87 వేల వాట్సప్ గ్రూపులు ఎన్నికల కోసం పనిచేస్తున్నాయి

లోక్‌సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని సోషల్ మీడియాలో ముమ్మరం చేశాయి. తమ ప్రచారం కోసం టెక్నాలజీని మరింతగా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడ

|

లోక్‌సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని సోషల్ మీడియాలో ముమ్మరం చేశాయి. తమ ప్రచారం కోసం టెక్నాలజీని మరింతగా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జోరుగా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ తో పాటు వాట్సప్‌లలో ఓటర్లకు రాజకీయ సందేశాలు పంపుతున్నారు.

87 వేల వాట్సప్ గ్రూపులు ఎన్నికల కోసం పనిచేస్తున్నాయి

మరో పదిహేను రోజుల్లో మొదటి దశ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు 87 వేలకు పైగా వాట్సాప్‌ గ్రూపులు పని చేస్తున్నాయట. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల నిపుణుడు అనూప్‌ మిశ్రా తెలిపారు.

87 వేల గ్రూపులు

87 వేల గ్రూపులు

87 వేల గ్రూపులు కలిసి దాదాపు 2 కోట్ల 20 లక్షల మందికి పైగా యూజర్లకు నేరుగా సమాచారాన్ని అందిస్తాయని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఫేస్‌బుక్‌ను‌ వారధిగా చేసుకున్న పొలిటికల్ లీడర్లు ఇపుడు ఆన్ లైన్ ప్రచారం కోసం వాట్సప్‌‌ను ఆశ్రయించారు.

  ఫేస్‌బుక్ ను వాట్సప్ అధిగమించింది

ఫేస్‌బుక్ ను వాట్సప్ అధిగమించింది

దీంతో సోషల్ మీడియా ప్రచారంలో ఇప్పటి వరకు ముందున్న ఫేస్‌బుక్ ను వాట్సప్ అధిగమించింది. 87 వేలకు పైగా పొలిటికల్ వాట్సప్ గ్రూపులు యాక్టివ్ గా పనిచేస్తున్నాయంటే దాని హవా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కొన్ని కోట్ల మందిని
 

కొన్ని కోట్ల మందిని

వాట్సప్‌లోని ఒక యూజర్‌ ఒక మెసేజ్‌ను గరిష్టంగా ఐదుగురికి పంపవచ్చు. ఆ ప్రకారం 2.2 కోట్ల మంది ఒక్కొక్కరు ఐదుగురికి మెసేజ్‌లు పంపడం ద్వారా కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేయగలరు. అది ఫేక్ న్యూస్ అయినా ఒరిజినల్ అయినా భారీ స్థాయిలో అది ట్రోల్ అవుతున్నట్లు దీని ప్రకారం తెలుస్తోంది.

వాట్సప్‌ తగిన జాగ్రత్తలు

వాట్సప్‌ తగిన జాగ్రత్తలు

ఇన్ని కోట్ల మంది ప్రజలకు అసలైన సమాచారం అందేందుకు వాట్సప్‌ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. తప్పుడు సమాచారాన్ని,కల్పిత వార్తలను అడ్డుకోవడానికి లక్ష మందికి శిక్షణ ఇచ్చి నియమించుకుంది.అంతేకాకుండా కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు నైతిక నియమావళిని పాటించేందుకు సమ్మతించింది.

43 కోట్ల మంది

43 కోట్ల మంది

భారత్ లో దాదాపు 43 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారన్నది ఒక అంచనా. ఈ నేపథ్యంలో దేశంలో 30 కోట్లకు పైగా వాట్సప్ యూజర్లు ఉండి ఉండే అవకాశం లేకపోలేదు. యూజర్లకు సంబంధించి వాట్సప్ అధికారిక గణాంకాలు వెల్లడించనందున ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

జియో రాకతో

జియో రాకతో

చిన్నారుల నుంచి ముసలివారి వరకు వాట్సప్‌ను వినియోగిస్తున్నందున తమ సందేశాలు చేరవేసేందుకు రాజకీయపార్టీలు ఈ గ్రూపులను ఆశ్రయిస్తున్నాయి.అదీగాక జియో రాకతో పెరిగిన వినియోగం జియో రంగ ప్రవేశంతో డేటా చార్జీలు చాలా వరకు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో చాలా మంది వాట్సప్ లో యాక్టివ్ గా ఉంటున్నారు

Best Mobiles in India

English summary
WhatsApp launches second campaign to fight fake news ahead of India’s elections

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X