వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌గ్రామ్ డౌన్, ట్విట్టర్ ద్వారా నిరసన గళం

సోషల్ మీడియా దిగ్గజాలైన వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌గ్రామ్ లు ప్రపంచ వ్యాప్తంగా డౌన్ అయ్యాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4గంటలనుంచి ఫేస్ బుక్ డెస్క్ టాప్ వెర్షన్ లో సమస్యలు తలెత్తాయి. రీఫ్రెష్ కాక

|

సోషల్ మీడియా దిగ్గజాలైన వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌గ్రామ్ లు ప్రపంచ వ్యాప్తంగా డౌన్ అయ్యాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4గంటలనుంచి ఫేస్ బుక్ డెస్క్ టాప్ వెర్షన్ లో సమస్యలు తలెత్తాయి. రీఫ్రెష్ కాకపోవటం, ఒక్కసారిగా ఆగిపోవటం, వీడియో లోడు అవటానికి చాలా సమయం తీసుకోవటం వంటి సమస్యలను వినియోగదారులు ఎదుర్కున్నారు.

వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌గ్రామ్ డౌన్, ట్విట్టర్ ద్వారా నిరసన గళం

దీంతో సోషల్‌ మీడియా యూజర్లు ఒక్కసారిగా నిరసన గళం విప్పారు. #facebookdown ట్యాగ్‌తో ఫేస్‌బుక్‌పై ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎమోజీలతో విమర్శల వర్షం కురిపించారు.

ప్రపంచ వ్యాప్తంగా..

ప్రపంచ వ్యాప్తంగా..

ఫేస్‌బుక్‌తోపాటు దాని ఆధీనంలోని ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌లు ప్రపంచ వ్యాప్తంగా సరిగా పనిచేయలేదు. ట్రాఫిక్‌ మానిటరింగ్‌ వెబ్‌సైట్‌ డౌన్‌ డిటెక్టర్‌ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఉత్తర అమెరికా, యూరప్‌, ఆసియా, ఆఫ్రికాలలో ఈ సమస్య తలెత్తినట్టు సదురు వెబ్‌సైటు పేర్కొంది.

రెండున్నర గంటల తరువాత..

రెండున్నర గంటల తరువాత..

దీంతో నెటిజన్లు ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో తలెత్తిన సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి ట్విటర్‌ను ఆశ్రయించారు. అయితే రెండున్నర గంటల తరువాత ఈ సమస్య పరిష్కారం అయిందని సమాచారం.

పేజ్‌ లోడింగ్‌ సమస్యలు

పేజ్‌ లోడింగ్‌ సమస్యలు

భారత్‌లో డెస్క్‌టాప్‌ వర్షన్‌లలో ఈ సమస్య కనిపించింది. వినియోగదారులకు లాగిన్‌తోపాటు, పేజ్‌ లోడింగ్‌ సమస్యలు తలెత్తాయి. చాలా మంది భారత యూజర్లు దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్‌లో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు మాములుగానే పనిచేస్తున్నాయి.

నెల రోజుల క్రితం

నెల రోజుల క్రితం

సరిగ్గా నెల రోజుల క్రితం అంటే మార్చి 13, 2019 న కూడా ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు. మళ్లీ తిరిగి పనిచేశాయి. ఆదివారం ఏప్రిల్ 14నాడు కూడా ఇలాంటి సమస్యే తలెత్తటంతో సోషల్ మీడియాకు అలవాటు పడిన ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు.

వాట్సప్ లోనూ..

వాట్సప్ లోనూ మెసెజ్ లు చేరకపోవటంతో వినియోగాదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఫేస్ బుక్ మెసెంజర్ దాదాపు 2 గంటల పాటు పని చేయలేదు. సమస్యను గుర్తించిన పేస్ బుక్ యాజమాన్యం సమస్యను సరిదిద్దటంతో ప్రస్తుతం ఇవన్నీ సరిగా పనిచేస్తున్నాయి. కానీ దాదాపు 9వేల మంది తమ సమస్యను ట్విట్టర్ ద్వారా చెప్పుకున్నారు.

 

డిటెక్టర్ అనే వెబ్‌సైట్ పరిశీలనలో...

డిటెక్టర్ అనే వెబ్‌సైట్ పరిశీలనలో...

డిటెక్టర్ అనే వెబ్‌సైట్ పరిశీలనలో భారత్‌లో ఫేస్‌బుక్ ఉదయం 6.28 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నెమ్మదించిందని గుర్తించినట్టు హిందుస్తాన్ టైమ్స్ తెలిపింది. ఒక్క ఇండియాలోనే కాదు అమెరికా, మలేసియా, టర్కీ లాంటి దేశాల్లో కూడా ఫేస్‌బుక్ డౌన్ అయినట్టు ఆ లైవ్ ట్రాకింగ్ సిస్టమ్‌ గుర్తించింది. ది వెర్జ్ కూడా ఇదే కథనాన్ని ప్రచురించింది.

Best Mobiles in India

English summary
WhatsApp, Facebook, Instagram down for some users across world

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X