WhatsApp, iPhone, Samsung లింక్ కొత్త ఫీచర్ గురించి మీకు తెలియని విషయాలు

|

ఐఫోన్ నుండి ఆండ్రాయిడ్ ఫోన్‌కి మారుతున్న వినియోగదారులు ఎదురుకుంటున్న ప్రాథమిక సమస్యల్లో వాట్సాప్ డేటా బదిలీ ఒకటి. ముందు నుంచి వాడుతున్న ఫోన్‌లో మీ మనసుకు బాగా దగ్గరైన వారి యొక్క అన్ని చాట్‌లు, నక్షత్రంతో సేవ్ చేయబడిన మెసేజ్లు, వీడియోలు, స్టేటస్ అప్‌డేట్‌లు మరియు ఇమేజ్‌లు అన్ని సేవ్ చేయబడి ఉంటాయి. అయితే కొత్త ఫోన్ పొందడంతో మీ మొత్తం వాట్సాప్ డేటాను కోల్పోయే భయం ఖచ్చితంగా ఉంటుంది.

 

WhatsApp

IOS నుండి Android కి మారడం వలన మీ WhatsApp మొత్తం క్లీన్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ సమస్యకు అధికారికంగా పరిష్కార మార్గం లేదు. అయితే ఇప్పుడు వాట్సాప్ వినియోగదారులందరూ తమ చాట్‌లన్నింటినీ iOS నుండి ఆండ్రాయిడ్‌కు ఏమీ కోల్పోకుండా బదిలీ చేసే ఫీచర్‌పై పనిచేస్తున్నట్లు వాట్సాప్ తన బ్లాగ్ పోస్ట్ ద్వారా ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ ని రూ.500లకే పొందవచ్చు!! కానీ...జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ ని రూ.500లకే పొందవచ్చు!! కానీ...

WhatsApp, iPhone, Samsung లింక్
 

WhatsApp, iPhone, Samsung లింక్

WhatsApp, iPhone, Samsung లింక్ యొక్క ఈ ప్రక్రియలో మీ మెసేజ్లు, వాయిస్ మెసేజ్‌లు, ఫోటోలు మరియు వీడియోలు వంటివి అన్ని కూడా వాట్సప్‌కు నేరుగా పంపబడవు. మీరు ఒక కొత్త ఫోన్ ని సెటప్ చేసినప్పుడు పాత పరికరం కొత్త పరికరానికి మీ చాట్‌లను సురక్షితంగా బదిలీ చేసే ఆప్షన్ మీకు ఇవ్వబడుతుంది" అని వాట్సాప్ బ్లాగ్ పోస్ట్‌లో రాసింది. కానీ ఇందులో ఒక సమస్య ఉంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 10 లేదా ఆపైన నడుస్తున్న శామ్‌సంగ్ పరికరంలో మాత్రమే అందుబాటులో ఉందని వాట్సాప్ ప్రకటించింది. ఇది రాబోయే రోజుల్లో మరిన్ని ఆండ్రాయిడ్ పరికరాల్లో అందుబాటులోకి వస్తుంది అని తెలిపింది.

శామ్‌సంగ్ గెలాక్సీ A52 ధరలు పెరిగాయి!! ఎంత పెరిగాయో తెలుసా??శామ్‌సంగ్ గెలాక్సీ A52 ధరలు పెరిగాయి!! ఎంత పెరిగాయో తెలుసా??

శామ్‌సంగ్ స్మార్ట్‌స్విచ్

ఐఫోన్ వినియోగదారులు తమ వాట్సాప్ డేటాను శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌కు బదిలీ చేయడానికి అవసరమైన అవసరాల యొక్క సుదీర్ఘ జాబితాను కూడా వాట్సాప్ అందించింది. ఈ జాబితాలో మొదటిది శామ్‌సంగ్ స్మార్ట్‌స్విచ్ యాప్ 3.7.22.1 లేదా అంతకంటే ఎక్కువ మీ కొత్త శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయవలసి ఉంటుంది. అలాగే మీ పాత ఫోన్ అంటే మీ ఐఫోన్‌లో iOS 2.21.160.17 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ గల WhatsApp ఉండాలి. అంతేకాకుండా మీ శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 2.21.16.20 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉన్న వాట్సాప్ ఉండాలి. అంతేకాకుండా మీరు తప్పనిసరిగా USB-C నుండి లైటింగ్ కేబుల్ కలిగి ఉండాలి. మీ ఐఫోన్‌లో మీరు ఉపయోగిస్తున్న ఫోన్ నంబర్ మీ శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్లే ఉండాలి. మీరు తప్పనిసరిగా కొత్త Android పరికరాన్ని కలిగి ఉండాలి లేదా ఫ్యాక్టరీ సెట్టింగ్‌లకు రీసెట్ చేయాలి.

శామ్‌సంగ్

మీరు పైన పేర్కొన్న అన్ని అవసరాలను కలిగి ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత మీరు కింద తెలిపే దశల వారీ మార్గదర్శిని అనుసరించవలసి ఉంటుంది.

** మొదట మీ శామ్‌సంగ్ కొత్త ఫోన్ ను ఆన్ చేయండి మరియు కేబుల్ ద్వారా ఐఫోన్‌కు కనెక్ట్ చేయండి.

** సూచనలను అనుసరించండి శామ్సంగ్ స్మార్ట్ స్విచ్ యాప్> ఐఫోన్ కెమెరాతో కొత్త పరికరంలో ప్రదర్శించబడే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి.

** మీ ఐఫోన్‌లో ప్రారంభించండి మరియు ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండండి.

** మీరు హోమ్ స్క్రీన్‌కు చేరుకున్న తర్వాత వాట్సాప్ ను ఓపెన్ చేసి మీరు మీ పాత పరికరంలో ఉపయోగిస్తున్న అదే నంబర్‌తో లాగిన్ అవ్వండి.

** తరువాత ఇంపోర్ట్ డేటా ఎంపికపై నొక్కండి మరియు ప్రక్రియను పూర్తి అయ్యే వరకు వేచి ఉండండి.

 

టెక్నిక్

ఈ టెక్నిక్ ఉపయోగించి వాట్సాప్ యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ సమాచారం, ప్రొఫైల్ ఫోటోలు, చాట్‌లు, గ్రూప్ చాట్‌లు, మీడియా మరియు సెట్టింగ్‌లను బదిలీ చేయవచ్చు. అయితే వారి కాల్ హిస్టరీ లేదా వాట్సాప్‌లోని కాంటాక్ట్‌లకు కనిపించే మీ డిస్‌ప్లే పేరు బదిలీ చేయబడదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
WhatsApp, iPhone, Samsung Link New Feature: Here are Things You May Not know About

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X