వాట్సాప్ ఇప్పుడు కొత్త డిజైన్‌లో

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాట్సాప్‌ను ఇప్పుడు కొత్త మెటీరియల్ డిజైన్‌లో పొందవచ్చు. మునుపటి డిజైనింగ్ వర్షన్‌తో పోలిస్తే కొత్త డిజైనింగ్ ఆకట్టుకునే లుక్‌లో ఉంది. అయితే ఈ అప్‌డేట్ ప్రస్తుతానికి గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో లేదు. ఈ లేటెస్ట్ వర్షన్‌ను వాట్సాప్ అధికారిక వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు. వాట్సాప్ వర్షన్ 2.12.38లో డీప్ గ్రీన్ టైటిల్ బార్‌లో మూడు ట్యాబ్‌లను అనుసంధానం చేసారు. ఈ ట్యాబ్స్ కాల్స్, చాట్స్ ఇంకా కాంటాక్ట్‌లను సూచిస్తాయి.

వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ ఇప్పుడు అన్ని రకాల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసింది. ప్రఖ్యాత మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్‌తో సరికొత్త ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. మీరు ఆండ్రాయిడ్ యూజర్ కానట్లయితే వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ కోసం కొద్ది కాలం ఎదురు చూడక తప్పదు.


Click it and Unblock the Notifications