, 8 నెలలు వాడుకోవచ్చు

సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసినందుకు..

అమెరికాకు చెందిన డేవిడ్ అనే వ్యక్తిని యాహూ అకౌంట్ హ్యాకింగ్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో డేవిడ్ ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీ చాలా కీలకంగా వ్యవహరించింది. అయితే, అతను అప్పటికే తన సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయటంతో శిక్ష మరింత పెరిగింది. భారత్‌లోనూ ఇటువంటి చట్టమే తీసుకురావాలని చూసినప్పటికి అది సాధ్యపడలేదు.

సోషల్ మీడియాలో అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదు

ఆన్‌లైన్‌లో ఉన్నప్పడు మీరేం పోస్టు చేస్తున్నారనేది ముందు గమనించుకోండి. అది పోస్టు చేయడానికి తగినదేనా కాదా అన్నదీ నిర్ధారించుకోండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదు. సరదాకో, తమషాకో మీరు చేసే వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నేరేపొచ్చు.

6జీబి ర్యామ్‌తో Mi 6, ఇండియాలో లాంచ్ ఎప్పుడు..?

స్కైప్‌ వాడినందుకు..

ఇతోపియాలో వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సర్వీసుల పై నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా స్కైప్‌ వంటి సర్వీసులను ఉపయోగించుంటున్నట్లయితే నేరుగా జైలులోనే ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది.

టొరెంట్స్ ద్వారా ఫైల్స్ షేరింగ్..

టొరెంట్స్ ద్వారా ఫైల్స్ షేర్ చేయటమనేది చాలా దేశాల్లో చట్ట వ్యతిరేక చర్యగా పరిగణిస్తారు. ఫైల్ షేరింగ్ అంటే కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లే. సినిమా, మ్యూజిక్ ఇంకా ఫైల్స్‌ను యజమాని పర్మిషన్ లేకుండా షేర్ చేయటమనేది చట్ట వ్యతిరేక చర్యగా పరిగణిస్తారు.

రూ.3,999కే 16జీబి స్టోరేజ్ ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp, Facebook Group Admins beware: Offensive Post can land you in Jail. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot