WhatsApp కంపానియన్ మోడ్ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోవలసిన విషయాలు!!

|

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను స్మార్ట్‌ఫోన్‌లను కలిగిఉన్న ప్రతి ఒక్కరు కూడా వినియోగిస్తున్నారు. దీని కారణంగా వాట్సాప్ ప్రజలలో అధికంగా ప్రజాదరణను పొందింది. వాట్సాప్ కూడా మరింత ఎక్కువ మంది వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను విడుదల చేస్తూ కూడా వచ్చింది. ప్రస్తుతం ఎక్కువ మంది వారి యొక్క అవసరాల దృష్ట్యా రెండు ఫోన్ లను ఉపయోగిస్తున్నారు. ఇటువంటి వినియోగదారులు ఒకే సమయంలో వేర్వేరు పరికరాల్లో తమ యొక్క వాట్సాప్ అకౌంటును ఉపయోగించాలని అనుకుంటున్నారు.

వాట్సాప్

మునుపటిలా కాకుండా ఇప్పుడు మీరు ఒకే వాట్సాప్ అకౌంటును ఒకటి కంటే ఎక్కువ పరికరాలలో ఉపయోగించవచ్చు. మరో మాటలో చెప్పాలంటే మీరు మీ ఫోన్‌ని ఏకకాలంలో కనెక్ట్ చేయనవసరం లేకుండా PC లేదా macOS కోసం వాట్సాప్ వెబ్ మరియు వాట్సాప్ లో మీ అకౌంటులోకి లాగిన్ చేయవచ్చు. కానీ ఈ ఫంక్షనాలిటీ వివిధ పరికరాలకు పరిమితం చేయబడింది. వాట్సాప్ త్వరలో మీ అకౌంటును ఒకేసారి యాప్ ద్వారా ఫోన్‌లలో ఉపయోగించడానికి అనుమతించవచ్చు.

కంపానియన్ మోడ్ కొత్త ఫీచర్

వాట్సాప్ సంస్థ ఇప్పుడు 'కంపానియన్ మోడ్' అనే కొత్త ఫీచర్ ని అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత తప్పనిసరిగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పరికరాల మధ్య చాట్ హిస్టరీను సమకాలీకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కేవలం వాట్సాప్ వినియోగదారుల కోసం టెలిగ్రామ్ వంటి మరిన్ని పరికరాలకు మద్దతును జోడిస్తోంది. WABetaInfo పాప్-అప్ ఇండికేటర్ రూపంలో ఆండ్రాయిడ్ వెర్షన్ 2.22.15.13 కోసం ఇటీవల విడుదల చేసిన వాట్సాప్ బీటాలో కంపానియన్ మోడ్‌ను గుర్తించింది. వాచ్‌డాగ్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం అనేక పరికరాలతో కనెక్ట్ చేయబడిన వాట్సాప్ సమకాలీకరణ చాట్ చరిత్రను చూపుతుంది.

వాట్సాప్ కంపానియన్ మోడ్ ఉపయోగం

వాట్సాప్ కంపానియన్ మోడ్ ఉపయోగం

వాట్సాప్ ప్రతి ఒక్కరికి వాడుకలో ఉండడంతో మీ బాస్ నుండి మీ దూరపు బంధువు వరకు ప్రతి ఒక్కరితో కూడా చాట్ చేస్తూ మీరు తెలుపవలసిన సమాచారాన్ని త్వరగా తెలపడంతో పాటుగా సందర్భోచితంగా పంపడానికి వీలుగా ఉంటుంది. మీరు రోజంతా వేర్వేరు పరికరాలతో పరస్పర చర్య చేస్తున్నందున వాట్సాప్ ప్రతి రకమైన పరికరానికి మద్దతును ఇవ్వడం అవసరంగా ఉంటుంది. ఇప్పటివరకు వాట్సాప్ అనేది స్మార్ట్‌ఫోన్‌లు, ఎంపిక చేసిన ఫీచర్ ఫోన్‌లు, PC, Mac మరియు వెబ్‌లో మాత్రమే పని చేస్తోంది. కానీ మీరు అదే అకౌంటును మీ ఫోన్ కాకుండా వేరే డివైస్ లో ఉపయోగించాలనుకుంటే వాట్సాప్ వెబ్ అనుమతిస్తుంది. కాకపోతే మీరు మీ యొక్క అదే వాట్సాప్ అకౌంటును మరొక ఫోన్‌లో కూడా ఉపయోగించవచ్చు. 'కంపానియన్ మోడ్' అందుబాటులోకి వచ్చిన తరువాత ఒకే వాట్సాప్ అకౌంటును మరొక ఫోన్ లో కూడా ఉపయోగించడానికి అనుమతిస్తుంది అని కంపెనీ తెలిపింది.

