Whatsapp యూజ‌ర్ల‌కు కీల‌క హెచ్చ‌రిక‌లు చేసిన ఆ కంపెనీ సీఈఓ!

|

ప్ర‌ముఖ మెసేజింగ్ యాప్ Whatsapp త‌మ యూజ‌ర్ల‌కు కీల‌క హెచ్చ‌రిక‌లు చేసింది. ఇంట‌ర్నెట్‌లో ఫేక్ వ‌ర్శ‌న్ మెసేజింగ్ అప్లికేష‌న్ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. త‌మ యాప్‌ మాదిరిగా ఉన్న మాడిఫైడ్|న‌కిలీ వ‌ర్శ‌న్ ను ఉప‌యోగించ‌డం ద్వారా స‌మ‌స్య‌ల్లో చిక్కుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు పేర్కొంది. ఈ మేర‌కు Whatsapp సీఈవో విల్ క్యాత్ కార్ట్ ట్విట‌ర్ వేదిక‌గా హెచ్చ‌రించారు.

 
Whatsapp యూజ‌ర్ల‌కు కీల‌క హెచ్చ‌రిక‌లు చేసిన ఆ కంపెనీ సీఈఓ!

ప్ర‌స్తుతం Whatsapp దాదాపు రెండు బిలియ‌న్ల యాక్టివ్ యూజ‌ర్ల‌ను క‌లిగి ఉంది. ఈ క్ర‌మంలో స్కామర్లు వాట్సాప్ యూజ‌ర్లు ల‌క్ష్యంగా చేసుకుని న‌కిలీ మాల్వేర్ యాప్‌ల‌ను విడుద‌ల చేస్తున్న‌ నేప‌థ్యంలో కంపెనీ ఈ హెచ్చ‌రిక చేయ‌డం గ‌మ‌నార్హం.

సీఈవో విల్ క్యాత్‌కార్ట్ ట్విట‌ర్‌లో ఈ విధంగా వెల్ల‌డించారు. " కంపెనీకి చెందిన సెక్యూరిటీ రీసెర్చ్ టీమ్ వాట్సాప్ తరహాలో సేవలను అందిస్తున్నట్లు చెప్పుకునే కొన్ని మాల్వేర్ల‌ను (Malwares) క‌లిగిన‌ ప్ర‌మాద‌క‌ర‌మైన‌ యాప్‌లను కనుగొంది. స‌ద‌రు న‌కిలీ అప్లికేష‌న్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా బ‌య‌ట క‌నిపిస్తాయి. "HeyMods" అనే డెవలపర్ నుండి "Hey WhatsApp" మరియు ఇతర పేర్ల‌తో ఈ ప్ర‌మాద‌క‌ర‌మైన యాప్ లు ఉన్నాయి. అలాంటి వాటి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి." అని విల్ త‌న ట్వీట్‌లో చెప్పాడు.

"ఈ న‌కిలీ మాల్వేర్ యాప్స్ యూజ‌ర్ల‌కు ప‌లు స‌రికొత్త ఫీచ‌ర్ల‌ను క‌ల్పించే విధంగా న‌మ్మ‌కం క‌ల్పిస్తాయి. అది న‌మ్మి యూజ‌ర్లు ఒక‌సారి వాటిని ఇన్‌స్టాల్ చేసుకుంటే.. ఇక వారి వ్య‌క్తిగ‌త డేటా స్కామ‌ర్ల చేతిలో ప్రమాదంలో ప‌డే అవ‌కాశం ఉంటుంది. అలాంటి ప‌లు ప్ర‌మాద‌క‌ర‌మైన అప్లికేష‌న్ల‌ను మేం క‌నుగొన్నాం. వాటిని ఇప్ప‌టికే గూగుల్‌తో పంచుకున్నాం. ఈ విష‌య‌మై గూగుల్‌తో క‌లిసి ప‌నిచేస్తున్నాం" అని విల్ వెల్ల‌డించారు.

