వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. చాట్ నుంచి బయటకు వెళ్లకుండానే..
స్టార్ట్‌ఫోన్‌లు ఉన్న అధికశాతం వినియోగదారులు మెటా నేతృత్వంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను వాడుతుంటారు. యాజర్ల అభిరుచులకు అనుగుణంగా వాట్సాప్ కూడా వివిధ ఫీచర్లను ప్రవేశపెడుతుంటుంది. గత కొన్నినెలలుగా ప్రతి నెల ఏదో ఒక కొత్త ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది.
తాజాగా వాట్సాప్ అద్భుతమైన ఫీచర్‌పై పనిచేస్తోందని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo వెల్లడించింది. కొంత మంది ఆండ్రాయిడ్ టాబ్లెట్ బీటా టెస్టర్‌ల కోసం వాట్సాప్ "side by side" ఫీచర్ విడుదల చేయనుందని తెలిపింది. ఈ ఫీచర్ వినియోగదారులు ప్రస్తుత సంభాషణను కోల్పోకుండా, ఇతర కొత్త మెసేజ్‌లను కూడా చూసేందుకు వీలుంటుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లలో వాట్సాప్ ఇంటర్‌ఫేస్‌పై మరింత నియంత్రణ ఇస్తుందని ఫీచర్ ట్రాకర్ పేర్కొంది.

ఈ సైడ్ బై సైడ్ ఫీచర్ వాట్సా్ప్ స్కీ్న్‌ను రెండుగా విభజించనుంది. ఫలితంగా చిన్న డిస్‌ప్లే కలిగిన స్మార్ట్‌ఫోన్లలో చాట్ ఏరియా కూడా తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారులు ఈ ఫీచర్‌ను నిలిపివేయవచ్చు. వాట్సాప్ సెట్టింగ్‌లోకి వెళ్లి చాట్స్ ఎంపిక చేసుకొవాలి, అక్కడ కనిపిస్తున్న సైడ్ బై సైడ్ ఫీచర్‌ను నిలిపేయవచ్చు. ఈ ఫీచర్ త్వరలోనే మరింత మంది వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఫీచర్ ట్రాక్‌ర్ వెల్లడించింది.
ఇప్పటికే వివిధ ఫీచర్లను విడుదల చేస్తూ, మరిన్నివాటిపై వాట్పాప్ పనిచేస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారులు తమ వాట్సాప్ ఖాతాను నాలుగు ఫోన్లతో లింక్ చేసుకోవచ్చని వెల్లడించింది. అంటే ఇప్పటివరకు ల్యాప్‌ట్యాప్, డెస్క్‌టాప్‌లో మాత్రమే లింక్ చేసేందుకు వీలుండగా.. ఇప్పుడు ఏకంగా నాలుగు ఫోన్లలో ఒకటే వాట్సాప్‌ను లింక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని, త్వరలో అందరికీ అందుబాటులోకి రానుందని వాట్సాప్ తెలిపింది.
వాట్సాప్‌లో ఛానల్ ఫీచర్‌పైనా వనిచేస్తోందని వాట్సాప్ పీచర్ ట్రాకర్ తెలిపింది. వినియోగదారులు ఏదైనా ఛానల్‌ను ఎంచుకొని చేరితే, ఆ ఛానల్ నుంచి తమకు కావాల్సిన సమాచారం నేరుగా వస్తుందని తెలిపింది. ఏదైనా ఛానల్‌లో చేరిన తర్వాత అందులోని ఫోన్‌నంబర్లు ఎప్పటికీ ప్రైవేట్‌గానే ఉంటాయని పేర్కొంది.
వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోందని ఫీచర్ ట్రాకర్ వెల్లడించింది. వాట్సాప్ యానిమేటెడ్ ఎమోజీ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది తెలిపింది. ఈ ఫీచర్ ఇప్పటికే టెలిగ్రామ్‌లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ నుంచి వచ్చిన ఎమోజీలను మాత్రమే వినియోగిస్తుండగా.. ఈ యానిమేటెడ్ ఎమోజీ ఫీచర్ కూడా అందుబాటులోకి వస్తే,, సున్నితమైన భావాలను ఎమోజీలుగా పంపే వీలుంటుంది.
సాధారణంగా ఎదైనా కొత్త ఫోన్ నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ చేయాలంటే. మొదట మన ఫోన్‌లో ఆ కాంటాక్ట్‌ను సేవ్ చేయాల్సి ఉంటుంది. అదే ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఫీచర్ అందుబాటులోకి వస్తే నేరుగా వాట్సాప్‌లోనే కాంటాక్ట్‌ను సేవ్ చేయవచ్చు. వాట్సాప్‌లోని కాంటాక్ట్ లిస్ట్‌ను తెరిచి, న్యూ కాంటాక్ట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఒక వేళ వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటేనే ఈ ఆప్షన్ కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications








