ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్.. సంవత్సరం పాటు ఉచితం?

వాట్సాప్ వేదికగా ఆకతాయులు రెచ్చిపోతున్నారు. ప్రస్తుత పరిస్ధితులకు అనుగుణంగా ఇష్టమొచ్చినట్లు రూమర్స్ ను వ్యాప్తి చేస్తూ జనాన్ని తికమక పెట్టేస్తున్నారు.

ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్.. సంవత్సరం పాటు ఉచితం?

Read More : రూ.4,440కే బ్రాండెడ్ 4జీ VoLTE ఫోన్, జియో సిమ్ ఉచితం

టెలికం మార్కెట్లో జియో హవా కొనసాగుతోన్న నేపథ్యంలో మోసపూరిత 4జీ అన్‌లిమిటెడ్ డేటా ఇంకా వాయిస్ కాల్ ఆఫర్స్‌ను సృష్టించి నెటిజనులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ స్పామ్ మెసేజ్‌లు ఎక్కువగా ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ యూజర్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇలా ఎర వేస్తున్నారు..

జియోతో పోటీ పడే క్రమంలో ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లు ఏడాది పాటు 4జీ డేటా ఇంకా కాల్స్‌ను ఉచితంగా అందిస్తున్నాయంటూ ఈ నకిలీ వాట్సాప్ మెసేజ్‌లు, వాట్సాప్ యూజర్లను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాయి.

ఆవేశపడి లింక్స్ పై క్లిక్ చేస్తే..

ఈ మెసేజెస్‌లోని లింక్స్ పై క్లిక్ చేయటమే కాకుంగా వేరికరకి ఫార్వర్డ్ చేయటం ద్వారా ఆఫర్ పొందవచ్చని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నాయి. ఆవేశపడి ఈ లింక్స్ పై క్లిక్ చేయటం ద్వారా యూజర్‌కు సంబంధించి, ఫోన్‌లోని డేటా మొత్తం పూర్తిగా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదముందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బీఎస్ఎన్ఎల్‌ను ఉద్దేశించి ..

బీఎస్ఎన్ఎల్‌ను ఉద్దేశించి వాట్సాప్‌లో హల్‌‌చల్ చేస్తున్న ఫేక్ మెసెజ్‌‌లో సమాచారం ఈ విధంగా ఉంది... ‘‘బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న 4G ExPress SIMను పొందటం ద్వారా మీరు 1 సంవత్సరం పాటు అన్‌లిమిటెడ్ డేటా ఇంకా కాల్స్ ఆస్వాదించగలుగుతారు. బీఎస్ఎన్ఎల్ 4G ExPress SIM ప్రత్యేకతలు : అన్‌లిమిటెడ్ 4జీ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ కాల్స్, అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్, 10 ఎంబీపీఎస్ వరకు 4జీ ఇంటర్నెట్ వేగం. ఇన్ని సౌకర్యాలతో వస్తోన్న బీఎస్ఎన్ఎల్ 4జీ ఎక్స్ ప్రెస్ సిమ్‌ను ఈ రోజే ఉచితంగా పొందండి. డిసెంబర్ 31, 2016 వరకు ఆఫర్ వర్తిస్తుంది. రిజిస్టర్ అయ్యేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.''అంటూ మెసెజ్‌లో రాసారు. పొరపాటున ఈ మోసపూరిత మెసేజ్‌ను నమ్మి ఆ లింక్ పై క్లిక్ చేయటం ద్వారా యూజర్లు, హ్యాకర్లు పనన్ని ఉచ్చులో చిక్కుకుంటున్నారు.

 

ఎయిర్‌టెల్‌ను ఉద్దేశించి..

ఎయిర్‌టెల్‌ను ఉద్దేశించి LOOT OFFER పేరుతో ఓ మేసేజ్ వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తోంది, ఈ మెసెజ్ సారాంశం ఈ విధంగా ఉంది. ‘‘జియో దెబ్బకు ఎయిర్‌టెల్ దిగొచ్చింది. యూజర్లను ఆకట్టుకునేందుకు 3జీ, 4జీ డేటాను మూడు నెలల పాటు ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఈ లింక్ పై క్లిక్ చేయటం ద్వారా ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తున్న 3జీ, 4జీ డేటా ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రతినెలా 300 నిమిషాల కాల్స్ కూడా మీకు యాడ్ అవుతుంటాయి. కాబట్టి, వెంటనే ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోండంటూ మెసెజ్‌లో రాసారు. పొరపాటున ఈ మోసపూరిత మెసేజ్‌ను నమ్మి ఆ లింక్ పై క్లిక్ చేయటం ద్వారా యూజర్లు, హ్యాకర్లు పనన్ని ఉచ్చులో చిక్కుకుంటున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి

ఉదయం లేచిన దగ్గర నుంచి ఇటువంటి మోసూపరిత మెసేజ్‌లు చాలానే వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. కాబట్టి, ఇటువంటి ఫేక్ మెసేజ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి.

లేటెస్ట్ ఆఫర్‌లను తెలుసుకోవాలనుకుంటే..?

ఒకవేళ మీకు, మీ నెట్‌వర్క్‌లకు సంబంధించి లేటెస్ట్ ఆఫర్‌లను తెలుసుకోవాలనీ అనుకుంటున్నట్లయితే నెట్‌వర్క్ ఆపరేటర్స్‌కు సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్స్‌లోకి లాగిన్ అయి ఆఫర్లకు సంబంధించిన వివరాలను తెలుసుకోండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp hoax alert! BSNL, Airtel not offering free unlimited data, calls. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot