Home
News

Whatsappలో మరో కొత్త ఫీచర్.. మరింత యూజర్‌ ఫ్రెండ్లీ యాప్‌గా?

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌.. తన యూజర్ల భద్రత, సౌకర్యం కోసం అనేక ఫీచర్లను తీసుకొస్తోంది. వాట్సాప్ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo ప్రకారం అప్‌డేట్‌ ట్యాబ్‌లో సెర్చ్‌ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరీక్షల దశలో ఉన్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్‌ యూజర్లకు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మెటా నేతృత్వంలోని ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌.. ఇటీవల ఛానల్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన వ్యక్తులు, సంస్థల ఛానల్‌లో జాయిన్‌ కావచ్చు. మరియు అప్‌డేట్లు పొందవచ్చు. అయితే ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న సెర్చ్‌ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే డైరెక్టరీలోకి వెళ్లకుండా నచ్చిన ఛానల్‌ను సెర్చ్‌ చేసే అవకాశం ఉంటుంది.

WhatsApp is testing Search feature

ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ బీటా 2.23.20.16 వెర్షన్‌లో అందుబాటులో ఉంది. వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ ఆధారంగా యాప్‌ పైభాగంలో సెర్చ్ బటన్‌ రానుందని తెలుస్తోంది. ఈ సెర్చ్‌ బటన్ ద్వారా వినియోగదారులు తన స్టేటస్‌ అప్‌డేట్లు సహా ఛానల్‌లను సులభంగా గుర్తించవచ్చు. ఛానల్‌ డైరెక్టరీని తెరవకుండానే నచ్చిన ఛానల్‌ను ఓపెన్‌ చేసుకోవచ్చు.

త్వరలో అందుబాటులోకి రానున్న సెర్చ్‌ బటన్‌ వాట్సాప్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుందని తెలుస్తోంది. దీని ద్వారా మరింత సులభంగా మెసేజ్, ఫోటోలు, సమాచారాన్ని గుర్తించగలరు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరీక్షల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు అందరికి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడికాలేదు.

వాట్సాప్‌ ఇటీవలే వాట్సాప్‌ ఛానల్‌ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ తరహా ఫీచర్‌ ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌లు కలిగి ఉన్నాయి. ఈ ఫీచర్‌ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఇప్పటికే చాలా మంది వినియోగదారులకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌ ఛానల్‌లో జాయిన్‌ అయ్యే వినియోగదారుల భద్రత కోసం వాట్సాప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఫోన్‌ నంబర్ల ఇతరులకు కనిపించకుండా చర్యలు తీసుకుంది.

భారత్ సహా 150 దేశాల్లో వాట్సాప్‌ ఛానల్‌ ఫీచర్‌ను అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఫీచర్‌ ద్వారా డైరెక్టరీ నుంచి నచ్చిన ఛానల్‌ కోసం ఎంచుకోవచ్చని తెలిపింది. బిజినెస్‌, సెలబ్రిటీ, మెంబర్లు క్రియేట్‌ చేసిన ఛానల్‌లో చేరవచ్చని పేర్కొంది. మరిన్ని కొత్త ఫీచర్లు సహా ఇతర సమాచారం కోసం వాట్సాప్‌ వినియోగదారులు సంస్థ అధికారిక ఛానల్‌లో చేరవచ్చని తెలిపింది.

దీంతోపాటు వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo నివేదిక ప్రకారం.. వాట్సాప్‌ కమ్యూనిటీ గ్రూప్‌ చాట్‌ను సులభంగా గుర్తించే విధంగా కొత్త ఐకాన్‌ సహా నావిగేషన్‌ను మెరుగుపరుస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఆండ్రాయిడ్‌ బీటా టెస్టర్‌ల కోసం ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది.

వాట్సాప్‌లో నావిగేషన్‌, కమ్యూనిటీ గ్రూప్‌ చాట్‌ను సులభంగా నిర్వహించడం సహా ఉపయోగించే అవకాశం బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. ఈ కొత్త ఐకాన్‌తో గ్రూప్‌ చాట్‌లను సులభంగా గుర్తించవచ్చని వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ చెబుతోంది. అయితే ఈ ఫీచర్‌ ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. వినియోగదారులు అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Whatsapp is testing Search feature for updates tab which was added recently
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X