వాట్సాప్ సరికొత్త సవాల్!! ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారొ కనుగొనడం మరింత కష్టం...

|

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్ లను ప్రకటిస్తూ ఎక్కువ మంది వినియోగదారులను తన వైపుకు ఆకట్టుకునేలా చేస్తున్నది. కొత్త కొత్త అనేక ఫీచర్లు అందుబాటులోకి రావడంతో పాటుగా ఉపయోగించడానికి వీలుగా సులభమైన లేఅవుట్‌ను వాట్సాప్ కలిగి ఉండి వినియోగదారులు మరొక ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడం సవాలు చేస్తుంది. లొకేషన్ షేరింగ్, వీడియో లేదా వాయిస్ కాల్‌లు, ఫోటో షేరింగ్ వంటి మరిన్ని కీలకమైన ఫంక్షన్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు వాట్సాప్ తన యొక్క వినియోగదారులకు మరింత ప్రైవసీని కల్పిస్తూ కేంద్రీకృత ప్లాట్‌ఫారమ్‌ను అందించడంపై దృష్టి పెడుతోంది. ఈ కొత్త సర్వీసులో భాగంగా ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో చెప్పడం వంటివి మరింత కష్టతరం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

 

వాట్సాప్

వాట్సాప్ వినియోగదారులు ఎవరైనా తమ యొక్క ఆన్‌లైన్ స్టేటస్‌ను దాచుకునే కొత్త ఫీచర్ త్వరలో వాట్సాప్‌లో అందుబాటులోకి రానున్నట్లు ఇటీవలి ప్రకటన తెలిపింది. అంటే వినియోగదారులు తమ యొక్క ఆన్‌లైన్ గుర్తింపులను దాచగలరని దీని అర్థం. అందువల్ల మీరు ఆన్‌లైన్‌లో ఉన్నారా లేదా అని ఎవరూ తెలుసుకోలేరు. ఇది అద్భుతమైన ప్రైవసీ ఫీచర్ అయినప్పటికీ ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో చెప్పడం మీకు సవాలుగా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే కనుక ఎలా పరిశీలించాలో మీరు ముందుగా అర్థం చేసుకోవాలి.

అమెజాన్‌లో మీ బ్రౌజింగ్ హిస్టరీని దాచాలని చూస్తున్నారా? ఇలా చేయండి...అమెజాన్‌లో మీ బ్రౌజింగ్ హిస్టరీని దాచాలని చూస్తున్నారా? ఇలా చేయండి...

వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తనిఖీ చేసే విధానం
 

వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తనిఖీ చేసే విధానం

స్టెప్ 1. "చివరిగా చూసినది" లేదా "ఆన్‌లైన్" కాంటాక్ట్ లేబుల్ చాట్ విండోలో కనిపించదు.

స్టెప్ 2. కాంటాక్ట్ యొక్క ప్రొఫైల్ చిత్రం మీకు చూపబడదు.

స్టెప్ 3. మిమ్మల్ని బ్లాక్ చేసిన కాంటాక్ట్ నెంబర్ కి పంపిన ఏవైనా మెసేజ్లు ఎప్పటికీ రెండు చెక్ మార్కులను ప్రదర్శించవు. పంపిన మెసేజ్ కి కేవలం ఒక చెక్ మార్కు మాత్రమే ఉంటుంది.

స్టెప్ 4. అంతేకాకుండా మీరు ఎటువంటి కాల్స్ కూడా చేయలేరు.

 

వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవడం కష్టతరం చేయడం ఎలా?

వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవడం కష్టతరం చేయడం ఎలా?

** వాట్సాప్‌ మెసేజింగ్ యాప్‌లోని సెట్టింగ్‌ల విభాగంలో మీ ప్రొఫైల్ ఇమేజ్ మరియు స్టేటస్ కనిపించకుండా ఉండేలా ఎంచుకోవచ్చు.

** మీ ఆన్‌లైన్ స్టేటస్‌ను దాచుకునే సామర్థ్యం కూడా రాబోయే రోజుల్లో వాట్సాప్‌లోకి జోడించబడుతుంది. ఆగస్ట్ చివరి నాటికి అన్ని పరికరాలలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని ఈ నెల ప్రారంభంలో కొన్ని లీక్ లు పేర్కొన్నాయి.

** వాట్సాప్‌లో మెసేజ్లను మార్పిడి చేసుకోవడానికి వాట్సాప్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరమని గుర్తుంచుకోండి. వినియోగదారుడి యొక్క మొబైల్ డేటా నిలిపివేయబడితే కనుక వాట్సాప్‌ మీరు పంపిన మెసేజ్ ని ప్రసారం చేయదు మరియు చాట్ ఒక చెక్‌మార్క్‌ను మాత్రమే ప్రదర్శిస్తుంది. ఫలితంగా మీరు నిరోధించబడ్డారని మీరు నిర్ధారించవచ్చు.

** వాట్సాప్‌ యాప్ యొక్క ప్రైవసీ విభాగం క్రింద ఉన్న మూడు అంశాలను (ఆన్‌లైన్, ప్రొఫైల్ ఫోటో మరియు స్టేటస్) వినియోగదారు నిలిపివేస్తే ఎవరైనా "నిషేధించబడ్డారా" అని చెప్పడం కష్టం. రిసీవర్ ఇంటర్నెట్‌ను ఆన్ చేసినప్పుడు ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేయకుంటే చాట్ రెండు చెక్‌మార్క్‌లను చూపుతుంది. వాట్సాప్‌లో మీరు కాల్ కూడా చేయవచ్చు కానీ అప్పుడప్పుడు కాల్ ద్వారా కనెక్ట్ చేయకుండా మిమ్మల్ని నిరోధించే సమస్య ఉండవచ్చు.

 

Best Mobiles in India

English summary
WhatsApp Makes it Challenging to Tell if Someone Has Blocked You: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X