వాట్సప్‌లో సొంతంగా స్టిక్కర్స్ తయారుచేయడం ఎలా ? సింపుల్ ప్రాసెస్

By Gizbot Bureau
|

ప్రముఖ ఫేస్ బుక్ సొంత మెసేంజింగ్ యాప్ వాట్సప్ రోజు రోజుకు కొత్త కొత్త ఫీచర్లతో దూసుకుపోతోంది. యూజర్లను ఆకట్టుకునేందుకు వారి అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్స్ ను అందిస్తూ వారి అభిమానాన్ని చూరగొంటోంది. ఇందులో భాగంగానే ఈ మధ్య కొన్ని కొత్త ఫీచర్లను రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

వాట్సప్‌లో సొంతంగా స్టిక్కర్స్ తయారుచేయడం ఎలా ? సింపుల్ ప్రాసెస్

ఇప్పుడు మళ్లీ ఇంకో ఫీచర్ తో యూజర్లను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగానే వాట్సప్ లో అప్ డేటెడ్ స్టిక్కర్లతో పాటు కొత్తగా బ్రాండ్ న్యూ స్టిక్కర్ ప్యాక్ ను ప్రవేశపెట్టింది. కొత్త స్టిక్కర్ ప్యాక్ ను 'Opi’ పేరుతో వాట్సప్ రిలీజ్ చేసింది.

కొత్త స్టిక్కర్ ప్యాక్

కొత్త స్టిక్కర్ ప్యాక్

వాట్సప్ రిలీజ్ చేసిన ఈ కొత్త స్టిక్కర్ ప్యాక్ ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ వాడే యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాటుగా మీరు డౌన్ లోడ్ చేసుకున్న కొత్త స్టిక్కర్ ప్యాక్.. మీకు నచ్చకుంటే.. అక్కడే డిలీట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే చాలు. లేదంటే.. ప్రత్యేకించి స్టిక్కర్ ప్లాక్ కావాలనుకుంటే యాప్ లో All Stickers ఆప్షన్ పై ట్యాప్ చేయండి. వాట్సప్ అందించే స్టిక్కర్ ప్యాక్స్ కాకుండా.. మీ వాట్సప్ అకౌంట్లో మీరే కొత్త స్టిక్కర్ ప్యాక్స్ క్రియేట్ చేసుకోవచ్చు.

థర్డ్ పార్టీ యాప్

థర్డ్ పార్టీ యాప్

ఇందుకోసం మీరు థర్డ్ పార్టీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ‘స్టిక్కర్ మేకర్ ఫర్ వాట్సాప్ ' యాప్ ను గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ ఆప్ స్టోర్ నుంచి కస్టమైజడ్ స్టిక్కర్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వీటి ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తమ వాట్సప్ అకౌంట్లో సొంత స్టిక్కర్ ను తయారుచేసుకోవచ్చు. ప్రాసెస్ ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం.

స్టిక్కర్ డౌన్లోడ్
 

స్టిక్కర్ డౌన్లోడ్

మీ ఫోన్ లో వాట్సప్ అకౌంట్ ఓపెన్ చేయండి. మీ వ్యక్తిగత అకౌంట్ లేదా గ్రూపు చాట్ విండోను ఓపెన్ చేయండి. లెఫ్ట్ కార్నర్ దగ్గర స్టిక్కర్స్ ఆప్షన్ పై ట్యాప్ చేయండి. ఇక్కడ మీకో మెనూ కనిపిస్తుంది.. GIF, Stickers అని ఉంటుంది. అక్కడ కనిపించే ట్యాప్ ఆన్ స్టిక్కర్ ఐకాన్ సెలక్ట్ చేసుకోండి. అక్కడ కనిపించే మెనూ రైట్ కార్నర్ పై ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ అన్ని రకాల స్టిక్కర్లు కనిపిస్తాయి. టాప్ లో కొత్త Opi స్టిక్కర్ ప్యాక్ చూడవచ్చు. అక్కడ కనిపించే ట్యాప్ అండ్ డౌన్ లోడ్ ఐకాన్ పై క్లిక్ చేయండి.

సొంత స్టిక్కర్ క్రియేట్ చేయాలంటే..

సొంత స్టిక్కర్ క్రియేట్ చేయాలంటే..

స్టిక్కర్ మేకర్ యాప్ ఓపెన్ చేయండి. క్రియేట్ న్యూ స్టిక్కర్ ప్యాక్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. యాడ్ స్టిక్కర్ ఆప్షన్ పై క్లిక్ చేసి.. క్రియేట్ న్యూ స్టిక్కర్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. అవసరమైన Imageను సెలక్ట్ చేసుకోండి.. స్టిక్కర్ గా కన్వర్ట్ చేసుకోండి. ఫోన్ గ్యాలరీ లేదా గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోలతో కూడా స్టిక్కర్ క్రియేట్ చేసుకోవచ్చు. సెలక్ట్ చేసిన Imageను Crop చేసుకోండి. స్టిక్కర్ ప్యాక్ పబ్లీష్ చేయండి.. వాట్సప్ అకౌంట్లో ఇతర స్టిక్కర్లతో పాటు క్రియేట్ చేసిన స్టిక్కర్లు కూడా ఆటోమాటిక్ గా కనిపిస్తాయి.

Best Mobiles in India

English summary
WhatsApp gets a new sticker pack, here’s how you can download it

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X