WhatsApp చాట్ మైగ్రేషన్ కొత్త ఫీచర్ గురించి ఆశక్తికరమైన విషయాలు...

|

స్మార్ట్ ఫోన్లను వాడుతున్న ప్రతిఒక్కరు ఇతరులతో సంభాషించడానికి ఉపయోగించే త్వరిత యాప్ లలో వాట్సాప్ ఒకటి. వాట్సాప్ చాట్‌లు మనందరికీ చాలా ముఖ్యమైనవి. ఎవరైనా ఆండ్రాయిడ్ నుండి iOS డివైస్లకు మారుతున్నప్పుడు చాట్‌లను కోల్పోవడానికి ఇష్టపడరు. చాలా సందర్భాల్లో వాట్సాప్ చాట్ హిస్టరీను తరలించే చట్టబద్ధమైన ప్రక్రియ లేనందున చాట్ హిస్టరీ డేటాను కోల్పోతు ఉంటారు. మూడవ పార్టీ యాప్ ల ద్వారా ఈ పనిని పూర్తి చేయవచ్చు కానీ వాటిపై ఎల్లప్పుడూ ఆధారపడలేరు. వాట్సాప్ ఈ సమస్యను కూడా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. వాట్సాప్ కొత్త అప్ డేట్ తో వినియోగదారుల లైఫ్ ను మరింత సులభతరం చేయడానికి యోచిస్తోంది. తాజా నివేదిక ప్రకారం ఈ యాప్ అనేక-పరికరాల లింక్‌ను అనుమతించే ఫీచరుపై పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్ క్రాస్-ప్లాట్‌ఫాం అప్ డేట్

వాట్సాప్ క్రాస్-ప్లాట్‌ఫాం అప్ డేట్

వాట్సాప్ వినియోగదారులు తమ వాట్సాప్ చాట్ హిస్టరీను ఇకమీదట సులభంగా ఆండ్రాయిడ్ నుండి iOS ఫోన్‌లకు మార్చగలరు. WABetaInfo పోస్ట్ ప్రకారం ఈ కొత్త ఫీచర్ యొక్క అభివృద్ధికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే సంస్థ వాట్సాప్ యొక్క మొత్తం అనుభవాన్ని మార్చాలని యోచిస్తోంది. బహుళ ప్లాట్‌ఫారమ్‌లకు అనుకూలంగా ఉండేలా డెవలపర్లు చాలా విషయాలు మార్చారని కూడా నివేదిక పేర్కొంది.

WABetaInfo

WABetaInfo అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో భాగస్వామ్యం చేయబడిన స్క్రీన్ షాట్ బీటా బిల్డ్ యొక్క ప్రారంభ దశను చూపుతుంది. చాట్ హిస్టరీను iOS కాని డివైస్ కు బదిలీ చేయడానికి వినియోగదారులు తమ యాప్ సంస్కరణను తాజా iOS లేదా వాట్సాప్ యొక్క Android నిర్మాణానికి అనుగుణంగా అప్ డేట్ చేయాలనీ ఇది సూచిస్తుంది. స్క్రీన్ షాట్ ప్రకారం సంస్థ క్రాస్-ప్లాట్ఫాం చాట్స్ బదిలీ మరియు అకౌంట్ లింకింగ్ పై పనిచేస్తుందని సూచిస్తుంది. ఇది ప్రారంభించినప్పటి నుండి వాట్సాప్ నుండి వచ్చిన అప్ డేట్ యొక్క ఒక హెక్ అవుతుంది.

WABetaInfo బ్లాగ్ పోస్ట్
 

WABetaInfo బ్లాగ్ కొత్త పోస్ట్ యొక్క సమాచారం ప్రకారం రాబోయే వాట్సాప్ కొత్త అప్ డేట్ యాప్ వినియోగదారులను వారి పరికరాల్లో క్రియాశీల ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వాట్సాప్ వెబ్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. వినియోగదారులు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటి కంటే ఎక్కువ క్రియాశీల చాట్ విండోలను తెరవగలరని తెలుస్తోంది. ప్రస్తుతం వినియోగదారులకు ఒక డివైస్ లో తెరిచిన వాట్సాప్ చాట్‌లను మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంది. క్రొత్త అప్ డేట్ విడుదల తేదీ గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. కానీ వాట్సాప్ త్వరలోనే ఈ స్థిరమైన అప్ డేట్ ను విడుదల చేసే అవకాశం ఉంది.

 

Source

Best Mobiles in India

English summary
WhatsApp New Chat Migration Feature: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X