అప్ డేట్

వాట్సాప్ యొక్క తదుపరి అప్ డేట్ లో అందుబాటులోకి వచ్చే కంపానియన్ మోడ్‌తో ఒకేసారి రెండు ఫోన్‌లలో మీ అకౌంటును యాక్సిస్ చేయడానికి అనుమతిస్తుంది. మీ చాట్ హిస్టరీ అనేది మీరు యాక్సిస్ చేసిన అన్ని డివైస్ ల అంతటా సమకాలీకరించబడుతుంది. ఇది అసలు ఫోన్ నుండి ప్రభావవంతంగా తరలించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఆండ్రాయిడ్ మరియు iOS పరికరాల కోసం వాట్సప్ ప్రస్తుతం అందించే చాట్ మైగ్రేషన్ కార్యాచరణ కంటే ఇది ఖచ్చితంగా సులభంగా ఉంటుంది. ప్రస్తుత విధానంలో డేటా బదిలీ కోసం కేబుల్ అవసరం ఉంటుంది. అయితే వాట్సాప్ యొక్క కంపానియన్ మోడ్ అందుబాటులోకి రావడంతో డేటా కోసం ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుంటుంది. కానీ ఈ ఫీచర్ ఒక స్మార్ట్‌ఫోన్ మరియు PCలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లతో సహా మూడు ఇతర పరికరాలకు పరిమితం చేయబడుతుంది. అంటే ప్రాథమిక ఫోన్ కాకుండా మూడు స్మార్ట్ డిస్‌ప్లేలను దీనిని ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.

డబుల్ వెరిఫికేషన్ కోడ్

WABetaInfo యొక్క నివేదిక ప్రకారం మీరు మీ యొక్క పాత స్మార్ట్‌ఫోన్ నుండి కొత్త ఫోన్ లో మీ వాట్సాప్ అకౌంటుతో లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు "డబుల్ వెరిఫికేషన్ కోడ్" ఫీచర్ ధృవీకరణ కోడ్ యొక్క మరొక దశను చూపుతుంది. ఈ నివేదిక ప్రకారం వాట్సాప్ అకౌంటులోకి లాగిన్ చేయడానికి మొదటి ప్రయత్నం విజయవంతమయినప్పటికీ కూడా మిగిలిన ప్రక్రియను పూర్తి చేయడానికి మరో ఆరు అంకెల కోడ్ అవసరం. ఎవరైనా వాట్సాప్ లోకి లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని నిర్ధారించుకోవడానికి ఫోన్ నంబర్ కి మరొక అదనపు మెసేజ్ పంపబడుతుంది. "ఇప్పటికే మరో ఫోన్‌లో వాట్సాప్ కోసం మీ యొక్క ఈ +********** నంబర్ ఉపయోగించబడుతోంది. మీ అకౌంట్ మీ నియంత్రణలో ఉందని నిర్ధారించుకోవడంలో సహాయం చేయడానికి మీరు తప్పనిసరిగా మరొక ధృవీకరణ కోడ్‌ను నిర్ధారించాలి. అదనపు భద్రత కోసం మీరు కోడ్‌ను పంపడానికి ముందు టైమర్ పూర్తయ్యే వరకు వేచి ఉండాలి. మీరు కోడ్‌ని స్వీకరించిన తరువాత దానిని ఇక్కడ నమోదు చేయండి." అనే మెసేజ్ తో కూడిన స్క్రీన్‌షాట్ ని WABetaInfo తన యొక్క లీక్ లో పోస్ట్ చేసింది.

వాట్సాప్ గ్రూప్ చాట్‌లో గరిష్టంగా 512 మంది సభ్యుల చేరికకు అనుమతి

మెటా యాజమాన్యంలోని సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యొక్క ప్లాట్‌ఫారమ్ లోని వినియోగదారులను గ్రూప్ చాట్‌లో గరిష్టంగా 512 మంది సభ్యులను జోడించేలా కొత్త ఫీచర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. వాట్సాప్ యొక్క తాజా అప్‌డేట్ తో వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని WABInfo ఇటీవలి నివేదిక సూచించింది. ఈ ఫీచర్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. అయితే కొంతమంది వినియోగదారులు తమ వాట్సాప్‌లో ఫీచర్‌ను చూడడానికి 24 గంటలు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ను మే ప్రారంభంలో మెటా ప్రకటించింది. వాట్సాప్ యొక్క తాజా అప్‌డేట్ లో ఇంతకుముందు ఫైల్‌ల షేరింగ్ లో 100MB పరిమితి నుండి 2GB వరకు పరిమితిని కూడా వాట్సాప్ పెంచుతోంది. వ్యక్తుల నుండి మరియు గ్రూప్ చాట్‌లలో వారు స్వీకరించే నిర్దిష్ట మెసేజ్ల గురించి ప్రజలు తమ భావాలను మరియు భావోద్వేగాలను టెక్స్ట్‌లో ప్రతిస్పందనలను పంపాల్సిన అవసరం లేకుండా త్వరగా వ్యక్తీకరించడంలో సహాయపడటానికి Meta-యాజమాన్య యాప్ ఇటీవల ఎమోజి రియాక్షన్ లను కూడా పరిచయం చేసింది.

Best Mobiles in India

English summary
WhatsApp is Working 'Companion Mode' New Feature to Use The Same Account on Two Phones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X