వాట్సప్ అలర్ట్ : రెచ్చగొట్టే వీడియోలు పోస్టు చేస్తే జైలుకే

By Gizbot Bureau
|

ఏదైనా వాట్సప్ గ్రూప్‌కు మీరు అడ్మిన్‌గా ఉన్నట్లయితే ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రూప్‌లో మీరే కాకుండా, సభ్యులెవరైనా సరే పోస్ట్ చేసే వివాదాస్పద పోస్టు వల్ల మీరు జైలు పాలు అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా హింసకు సంబంధించిన వీడియోలు, వార్తలు, ఫొటోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు.

 
WhatsApp group admins warned against fake videos

ఇందులో భాగంగానే వాట్సప్, ఫేస్‌బుక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న హింసాత్మక వీడియోలపై హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ స్పందించారు. వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు హెచ్చరికలు జారీ చేశారు. వాట్సప్ గ్రూపులో హింసకు సంబంధించిన వీడియోలను పెడితే ఆ గ్రూపు అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 శాంతిభద్రతల పరిస్థితికి భంగం వాటిల్లే అవకాశం

శాంతిభద్రతల పరిస్థితికి భంగం వాటిల్లే అవకాశం

ఇతర దేశాల్లో జరిగిన హింసకు సంబంధించిన వీడియోలను కొందరు వాట్సప్ గ్రూపులో పెడుతున్నారని, దీనివల్ల నగరంలో శాంతిభద్రతల పరిస్థితికి భంగం వాటిల్లే అవకాశముందని ఆయన అన్నారు. వివిధ గ్రూపులో హింసకు సంబంధించిన వీడియోలను, ఫేక్ వీడియోలను పోస్ట్ చేస్తే, అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అంజనీ కుమార్ హెచ్చరించారు. వాట్సప్ వీడియోలు, మెసేజ్‌లపై పోలీసులు నిఘా పెట్టారని వివరించారు.

రెచ్చగొట్టే వీడియోలు పోస్టు చేస్తే

రెచ్చగొట్టే వీడియోలు పోస్టు చేస్తే

ఎన్నో అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు నిలయంగా ఉన్న హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన ఆయన.. వాట్సప్ వీడియోలు, సందేశాలపై పోలీసు శాఖ నిఘా వేసిందని స్పష్టం చేశారు. రెచ్చగొట్టే వీడియోలు పోస్టు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

 కొత్తగా ప్రైవసీ సెట్టింగ్‌
 

కొత్తగా ప్రైవసీ సెట్టింగ్‌

ఇదిలా ఉంటే మనకు తెలియకుండానే గ్రూపుల్లో యాడ్ చేసే వారి ఆట్టకట్టించేందుకు వాట్సప్ సిద్ధమైంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఓ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. మన ప్రమేయం లేకుండా ఎవరో క్రియేట్ చేసిన గ్రూప్‌లో చేరిపోతుంటాం. ఇది కొందరికి విసుగ్గా ఉంటోంది. మనకు ఇష్టం లేకున్నా గ్రూప్‌లో చేరుస్తుండటం. మనం లెఫ్ట్ అవుతుండటం.. జరుగుతోంది. దీన్నుంచి స్వాంతన చేకూర్చేందుకు కొత్తగా ప్రైవసీ సెట్టింగ్‌ మార్చుకోవచ్చు. మనం అనుమతి ఇస్తేనే గ్రూప్‌లో చేరేలా కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది.

వాట్సప్ గ్రూపుల్లో చేర్చవద్దు అనే ఆప్షన్

వాట్సప్ గ్రూపుల్లో చేర్చవద్దు అనే ఆప్షన్

ఆహ్వానం వచ్చిన 72 గంటల్లో దాన్ని ఓకే చేయాలి. లేకపోతే గ్రూప్‌లో చేరే అవకాశం ఉండదు. అలాగే నంబరును వాట్సప్ గ్రూపుల్లో చేర్చవద్దు అనే ఆప్షన్ కూడా ఉంది. వేలిముద్ర సహాయంతో వాట్సప్‌ను అన్‌లాక్ చేసుకునే సదుపాయాన్ని వాట్సప్ కల్పించింది. స్పామ్ మెసేజ్‌లను గుర్తించేందుకు ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్ ఫీచర్‌ను కూడా ప్రారంభించింది. ఒకేసారి అనేక వాయిస్ మెసేజ్‌లను వరుసగా వినే అవకాశాన్ని కూడా వాట్సప్ అందుబాటులోకి తెస్తోంది.

Best Mobiles in India

English summary
Hyderabad Police Commissioner: WhatsApp group admins warned against fake videos

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X