Whatsapp యూజ‌ర్ల‌కు కీల‌క హెచ్చ‌రిక‌లు చేసిన ఆ కంపెనీ సీఈఓ!

"Android లోని Google Play Protect అనే సాఫ్ట్‌వేర్.. ఇదువ‌ర‌కే మొబైల్స్‌లో డౌన్‌లోడ్ అయి ఉన్న న‌కిలీ మాల్వేర్ల‌ను గుర్తించి.. వాటిని అడ్డుకోగ‌ల‌దు. మ‌రోవైపు Android డివైజుల‌లో ప్ర‌మాద‌క‌ర‌ యాప్‌లు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి Google సంస్థ చేస్తున్న నిరంతర కృషికి మేము అభినందిస్తున్నాము" అని WhatsApp హెడ్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా, కొత్త MacOS వాట్సాప్ యాప్‌కు సంబంధించి క్యాటలిస్ట్ టెక్నాలజీతో బీటా వెర్షన్‌ను ప్రారంభించినట్లు ఒక నివేదిక తెలిపింది.

Whatsapp యూజ‌ర్ల‌కు కీల‌క హెచ్చ‌రిక‌లు చేసిన ఆ కంపెనీ సీఈఓ!

త్వ‌ర‌లో వాట్సాప్ రియాక్ష‌న్ ఫీచ‌ర్లో మ‌రిన్ని ఎమోజీలు:
మ‌రోవైపు, Whatsapp సంస్థ నిత్యం ఏదో కొత్త అప్‌డేట్‌తో త‌మ యూజ‌ర్లను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. మ‌రో కొత్త అప్‌డేట్‌ను వినియోగ‌దారుల‌కు ప‌రిచ‌యం చేస్తున్న‌ట్లు తెలిసింది. ఇటీవ‌ల త‌మ ప్లాట్‌ఫాంపై Message Reactions ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే, ఈ ఫీచ‌ర్ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు ఎమోజీలు మాత్ర‌మే యూజ‌ర్లకు మెసేజ్ రియాక్ష‌న్‌కు అందుబాటులో ఉన్నాయి. ఇక‌నుంచి Message Reactions లో భాగంగా మ‌రిన్ని ఎమోజీల‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. ఈ మేర‌కు మెటా వ్య‌వ‌స్థాప‌కులు మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ త‌న ఫేస్‌బుక్ పేజీలో చేసిన పోస్ట్ ద్వారా వెల్ల‌డైంది.

 

యూజ‌ర్లు త‌మ స్నేహితుడి నుంచి వ‌చ్చిన మెసేజ్‌ను ఎక్కువసేపు నొక్కడం ద్వారా రియాక్ష‌న్ ఫీచ‌ర్‌ను క‌నుగొన‌వ‌చ్చు. ఇందులో భాగంగా మునుపటి ఆరు ఎమోజీలతో పాటు "+" గుర్తుతో మెనూ ఓపెన్ అవుతుంది. (+) గుర్తును క్లిక్ చేయ‌డం ద్వారా స్మైలీ, ఎమోష‌న‌ల్ స‌హా ప‌లు కొత్త ఎమోజీలను కలిగి ఉన్న మెనూ ఓపెన్ అవుతుంది. Whatsapp లో ఈ మరిన్ని ఎమోజీలు రావడం గురించి మనం వినడం ఇదే మొదటిసారి కాదు. ఇదువ‌ర‌కే దీనికి సంబంధించి ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాకుండా ఇప్ప‌టికే ఇది ప‌లు డివైజ్‌ల‌లో అందుబాటులోకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇది మీ వాట్సాప్‌లో ఇంకా కనిపించకుంటే, రాబోయే కొద్ది రోజుల్లో ఇది అందుబాటులోకి వ‌స్తుంద‌ని స‌మాచారం.

Best Mobiles in India

English summary
WhatsApp Head Issues Warning To All Android Users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X