WhatsApp ప్రైవసీ పాలసీ అప్‌డేట్!! యూజర్ల డేటా, ఫీచర్స్ సేఫ్...

|

ప్రస్తుత ఫాస్ట్ ప్రపంచంలో ప్రజలు అధికంగా సోషల్ మీడియా వైపు మొగ్గుచూపుతున్నారు. మరి ముఖ్యంగా త్వరిత మెసేజ్లను పంపే వాట్సాప్ ను అధికంగా వినియోగిస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా వాట్సాప్ వివాదాల మధ్యలో ఉంది. ఈ వివాదం ఎక్కువగా అప్ డేట్ ప్రైవసీ విధానం చుట్టూ ఉంది. కొత్తగా అప్‌డేట్ చేసిన ప్రైవసీ విధానాన్ని ఉపసంహరించుకోవాలని గత వారం భారత ప్రభుత్వం వాట్సాప్‌ను హెచ్చరించింది. వాట్సాప్ ఇప్పుడు భారత ప్రభుత్వం మాటలకు స్పందించి వారి యొక్క విధానానికి అండగా నిలుస్తున్నారని మరియు యూజర్ల యొక్క అన్ని చాట్లు సురక్షితంగా ఉన్నాయని హైలైట్ చేసారు.

వాట్సాప్

వాట్సాప్ ప్రతినిధి మీడియాకు ఇచ్చిన ప్రకటనలో భాగంగా "మేము భారత ప్రభుత్వ లేఖకు ప్రతిస్పందించాము. వినియోగదారుల యొక్క గోప్యత మా అత్యధిక ప్రాధాన్యతగా భావిస్తున్నాము అని వారికి హామీ ఇచ్చాము అని తెలిపారు." ఇటీవలి ప్రైవసీ కొత్త అప్‌డేట్ ప్రజల వ్యక్తిగత మెసేజ్ల గోప్యతను రిమైండర్‌గా మార్చదు. ప్రజలు వ్యాపారాలను ఎంచుకుంటే వారు ఎలా సంభాషించవచ్చనే దాని గురించి అదనపు సమాచారాన్ని అందించడం దీని ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. "

వాట్సాప్ కొత్త అప్‌డేట్

వాట్సాప్ యొక్క కొత్త అప్‌డేట్ ప్రైవసీ విధానాన్ని అంగీకరించని వినియోగదారులు గతంలో ప్రకటించినట్లుగా ఇకపై ఫీచర్లను కోల్పోరని వాట్సాప్ తెలిపింది. ఇది ముందుమాదిరిగానే సురక్షిత మెసేజ్ ప్లాట్‌ఫాంగా ఉంది. "రాబోయే వారాల్లో వాట్సాప్ ఎలా పనిచేస్తుందో దాని యొక్క కార్యాచరణను మేము పరిమితం చేయము. బదులుగా మేము ఎప్పటికప్పుడు అప్‌డేట్ గురించి వినియోగదారులకు గుర్తు చేస్తూనే ఉంటాము. అలాగే ప్రజలు ఎంచుకున్న ఫేస్‌బుక్ అకౌంట్ నుండి మద్దతు పొందుతున్న వ్యాపారంతో కమ్యూనికేట్ చేయడం వంటి సంబంధిత ఐచ్ఛిక లక్షణాలను ఉపయోగించవచ్చు అని తెలిపింది. "ఈ విధానం వినియోగదారులందరూ వ్యాపారంతో సంభాషించాలనుకుంటున్నారా లేదా అనే ఎంపికను బలపరుస్తుందని మేము ఆశిస్తున్నాము. అలాగే కనీసం రాబోయే PDP చట్టం అమల్లోకి వచ్చే వరకు మేము ఈ విధానాన్ని కొనసాగిస్తాము అని వాట్సాప్ ప్రతినిధి తెలిపారు. "

వాట్సాప్ గోప్యతా విధానం

వాట్సాప్ గోప్యతా విధానం మే 15 న అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి వాట్సాప్ ప్రైవసీ విధాన అప్‌డేట్ను అంగీకరించమని వినియోగదారులకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తోంది. దీర్ఘకాలంలో పాలసీని అంగీకరించడంలో విఫలమైన వినియోగదారులు చివరికి అనేక కీలక కార్యాచరణలకు ప్రాప్యతను కోల్పోతారు అని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ఇంతకుముందు తెలిపింది. తాజా ప్రకటనలో వాట్సాప్ అలాంటిదేమీ జరగదని ధృవీకరించింది. అంతేకాకుండా ఈ విధానాన్ని అంగీకరించని వినియోగదారులు దీర్ఘకాలంలో ఏ ఫీచర్ కు యాక్సిస్ ను కోల్పోరు అని కూడా తెలిపింది.

Best Mobiles in India

English summary
WhatsApp New Privacy Policy Latest Update: WhatsApp Now Respond The Indian Government Letter

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X